అగర్తల: కరోనా కష్టకాలంలోనూ మన ప్రాణాల్ని రక్షించేందుకు తమ ప్రాణాల్ని అడ్డేస్తున్న వైద్యులపై కొందరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కోవిడ్ వార్డులో పేషెంట్లను చేర్పించేందుకు ప్రయత్నించిన వైద్యురాలిపై కరోనా పేషెంట్లు ఉమ్మివేసిన అమానుష ఘటన శుక్రవారం త్రిపురలో చోటు చేసుకుంది. వెస్ట్ త్రిపుర జిల్లాలోని భగత్ సింగ్ యూత్ హాస్టల్‌ను కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. ఇందులోకి కోవిడ్ సోకిన ఐదుగురు మహిళలను చేర్పించేందుకు ఆ జిల్లా పర్యవేక్షణ అధికారి డా.సంగీత చక్రబొర్తి శుక్రవారం సదరు కోవిడ్ కేర్ సెంటర్‌కు చేరుకున్నారు. అయితే అక్కడున్నవారు ఇప్పటికే ఈ సెంటర్ నిండిపోయిందని, మళ్లీ కొత్త పేషెంట్లను చేర్చుకోవద్దంటూ గొడవ చేశారు. అక్కడున్న డాక్టర్లు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఎదురు దాడికి దిగారు. (తండ్రి ప్రేమ: కూతురి కోసం కొత్తరకం బైక్ )
ఈ క్రమంలో అక్కడి కరోనా బాధితులు చక్రబొర్తిపై ఉమ్మివేసి వేధింపులకు పాల్పడటమే కాక, ఉద్దేశపూర్వకంగా వైరస్ వ్యాప్తికి ప్రయత్నించారు. దీనిపై కేసు నమోదు చేసిన జిల్లా ఎస్పీ మానిక్ లాక్ దాస్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించామన్నారు. కరోనా నుంచి కోలుకోగానే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కోవిడ్ కేర్ సెంటర్‌లో 300 బెడ్లు ఉంటే 270 పేషెంట్లు మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు. అందువల్లే వైద్యురాలు చక్రబొర్తి కొత్తగా ఐదుగురిని తీసుకెళ్లినట్లు వివరించారు. (ఊపిరి పీల్చుకుంటున్న హస్తిన)
Comments
Please login to add a commentAdd a comment