కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ! | A Blow to the Manipur Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ!

Published Wed, Aug 12 2020 8:29 AM | Last Updated on Wed, Aug 12 2020 8:29 AM

A Blow to the Manipur Congress - Sakshi

ఇంఫాల్‌: కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన విప్‌ను ధిక్కరించి సోమవారం జరిగిన ఒక్క రోజు అసెంబ్లీ సమావేశానికి కొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే.  గైర్హాజరైన 8 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు తమ రాజీనామాలను స్పీకర్‌ యుమ్నమ్‌ కెంచంద్‌ సింగ్‌కు సమర్పించారు. అయితే వీరిలో ఐదుగురి రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ తెలిపారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ సభ్యత్వానికి కూడా రాజీనామాలు పంపారు.  బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి అసెంబ్లీలో 29 ఎమ్మెల్యేల బలం ఉండగా, కాంగ్రెస్‌కు 24 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 8 మంది రాకపోవడంతో ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కింది.

చదవండి: మళ్లీ బీజేపీలోకి ఆ నలుగురు ఎమ్మెల్యేలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement