
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,273 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 251 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,69,118కు చేరింది. మరణాల సంఖ్య 1,47,343కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 22,274 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 97,40,108 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 2,81,667 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రికవరీ రేటు 95.77 శాతానికి పెరిగింది. చదవండి: వారంలోనే 2,75,310 కేసులు
Comments
Please login to add a commentAdd a comment