Viral: BJP Sonia Become UP Baliakheri Block President Where Husband Works As Sweeper - Sakshi
Sakshi News home page

భర్త స్వీపర్‌..అదే అఫీసులో ఉన్నత స్థాయి అధికారిణిగా భార్య

Published Thu, Jul 15 2021 5:07 PM | Last Updated on Fri, Jul 16 2021 10:48 AM

Up: Bjp Sonia Becomes Chief Of Up Block Where Her Husband Works Sweeper - Sakshi

BJP Sonia: తాను స్వీప‌ర్‌గా ప‌ని చేస్తున్న ఆఫీసులోనే త‌న భార్య బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రిస్తుందని ఏ భ‌ర్త క‌ల‌లో కూడా ఊహించ‌డు. కానీ ఇది నిజంగానే ఓ వ్యక్తి జీవితంలో జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్హేరా గుజ్జర్ గ్రామంలో నివసిస్తున్న సునీల్, బలియాఖేరి డెవలప్‌మెంట్ బ్లాక్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవ‌ల యూపీలో బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రగగా, అందులో తన భార్య సోనియా 55 వ వార్డు నుంచి బీడీసీ ఎన్నికలలో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించింది.

ఆ త‌ర్వాత బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్‌ అధికారి పోస్టుకు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. ఆ పోస్టును షెడ్యూల్ కుల వర్గానికి కేటాయించారు. ఈ క్రమంలో ఆ ప్రాంత బీజేపీ నాయకుడు, జిల్లా పంచాయతీ సభ్యుడు ముఖేష్ చౌదరి నిర్ణయం మేరకు విద్యావంతురాలైన సోనియాను నిలబెట్టాడు. ఈ ఎన్నిక‌లో కూడా ఆమె సూనయాసంగా విజ‌యం సాధించింది. ఈ క్రమంలో బ‌లియాఖేరి బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీసులో తన భ‌ర్త స్వీప‌ర్‌గా ప‌ని చేస్తున్న కార్యాలయంలోనే సోనియా అధికారిగా బాధ్యతలు చేపట్టింది. ఇదిలా ఉండగా సోనియా బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్‌గా ఎన్నికైన‌ప్ప‌టికీ.. త‌న స్వీప‌ర్ ఉద్యోగాన్ని కొనసాగిస్తానని ఆమె భ‌ర్త సునీల్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా సోనియా మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో తన భర్త, ఆమె కుటుంబం మద్దతు ఇచ్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. త‌న భ‌ర్త ఉద్యోగం చేయ‌డం వ‌ల్లే కుటుంబాన్ని పోషించుకోగ‌లుగుతున్నామ‌ని సోనియా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement