దేశంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ డిపాజిట్‌ను సైతం కోల్పోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీ ఫ్యామిలీ దూరంగా ఉండి.. ఎన్నికలు నిర్వహించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ చీఫ్‌గా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు.
అయితే, తాజాగా కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కాగా, సల్మాన్ ఖుర్షీద్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ గాంధీ కుటుంబీకులే నేతృత్వం వహిస్తున్నారని స్పష్టం చేశారు. తమ పార్టీలో చాలా మంది నేతలున్నా కీలక నేతలు మాత్రం గాంధీ కుటుంబీకులేనని చెప్పారు. మల్లికార్జున ఖర్గే.. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడని, పార్టీని సంస్ధాగతంగా పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకొచ్చారు.
ఇక, సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడిగా బీజేపీ పేర్కొంది. ఈ క్రమంలో బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటీయా స్పందిస్తూ.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరున్నా నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మాత్రమే ఉంటుంది. అందుకే ఖర్గేను.. రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంట్ అని పిలవాలా?.. లేక రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ అనాలా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment