భోపాల్: కలెక్టర్ తనను కలవలేదంటూ ఓ ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఏకంగా కలెక్టర్ కార్యాలయం ముందే శీర్షాసనం వేశారు. వివరాలు.. అటల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించడానికి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమికి పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబుసింగ్ జండెల్ తన మద్దతుదారులు, కొంతమంది రైతులతో కలిసి రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న షియోపూర్‌లోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అయితే, కలెక్టర్ ఎమ్మెల్యేను పట్టించుకోలేదు. చేతిలో డిమాండ్ల మెమోరాండంతో బాబుసింగ్, ఆయన మద్దతుదారుల చాలాసేపు ఎండలో అక్కడే ఎదురు చూశారు. కానీ ఫలితం లేకపోయింది. కలెక్టర్ ఎంతకి రాకపోవడంతో.. తన మద్దతుదారులతో కలిసి కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఇలా శీర్షాసనం వేశారు. (చదవండి: కారంపొడి కొట్టి మరీ దొరికిపోయాడు)
मप्र के श्योपुर में अटल एक्सप्रेस वे प्रोजेक्ट में जारी भूमि अधिग्रहण पर कांग्रेस विधायक प्रदर्शन करने पहुंचे, कलेक्टर नहीं मिले तो अर्धनग्न होकर सरकार के खिलाफ शीर्षासन भी कर डाला @ndtvindia @ndtv pic.twitter.com/HE1nPe5d19
— Anurag Dwary (@Anurag_Dwary) September 8, 2020
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎమ్మెల్యే చుట్టూ ఉన్న వారిలో ఒక్కరు కూడా సామాజిక దూరం పాటించడం.. మాస్క్ ధరించడం వంటి నియమాలను పాటించలేదు. దాంతో జనాలు సదురు ఎమ్మెల్యే మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment