సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. కాగా, గడిచిన 24 గంటల్లో 41,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 88,14,579కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24గంటల్లో దేశంలో కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా మొత్తం 447మంది మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ కారణంగా దేశంలో మొత్తం మృతి చెందిన బాధితుల సంఖ్య 1,29,635కి చేరింది.
గడిచిన 24గంటలలో దేశవ్యాప్తంగా కోవిడ్‌లో వివిధ ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 42,156గా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా చికిత్స పొంది 82,05,728 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 4,79,216గా ఉంది. ఇక దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 93.09 శాతంగా నమోదైంది. దేశంలో నమోదయిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 5.44గా ఉంది. అదే విధంగా దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.47 శాతానికి తగ్గినట్లు హెల్త్ బులిటెన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment