ఒకప్పుడు వధూవరులు తమ వివాహ వేడుకలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సంకోచించేవారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లి వేడుకను వినూత్నంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా పెళ్లిలో ఫన్నీ, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు వధూవరులు చేసే వింత పనులు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో వధూవరుల కబడ్డీ ఆటాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ పెళ్లి వేడుకలో వధూవరుల దండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. అయితే మొదట వరుడి మెడలో వధువు దండ వేయగా.. వరుడి వంతు వచ్చే సమయానికి పెళ్లి కూతురు ఆట మొదలెట్టింది. పెళ్లి వేదికపై అటూ.. ఇటూ.. పరుగెత్తుతూ పెళ్లి కొడుకుకి పట్టుకోమన్నట్లు సవాలు విసిరింది. కొంతసేపు ఇద్దరూ పట్టుకో.. పరుగుపందెం ఆట ఆడారు. ఇక వరుడికి బంధువులు కొంత సహాయం చేయడంతో వధువు మెడలో వరుడు దండ వేశాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఇది ఆటలు ఆడే స్థలం కాదు.. కొద్దిగా పక్కకు వెళ్లి ఆడుకోండమ్మా!’’ అంటూ చమత్కరించాడు. ఇక మరో నెటిజన్ ‘‘ఇద్దరి చెవుల్లో గుసగుసలు మొదలైనపుడే అనుకున్నాను. ఏదో తిక్క పని చేస్తారు.’’ అని అంటూ ఘాటుగా స్పందించాడు. ఈ ఈ వీడియోను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మనీశ్ మిశ్రా అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది.
यूं तो यह जयमाल का दृश्य है, पर दुल्हन की हरकत देखकर लगता है कि वो कबड्डी खेलने के इरादे से आई थी।
— Manish Mishra (@mmanishmishra) July 23, 2021
दूल्हे के दोस्तों का धन्यवाद जिन्होंने जयमाल सम्पन्न करवाने में मदद की। @navalkant @sengarlive @candidbhanot @PANKAJPARASHAR_ @nadeemNBT pic.twitter.com/cDzH0o8rQx
Comments
Please login to add a commentAdd a comment