ఢిల్లీ: రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు. పోలవరం, రీసోర్స్ గ్యాప్ కింద నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ప్రధానికి సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు.
కాగా, ప్రధానితో సీఎం జగన్ భేటీ తర్వాత కేంద్రంలో కదలిక వచ్చింది. ఏపీ సమస్యల పరిష్కారంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా ఏపీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి స్వామినాథన్ కమిటీ నేతృత్వంలో సమావేశం జరుగునుంది. ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం హాజరుకానుంది. దీనిలో భాగంగా ఇదివరకే ఆర్థికశాఖ కార్యాలయంలో ఏపీ బృందం సమావేశమయ్యింది. డెలిగేషన్ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, డెలిగేషన్ వైస్ చైర్మన్‌గా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment