న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన నూతన విధానం ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ల సేకరణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని దేశవ్యాప్తంగా పలు ప్రైవేట్ ఆసుపత్రులు వెల్లడించాయి. అందుకే వ్యాక్సినేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపాయి. వ్యాక్సిన్ల కోసం భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయిందని పేర్కొన్నాయి. సీరంలో గవర్నమెంట్, రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రకాశ్‌కుమార్ సింగ్ ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు.
‘మీ(ఆరోగ్య శాఖ) ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి ఎలాంటి ఆర్డర్లు, పేమెంట్లు తీసుకోవడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్లు సరఫరా చేసే విషయంలో మీనుంచి రోడ్‌మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాం’’అని లేఖలో పేర్కొన్నారు. కేంద్రమే అన్ని వయసుల వారికి జూన్ 21 నుంచి ఉచితంగా టీకాలు సరఫరా చేస్తుందని, దీనికోసం తయారీదారులు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 75 శాతాన్ని కేంద్రమే సేకరిస్తుందని ప్రధాని ప్రకటించిన విషయం విదితమే. మిగిలిన 25 శాతాన్ని ప్రైవేటు ఆసుపత్రులు సేకరించుకోవచ్చని తెలిపినా విధివిధానాల్లో అస్పష్టత వల్ల ప్రైవేటుకు టీకా సరఫరా ఆగింది. వ్యాక్సిన్లపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు వ్యాక్సిన్ల ఉత్పత్తి సంస్థలు సైతం తమకు స్పష్టత ఇవ్వడం లేదని ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్ డైరెక్టర్ ఎస్‌సీఎల్‌గుప్తా చెప్పారు.
ఇక్కడ చదవండి:
దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్లు
Comments
Please login to add a commentAdd a comment