
సాక్షి, న్యూఢిల్లీ : రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. దీంతో శనివారం నాటి చర్చలు ఫలితానివ్వకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న మరోసారి చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. రైతులు మాత్రం డిసెంబర్ 8న భారత్ బంద్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాగా, ఈ మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ నేతృత్వంలో రైతులతో చర్చలు మొదలయ్యాయి. దాదాపు నాలుగున్నర గంటలపాటు సుధీర్ఘంగా చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతుల డిమాండ్లపై కేంద్రం ఓ మెట్టు దిగి సహేతుక డిమాండ్‌ల అమలుకు ఇబ్బంది లేదని తెలిపింది. కనీస మద్దతు ధర చట్టం తెచ్చేందుకు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వివాదంలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సుముఖత తెలిపింది. ప్రైవేట్ మండీలలో రిజిస్ట్రర్డ్ సంస్థలకే కొనుగోలు అవకాశం, సవరణల కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసే యోచన చేసింది. అయితే.. సవరణలు వద్దని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు భీష్మించుకుని కూర్చున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment