Viral Video, Sister In Law Dances On Famous Bollywood Song At Brother In Law Wedding - Sakshi
Sakshi News home page

మరిది పెళ్లి బారాత్‌లో వదినమ్మ డ్యాన్స్‌.. నెటిజన్లు ఫిదా!

Published Wed, Jul 28 2021 1:01 PM | Last Updated on Thu, Jul 29 2021 12:49 PM

Sister In Law Dances On Famous Bollywood Song At Brother In Law Wedding - Sakshi

పచ్చని తోరణం.. చుట్టూ చుట్టాలు.. తప్పెట్లు, తాళాలు.. ఎక్కడ చూసిన హడావుడి. ఇది సాధారణంగా పెళ్లిలో కనిపించే హంగామా. అత్తారింటికి దారేది సినిమాలో హీరో పవన్‌ కళ్యాణ్‌.. లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు.. అప్పటి వరకు జరిగిన పెళ్లి వేడుకకు ఓ లెక్క ఉంటే.. బరాత్‌లో ఉండే దూమ్‌.. దామ్‌ మరో ఎత్తుకు తీసుకెళ్తుంది.

ముంబై: మహారాష్ట్రలోని ఓ పెళ్లివేడుకలో వధూవరులను గుర్రపు రథంపై ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో.. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ నటించిన బాలీవుడ్ హిట్‌ సినిమా 'హమ్ ఆప్కే హై కౌన్' నుంచి  'ఐ హై శుభ్ గదీ, ఆజ్ బని మెయిన్ బాడి' అనే పాటకు ఓ మహిళ వేసిన డ్యాన్స్‌ నెటిజన్లను మెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఈ వీడియోను మహారాష్ట్రలోని ధరంగన్‌కు చెందిన దినేష్ దేశ్ ముఖ్ అనే ఫోటోగ్రాఫర్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేయగా.. 50 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు.  ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ స్టెప్పులు వేసిన వ్యక్తి పెళ్లి కుమారుడి వదినే కావడం. ఇక ఈ వదినమ్మ డ్యాన్స్‌కు ఫిదా అయిన లక్షల మంది నెటిజన్లు లైక్‌లు కొట్టి, కామెంట్లు చేస్తున్నారు. ‘‘డ్యాన్స్‌ అదిరింది. వధూవరులతో కూడా ఓ స్టెప్‌ వేయిస్తే.. బాగుంటుంది వదినమ్మా.’’ అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement