2024 ఎన్నికల తర్వాత బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఎంపీ 'అనంత్ కుమార్ హెగ్డే' చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ విమర్శలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి 'ఏక్‌నాథ్ షిండే' మండిపడ్డారు.
అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. బీజేపీపై విరుచుకుపడ్డారు. బీఆర్ అంబేద్కర్‌పై బీజేపీకి నమ్మకం ఉంటే రాజ్యంపై వ్యాఖ్యానించిన వ్యక్తిని పార్టీ నుంచి తరిమికొట్టాలి. ఇలాంటి విషయాలపైన మోడీ మౌనంగా ఉంటారు, మరోవైపు రాజ్యాంగాన్ని పరిరక్షించడం గురించి చెబుతుంటారని ఖర్గే అన్నారు.
బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా ఆమోదించకపోవడం దురదృష్టకరం. ఒక వైపు, రాజ్యాంగాన్ని ఎప్పటికీ మార్చబోమని ప్రధాని చెబుతారు. మరోవైపు, సవరించడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని చెబుతుంటారని అన్నారు.
ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాజంలోని అట్టడుగు వర్గాలకు, ఇతర వెనుకబడిన తరగతులకు న్యాయం జరిగేలా చూస్తారు. గత ఐదేళ్లపాటు మోదీ దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించారని షిండే వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment