కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే హామీలన్నీ నెరవేరుతాయని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు (శనివారం) బీహార్ కుల గణనను దేశానికి 'ఎక్స్-రే'గా అభివర్ణించారు.
పేదలు ఎవరని మనం ఎప్పుడైనా ఆలోచించామా..? ఎంతమంది పేదలు ఉన్నారు. వారంతా ఏ స్థితిలో ఉన్నారు. వీటన్నింటిని తెలుసుకోవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. బీహార్‌లో నిర్వహించిన కుల గణనలో 88 శాతం మంది పేదలు (దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలు) ఉన్నట్లు తెలిసిందని రాహుల్ గాంధీ వెల్లడించారు.
బీహార్ కులగణన రిపోర్ట్ కేవలం చిన్న సంగ్రహావలోకమే అని రాహుల్ గాంధీ అన్నారు. కాబట్టి 'క్యాస్ట్ కౌంటింగ్, ఎకనామిక్ మ్యాపింగ్' అవసరమని, దీని ఆధారంగా 50 శాతం రిజర్వేషన్ పరిమితిని నిర్మూలిస్తామని ఆయన అన్నారు. దీని ద్వారా రిజర్వేషన్లు, హక్కులు వంటి వాటిని ప్రఒక్కరికి కల్పించడానికి వీలుంటుందని అన్నారు.
ఈ గణన మిమ్మల్ని కష్టాల చీకట్లోంచి వెలుగు వైపు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని, ఇది 'న్యాయానికి మొదటి అడుగు' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంతే కాకుండా సాధారణ కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన యువత కూడా తమ సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు వీలుగా.. వారిలో వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా రూ.5,000 కోట్ల ప్రత్యేక కార్పస్‌ను రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment