ఇస్రోకు అభినందనల వెల్లువ | Chandrayaan-3 Landing Success; Congratulations To ISRO - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-3 సూపర్‌సక్సెస్‌.. ఇస్రో సైంటిస్టుల శ్రమను కొనియాడుతున్న దేశం

Published Wed, Aug 23 2023 6:51 PM | Last Updated on Wed, Aug 23 2023 8:21 PM

Chandrayaan 3 Landing Success Congratulations To ISRO - Sakshi

చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలు మోపాక.. ఆ ఉద్విగ్న క్షణాల మధ్య సంతోషాన్ని పంచుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇస్రో సైంటిస్టులు మాత్రమే కాదు.. యావత్‌ దేశం ఆ క్షణాల్ని గర్వంగా భావించింది. ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు పడ్డ కృషిని ప్రజలు, ప్రముఖులు కొనియాడుతున్నారు. 


ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాన మోదీ అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్‌గా చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌కు వీక్షించారాయన. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. బ్రిక్స్‌ సమావేశంలో ఉన్నా నా మనసంతా చంద్రయాన్‌-3 మీదే ఉంది. చంద్రయాన్‌-3 ప్రయోగంతో విజయవంతంతో నా జీవితం ధన్యమైంది. చ్రందయాన్‌-3 విజయం నవభారత జయధ్వానం. ఈ రోజును భారత్‌ ఎప్పుడూ మర్చిపోదు అని తెలిపారాయన.  

ఇక.. మీతో పాటు నేను కూడా నా గమ్యనాన్ని చేరుకున్నానంటూ చంద్రయాన్‌-3 ఇచ్చిన సందేశాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసింది ఇస్రో. 

దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాదించినందుకు గర్వంగా ఉందంటూ చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌పై ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రయాన్‌ సక్సెస్‌ కావాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. తన తోటి సైంటిస్టులకు అభినందనలు తెలిపారాయన. అలాగే.. చం‍ద్రయాన్‌-3 ప్రయోగంలో ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 

చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు మోపాలనే శాస్త్రీయ పరిశోధనల వెనుక దశాబ్దాల కృషి ఉంది. ఇవాళ సాధించిన ఘనతకు గానూ ఇస్రో బృందానికి అభినందనలు అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.  

చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైన సమయంలో ఇస్రోను యావత్‌ దేశం వెన్నంటి నిలిచింది.  ఆ సమయంలో ఇస్రో చైర్మన్‌ శివన్‌ కంటతడి పెట్టగా.. ప్రధాని మోదీ స్వయంగా ఓదార్చారు.  ఆ ఓటమి నుంచి ఇస్రో పాఠాలు నేర్చింది. చంద్రయాన్‌-3లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పడింది. దానికి తోడు అ‍త్యాధునిక సాంకేతికత తోడు కావడంతో చంద్రయాన్‌-3 ప్రయోగంపై మొదటి నుంచి ఇస్రో కాన్ఫిడెన్స్‌గా ఉంటూ వచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తలకు తగ్గట్లుగానే విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలుమోపడమే కాదు.. సౌత్‌ పోల్‌పై అడుగుమోపిన తొలి దేశంగా అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది.  


ఇక.. ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌ అభినందనలు తెలియజేశారు. భారత్‌ చరిత్ర సృష్టించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement