Char Dham pilgrimage
-
చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్
కేదార్నాథ్: హిందువులు అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా భావించేవాటిలో కేదార్నాథ్(Kedarnath) ఒకటి. ప్రతీయేటా లక్షలాదిమంది భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా ఇక్కడికి వచ్చే యూట్యూబర్లు ఆలయ పరిసరాల్లో వీడియోలు, రీల్స్ తీస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయ కమిటీ ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది(2025)లో చార్ధామ్ యాత్ర(Chardham Yatra) ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. తొలుత యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరవనున్నారు. మే 2న కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇటువంటి తరుణంలో కేదార్నాథ్ ఆలయ సముదాయంలో రీల్స్ చేయడాన్ని నిషేధిస్తూ చార్ధామ్ మహా పంచాయతీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామ్‌లలో అత్యధికంగా రీల్స్, వీడియోలు కేదార్నాథ్ ధామ్(Kedarnath Dham)లోనే రూపొందిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పలువురు యూట్యూబర్లు విరివిగా వీడియోలు , రీల్స్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. వీటి ప్రభావం తీర్థయాత్రపై పడుతోందని ఆలయ అధికారులు గుర్తించారు. భక్తి విశ్వాసాలతో మెలిగేవారు ఇటువంటి రీల్స్ చూసి ఆందోళన చెందుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఇక్కడ రీల్స్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు.ధామ్ పవిత్రతను కాపాడటానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కేదార్నాథ్ తీర్థ పురోహిత సమాజ్ కూడా ఇక్కడ రీల్స్ చేయడాన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలని కోరింది. ఈ నేపధ్యంలో ఆలయ ప్రాంగణంలో రీల్స్, వీడియోలు తీయడాన్ని నిషేధించాలని చార్ ధామ్ మహా పంచాయతీ సమావేశంలో నిర్ణయించారు. దీనితో పాటు ఆలయంలో వీఐపీ దర్శనాలను కూడా నిషేధించారు. ఎవరైనా ఆలయ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఇది కూడా చదవండి: Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం -
చార్ధామ్ యాత్ర: 15 రోజుల్లో రూ. 200 కోట్ల వ్యాపారం
చార్ధామ్ యాత్రకు తరలివస్తున్న భక్తులు గత సీజన్‌తో పోలిస్తే అధికంగా ఉన్నారు. దీంతో హోటళ్లు, దాబాలు, ట్రావెల్స్‌కు సంబంధించిన వ్యాపారులు గడచిన 15 రోజుల్లో మంచి వ్యాపారం సాగించారు. ఇప్పటి వరకు చార్ధామ్ యాత్ర కారణంగా రూ.200 కోట్లకు పైగా టర్నోవర్ జరిగినట్లు అంచనా. భక్తుల సంఖ్య ఇప్పటికే 10 లక్షలు దాటిందని సమాచారం.డైరెక్టర్ జనరల్ ఇన్ఫర్మేషన్ బన్షీధర్ తివారీ మీడియాతో మాట్లాడుతూ ఈసారి చార్ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో యాత్రికులు తరలివస్తున్నారు. దీంతో ధామ్‌లలో ఒత్తిడి పెరిగినా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చాయన్నారు. చార్ధామ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం గంగోత్రి వ్యాలీలో 400, యమునోత్రి వ్యాలీలో 300 హోటళ్లు, హోమ్ స్టేలు, ధర్మశాలలు ఉన్నాయి. శ్రీనగర్ నుంచి బద్రీనాథ్, రుద్రప్రయాగ్ నుంచి కేదార్నాథ్ మధ్య 850 హోటళ్లు, హోమ్ స్టేలు, ధర్మశాలలు ఉన్నాయి.గత ఏడాది ఏప్రిల్ 22న సీజన్ ప్రారంభమైనప్పుడు మొదట్లో తక్కువ మంది యాత్రికులు వచ్చారు. అయితే ఈసారి సీజన్ ఆలస్యంగా ప్రారంభమవడంతో రద్దీ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. చార్‌ధామ్‌లో గత 15 రోజుల్లో హోటళ్లు, దాబాలు, హోమ్‌స్టేల ద్వారా దాదాపు రూ.80 కోట్లు, దుకాణదారుల నుంచి రూ.20 కోట్లు, గైడ్ల ద్వారా రూ.30 కోట్లు, ప్రయాణాల ద్వారా రూ.40 కోట్లు, రూ.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. కాగా చార్‌ధామ్‌లో యాత్ర నిర్వహణ కోసం ప్రభుత్వం కొత్తగా ఇద్దరు యాత్రా మేజిస్ట్రేట్లను నియమించింది. ఈ మేజిస్ట్రేట్లు మే 26 నుంచి జూన్ 6 వరకు విధులు నిర్వహించనున్నారు. -
మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర.. ఇంతలోనే భారీ వర్షాలు!
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ వర్షాలు స్థానికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నారు. చార్ధామ్ యాత్ర మే 10 నుండి ప్రారంభంకానుంది. ఈ యాత్ర చేసేందుకు లక్షలాది మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు భక్తులు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షాలకు తోడు వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అల్మోరా-సోమేశ్వర్ ప్రాంతంలో పిడుగులు పడుతున్నాయి. అల్మోరా-కౌసాని హైవేపై కొండచరియలు విరిగిపడటంతో గత 12 గంటలుగా ఈ రహదారిని మూసివేశారు. మారుతున్న వాతావరణం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఉత్తరాఖండ్‌లోని అల్మోరాతో పాటు, బాగేశ్వర్‌లో ఆకాశం మేఘావృతమైంది. ఉత్తరకాశీలోని పురోలాలో భారీ వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వరద ముప్పు ఏర్పడింది. మే 13 వరకు ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఇటువంటి వర్షాల సమయంలో ట్రెక్కింగ్ చేయవద్దని టూరిస్టులకు వాతావరణశాఖ తెలిపింది. తాజాగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రుతుపవన విపత్తుల నివారణ, చార్ధామ్ యాత్ర నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. -
దేవుని దర్శించుకోవడానికీ ఆధార్..
సాక్షి, బెంగళూరు : ఉత్తరఖాండ్‌లో ప్రతేడాది ఎంతో భక్తిశ్రద్ధలతో, వైభోవంగా జరిగే బద్రినాథ్, కేదర్నాథ్, గంగోత్రి, యమునోత్రి తీర్థయాత్రలకు వెళ్లాలంటే ఇక ఆధార్ తప్పనిసరి. ఈ పుణ్యయాత్రలకు వెళ్లే వారికి ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. యాత్రికులకు ప్రభుత్వం అందిస్తున్న 20వేల రూపాయల ట్రావెల్ సబ్సిడీ దుర్వినియోగమవుతుందనే భయాందోళనతో కర్నాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 17న ప్రభుత్వం సమీక్షించిన ఛార్ ధామ్ తీర్థయాత్ర నిబంధనల ప్రకారం, సబ్సిడీని పొందడానికి దరఖాస్తుదారులకు ఆధార్ కార్డును ఫ్రూప్‌గా పరిగణించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. '' రాష్ట్రంలో శాశ్వత నివాసం కలిగిన 1000-1500 మంది ప్రజలకు ఛార్ ధామ్ యాత్రం కోసం ప్రతేడాది ట్రావెల్ సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. కానీ ఈ ఏడాది యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశముంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలపై ట్రావెల్ ఆపరేటర్లు భక్తులకు పలు తప్పుడు మార్గాలను సూచిస్తున్నారు. తప్పుడు ప్రయాణ పత్రాలు సమర్పించి సబ్సిడీ మొత్తాన్ని దుర్వినియోగ పరచాలని చూస్తున్నారు. దీంతో ఆధార్ కార్డును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది'' అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. 2014లో సిద్ధరామయ్య ప్రభుత్వం దగ్గర్నుంచి ఈ యాత్రకు వెళ్లే కొంతమంది రాష్ట్ర నివాసులకు సబ్సిడీ అందించడం ప్రారంభించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ యాత్రకు వెళ్లేందుకు ఈ ట్రావెల్ సబ్సిడీని అందుబాటులోకి తెచ్చారు.