సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా జూన్ 2 వరకు 624 మంది వైద్యులు మృత్యువాత పడ్డారని ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎమ్ఏ) వెల్లడించింది. ఏపీలో 34 మంది, తెలంగాణలో 32 మంది వైద్యులు మృతి చెందారని తెలిపింది. ఈ మేరకు గురువారం సంబంధిత గణాంకాలను వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 109 మంది.. బిహార్‌లో 96 మంది, యూపీలో 79 మంది, రాజస్థాన్‌లో 43 మంది వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా 748 మంది మృతి చెందారని తెలిపింది.
కాగా, దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ స్థిరంగా కొనసాగుతోంది. కేసుల నమోదు తగ్గకపోగా క్రమంగా పెరుగుతోంది. తాజాగా గురువారం లక్షా 34 వేల కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే రెండు వేలు అధికంగా నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,59,873 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా వాటిలో 1,34,154 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక మరణాలు 2,887 సంభవించాయి. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈమేరకు కరోనా బులెటిన్‌ను కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది.
చదవండి : Coronavirus: టీకాకు భయపడి డ్రమ్ వెనుక దాక్కున్న మహిళ
Comments
Please login to add a commentAdd a comment