Bride and bride groom
-
పెళ్ళిలో ఏనుగులు హల్ చల్.. బైక్ మీద పారిపోయిన కొత్త జంట..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ జార్ గ్రామ్ గ్రామంలో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడైనా విందు భోజనం వాసన వస్తే చాలు ఇట్టే పసిగట్టి క్షణాల్లో వాలిపోయి మొత్తం ఆహారాన్ని లాగించేస్తున్నాయి. తాజాగా జార్ గ్రామ్ లో ఓ పెళ్ళిలో ఏనుగులు ఇలాగే హల్ చల్ చేయడంతో అతిథులంతా చెల్లాచెదురు కాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం బైక్ పైన ఉడాయించారు. ఇటీవలి కాలంలో జార్ గ్రామ్ గ్రామ సరిహద్దుల్లో ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఊళ్ళో ఎక్కడ భోజనం వాసన వచ్చినా వెంటనే వెళ్లి ఆవురావురుమంటూ లాగించేస్తున్నాయి. అందుకే స్థానికంగా ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా, ఫంక్షన్లు చేయాలన్నా వణికిపోతున్నారు. ఆదివారం జార్ గ్రామ్ సమీపంలోని జోవాల్ భంగా గ్రామంలో తన్మోయ్ సింఘా, మంపి సింఘా వివాహం జరుగుతుండగా వివాహ కార్యక్రమం అప్పుడే పూర్తై అతిధులు భోజనాలకు సిద్ధమవుతున్నారు. అంతలో రొయ్యలు, ఉలవచారు, బంగాళాదుంపల కుర్మాలతో కూడిన మెనూ వాసనలు వెదజల్లుతూ ఏనుగులను స్పృశించాయి. ఇంకేముంది ఆహ్వానం లేకుండానే పెళ్ళికి వచ్చి అతిధుల కంటే ముందే విందునారగించేందుకు తయారయ్యాయి. కళ్యాణ మండపంలో అవి చేసిన రాద్ధాంతానికి అతిథులంతా భయభ్రాంతులకు గురై చెల్లాచెదురుగా పారిపోయి చుట్టుపక్కల ఇళ్లలో నక్కారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం ఎలాగోలా బైక్ ఒకటి సంపాదించి దానిపైన పారిపోయారు. చాలా రోజులుగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు ఏనుగులకు భయపడి ఏ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఇక్కడి అభ్యర్థులు ఏనుగుల గుంపులు భయపడి ఆర్భాటాలు చేయకుండా బిక్కుబిక్కుమంటూ ప్రచారాన్ని నిర్వహించారు. ఇది కూడా చదవండి: తండ్రి మీద కోపంతో పిల్లలను కారుతో గుద్దించి.. -
Viral Video: వరుడిని పూల్‌లోకి తోసిన వధువు.. తర్వాత వాటర్‌లో ఆమె..
Viral Video..ప్రజెంట్ జనరేషన్లో మ్యారేజ్ స్టైల్ మారిపోయింది. పెళ్లికి ముందు ఫొటో షూట్ దగ్గర నుంచి పెళ్లి టైమ్ వరకు అంతా కొత్తగా ఉండాలని వధువరులు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మనం ఫొటో షూట్స్ జరిగిన ఎన్నో ఫన్నీ సీన్స్ చూశాం. తాజాగా ఓ వధువు చేసిన పని.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెళ్లి కోసం ఎంతో బ్యూటిఫుల్‌గా రెడీ అయిన కపుల్స్ ఫొటోల కోసం క్యాట్ వాక్ చేస్తూ వస్తుండగా.. వధువు ఒక్కసారిగా వరుడిని పక్కనే స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేస్తుంది. View this post on Instagram A post shared by Adorable Weddings❤️ (@theadorableweddings) ఇంతలో వరుడు కూడా ఆమెను పుల్లోకి లాగేస్తాడు. దీంతో నీటిలో వారిద్దరీ పూల్‌లో పడిపోతారు. అనంతరం వధువు ఎంతో ఆనందంగా వరుడిని కిస్ చేస్తూ స్మైల్ ఇవ్వడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ వధువు.. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుందని ఫన్నీ కామెంట్ చేశాడు. -
వదినమ్మ స్టెప్పులు.. ఫిదా అయిన నెటిజన్లు.. వైరల్ వీడియో
పచ్చని తోరణం.. చుట్టూ చుట్టాలు.. తప్పెట్లు, తాళాలు.. ఎక్కడ చూసిన హడావుడి. ఇది సాధారణంగా పెళ్లిలో కనిపించే హంగామా. అత్తారింటికి దారేది సినిమాలో హీరో పవన్ కళ్యాణ్.. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు.. అప్పటి వరకు జరిగిన పెళ్లి వేడుకకు ఓ లెక్క ఉంటే.. బరాత్‌లో ఉండే దూమ్.. దామ్ మరో ఎత్తుకు తీసుకెళ్తుంది. ముంబై: మహారాష్ట్రలోని ఓ పెళ్లివేడుకలో వధూవరులను గుర్రపు రథంపై ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో.. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ నటించిన బాలీవుడ్ హిట్ సినిమా 'హమ్ ఆప్కే హై కౌన్' నుంచి 'ఐ హై శుభ్ గదీ, ఆజ్ బని మెయిన్ బాడి' అనే పాటకు ఓ మహిళ వేసిన డ్యాన్స్ నెటిజన్లను మెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను మహారాష్ట్రలోని ధరంగన్కు చెందిన దినేష్ దేశ్ ముఖ్ అనే ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 50 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ స్టెప్పులు వేసిన వ్యక్తి పెళ్లి కుమారుడి వదినే కావడం. ఇక ఈ వదినమ్మ డ్యాన్స్‌కు ఫిదా అయిన లక్షల మంది నెటిజన్లు లైక్‌లు కొట్టి, కామెంట్లు చేస్తున్నారు. ‘‘డ్యాన్స్ అదిరింది. వధూవరులతో కూడా ఓ స్టెప్ వేయిస్తే.. బాగుంటుంది వదినమ్మా.’’ అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Dinesh Deshmukh (@dinesh.vastav) -
స్టేజిపై వరుడుని ఆట పట్టించిన వధువు!
ఒకప్పుడు వధూవరులు తమ వివాహ వేడుకలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సంకోచించేవారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లి వేడుకను వినూత్నంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా పెళ్లిలో ఫన్నీ, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు వధూవరులు చేసే వింత పనులు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో వధూవరుల కబడ్డీ ఆటాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ పెళ్లి వేడుకలో వధూవరుల దండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. అయితే మొదట వరుడి మెడలో వధువు దండ వేయగా.. వరుడి వంతు వచ్చే సమయానికి పెళ్లి కూతురు ఆట మొదలెట్టింది. పెళ్లి వేదికపై అటూ.. ఇటూ.. పరుగెత్తుతూ పెళ్లి కొడుకుకి పట్టుకోమన్నట్లు సవాలు విసిరింది. కొంతసేపు ఇద్దరూ పట్టుకో.. పరుగుపందెం ఆట ఆడారు. ఇక వరుడికి బంధువులు కొంత సహాయం చేయడంతో వధువు మెడలో వరుడు దండ వేశాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఇది ఆటలు ఆడే స్థలం కాదు.. కొద్దిగా పక్కకు వెళ్లి ఆడుకోండమ్మా!’’ అంటూ చమత్కరించాడు. ఇక మరో నెటిజన్ ‘‘ఇద్దరి చెవుల్లో గుసగుసలు మొదలైనపుడే అనుకున్నాను. ఏదో తిక్క పని చేస్తారు.’’ అని అంటూ ఘాటుగా స్పందించాడు. ఈ ఈ వీడియోను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మనీశ్ మిశ్రా అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది. यूं तो यह जयमाल का दृश्य है, पर दुल्हन की हरकत देखकर लगता है कि वो कबड्डी खेलने के इरादे से आई थी। दूल्हे के दोस्तों का धन्यवाद जिन्होंने जयमाल सम्पन्न करवाने में मदद की। @navalkant @sengarlive @candidbhanot @PANKAJPARASHAR_ @nadeemNBT pic.twitter.com/cDzH0o8rQx — Manish Mishra (@mmanishmishra) July 23, 2021 -
క్వారంటైన్ పాలైన కొత్త జంట
భోపాల్ : కరోనా..అందరి జీవితాల్లో పెను మార్పులకు దారి తీసింది. పెళ్లయిన కొద్ది గంటలకే కొత్త జంటను క్వారంటైన్ పాలు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నూతన దంపతులతో పాటు 100 మందికి పైగానే బంధువులు,కుటుంబసభ్యులుకూడా ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. ఇంతకీ అసలు ఏమైందంటే.. మే 26న మధ్యప్రదేశ్‌లో ఈ జంట వివాహం జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులందరూ హాజరయ్యారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) లో పనిచేసే వధువు బావ.. పెళ్లి వేడుకకు హాజరవుదామని స్వస్థలానికి చేరుకున్నాడు. జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. చింద్వారాలోని జున్నార్డియో ప్రాంత నివాసి అయిన ఆయన..పలువురు బంధువులను కలిశాడు, పెళ్లి వేడుకలోనూ బంధు మిత్రులతో సరదాగా గడిపాడు. (క్వారంటైన్లో విషాదం; చిన్నారి మృతి ) మే 26న మరదలి వివాహం ఉండగా.. ముందు రోజు జలుబు, దగ్గు తీవ్రతరం కావడంతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకోగా, పెళ్లి తంతు రోజే కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కరోనా బాధితుడి కుటుంబసభ్యులు నూతన వధూవరులతో సహా వివాహానికి హాజరైన పలువురిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఇంకా ఎవరెవరు పెళ్లికి హాజరయ్యారు కరోనా బాధితుడి గత కొన్ని రోజులుగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడన్న సమాచారం సేకరిస్తున్నామని చింద్వారా కలెక్టర్ సౌరభ్ సుమన్ తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమైన వ్యక్తిపై తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ('జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ కోచింగ్' ) -
తెల్లారితే పెళ్లి.. వధువు అదృశ్యం
బంజారాహిల్స్: మరికాసేపట్లో... పెళ్లి జరుగనుండగా పెళ్లి కూతురు అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఫిలింనగర్ సమీపంలోని హకీంపేట్‌కు చెందిన సంతోషి(19) వివాహం సికింద్రాబాద్‌కు చెందిన జైపాల్‌తో నిశ్చయమైంది. గురువారం ఉదయం జుమ్మరాత్బజార్లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం వధువు, వరుడి ఇళ్లల్లో పెళ్లికొడుకు, పెళ్లికూతురును చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే బుధవారం ఉదయం 10గంటల ప్రాంతంలో ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్లిన సంతోషి మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరి స్వప్న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పేద వధూవరులకు వివాహం
తెనాలి: పట్టణంలోని శ్రీవాసవి సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం పేద ఆర్యవైశ్య వధూవరులకు వివాహం జరిపించారు. విజయవాడ వాస్తవ్యులు జల్లా వెంకటేశ్వర్లు, అన్నపూర్ణల కుమార్తె మాధవి వెంకట దుర్గ జ్యోత్స్నకు, నకిరికల్లు మండలం రూపినగుంట్లకు చెందిన సోము వెంకటేశ్వర్లు, శిరోమణి కుమారుడు శివరామాంజనేయులుకు వైశ్యవిద్యానిధి హాస్టలు ఆవరణలో వివాహం చేశారు. సంస్థ అధ్యక్షుడు చీమకుర్తి కృష్ణమూర్తి, కార్యదర్శి పెండేల సుబ్బారావు, మాడిశెట్టి గౌరేశ్వరరావు, కొణిజేటి వెంకటేశ్వరరావు, తాళ్లూరి లక్ష్మీనారాయణ, పెండేల వెంకటేశ్వర్లు, మద్ది రామకోటేశ్వరరావు, తాలిశెట్టి సుధాకరరావు, ఆలమూరి మురళి తదితరులు పాల్గొన్నారు.