ముంబై సెంట్రల్: 18 సంవత్సరాలు నిండిన వారి కోసం క్లౌడ్ 9హాస్పిటల్‌తో కలిసి నవీముంబైలోని తెలుగు కళా సమితి సంయుక్తంగా ఆదివారం వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. నవీముంబైలోని తెలుగు కళా సమితి కార్యాలయంలో టీకాలు వేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటుచేశారు. క్లౌడ్ 9 ఆసుపత్రి సింగిల్ డోస్ టీకా కోసం రూ.1,050గా నిర్ధారించింది. తెలుగు కళా సమితి తరఫున వినియోగదారులకు రూ. 250 రాయితీ ప్రకటించారు.
వినియోగదారుడు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. తెలుగు యువతకు వాక్సిన్ అందించాలన్న ఉద్దేశంతో తెలుగు కళా సమితి ఆసుపత్రి వారికి ప్రతి డోసుకు 1,050 చొప్పున చెల్లించి, వినియోగదారుడి నుంచి రూ. 800 మాత్రమే వసూలు చేస్తున్నామని, మిగతా రూ.250 తెలుగు కళా సమితి భరిస్తుందని సంస్థ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: బెంగాల్‌లో కోవిడ్ టీకా సర్టిఫికెట్‌పై మమత ఫొటో
Comments
Please login to add a commentAdd a comment