భోపాల్ : కరోనా..అందరి జీవితాల్లో పెను మార్పులకు దారి తీసింది. పెళ్లయిన కొద్ది గంటలకే కొత్త జంటను క్వారంటైన్ పాలు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నూతన దంపతులతో పాటు 100 మందికి పైగానే బంధువులు,కుటుంబసభ్యులుకూడా ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. ఇంతకీ అసలు ఏమైందంటే.. మే 26న మధ్యప్రదేశ్‌లో ఈ జంట వివాహం జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులందరూ హాజరయ్యారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) లో పనిచేసే వధువు బావ.. పెళ్లి వేడుకకు హాజరవుదామని స్వస్థలానికి చేరుకున్నాడు. జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. చింద్వారాలోని జున్నార్డియో ప్రాంత నివాసి అయిన ఆయన..పలువురు బంధువులను కలిశాడు, పెళ్లి వేడుకలోనూ బంధు మిత్రులతో సరదాగా గడిపాడు. (క్వారంటైన్‌లో విషాదం; చిన్నారి మృతి )
మే 26న మరదలి వివాహం ఉండగా.. ముందు రోజు జలుబు, దగ్గు తీవ్రతరం కావడంతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకోగా, పెళ్లి తంతు రోజే కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కరోనా బాధితుడి కుటుంబసభ్యులు నూతన వధూవరులతో సహా వివాహానికి హాజరైన పలువురిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఇంకా ఎవరెవరు పెళ్లికి హాజరయ్యారు కరోనా బాధితుడి గత కొన్ని రోజులుగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడన్న సమాచారం సేకరిస్తున్నామని చింద్వారా కలెక్టర్ సౌరభ్ సుమన్ తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమైన వ్యక్తిపై తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ('జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ కోచింగ్' )
Comments
Please login to add a commentAdd a comment