చార్‌ధామ్ యాత్రకు తరలివస్తున్న భక్తులు గత సీజన్‌తో పోలిస్తే అధికంగా ఉన్నారు. దీంతో హోటళ్లు, దాబాలు, ట్రావెల్స్‌కు సంబంధించిన వ్యాపారులు గడచిన 15 రోజుల్లో మంచి వ్యాపారం సాగించారు. ఇప్పటి వరకు చార్‌ధామ్ యాత్ర కారణంగా రూ.200 కోట్లకు పైగా టర్నోవర్ జరిగినట్లు అంచనా. భక్తుల సంఖ్య ఇప్పటికే 10 లక్షలు దాటిందని సమాచారం.
డైరెక్టర్ జనరల్ ఇన్ఫర్మేషన్ బన్షీధర్ తివారీ మీడియాతో మాట్లాడుతూ ఈసారి చార్‌ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో యాత్రికులు తరలివస్తున్నారు. దీంతో ధామ్‌లలో ఒత్తిడి పెరిగినా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చాయన్నారు. చార్‌ధామ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం గంగోత్రి వ్యాలీలో 400, యమునోత్రి వ్యాలీలో 300 హోటళ్లు, హోమ్ స్టేలు, ధర్మశాలలు ఉన్నాయి. శ్రీనగర్ నుంచి బద్రీనాథ్, రుద్రప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ మధ్య 850 హోటళ్లు, హోమ్ స్టేలు, ధర్మశాలలు ఉన్నాయి.
గత ఏడాది ఏప్రిల్ 22న సీజన్ ప్రారంభమైనప్పుడు మొదట్లో తక్కువ మంది యాత్రికులు వచ్చారు. అయితే ఈసారి సీజన్ ఆలస్యంగా ప్రారంభమవడంతో రద్దీ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. చార్‌ధామ్‌లో గత 15 రోజుల్లో హోటళ్లు, దాబాలు, హోమ్‌స్టేల ద్వారా దాదాపు రూ.80 కోట్లు, దుకాణదారుల నుంచి రూ.20 కోట్లు, గైడ్‌ల ద్వారా రూ.30 కోట్లు, ప్రయాణాల ద్వారా రూ.40 కోట్లు, రూ.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. కాగా చార్‌ధామ్‌లో యాత్ర నిర్వహణ కోసం ప్రభుత్వం కొత్తగా ఇద్దరు యాత్రా మేజిస్ట్రేట్‌లను నియమించింది. ఈ మేజిస్ట్రేట్‌లు మే 26 నుంచి జూన్ 6 వరకు విధులు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment