విద్యార్థుల భవిష్యత్తును చెడగొడతారా?: బాంబే హైకోర్ట్‌ | Bombay High Court Slams Decision To Cancel Maharashtra SSC Exams | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవిష్యత్తును చెడగొడతారా?: బాంబే హైకోర్ట్‌

Published Fri, May 21 2021 2:52 AM | Last Updated on Fri, May 21 2021 2:52 AM

Bombay High Court Slams Decision To Cancel Maharashtra SSC Exams - Sakshi

ముంబై: పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వం ఏప్రిల్‌లో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ధనంజయ్‌ కులకర్ణి అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ‘మీరు విద్యావ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు.

పాఠశాల విద్యలో ఆఖరుదైన పదో తరగతి చాలా ముఖ్యమైంది. పరీక్షలు కూడా అంతే. మహమ్మారి వంకతో పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు పంపిస్తారా? విద్యార్థుల భవిష్యత్తును చెడగొడతారా? అలా అయితే, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దేవుడే కాపాడాలి’అని వ్యాఖ్యానించింది. ‘12వ తరగతి పరీక్షలను నిర్వహిస్తూ 10వ తరగతికే ఎందుకు రద్దు చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement