జైపూర్: కోవిడ్ కేసుల నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్‌లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండటంతో.. కరోనా కట్టడికి నిబంధలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (చదవండి: ప్రభుత్వ నిర్ణయంతో వణికిపోతున్న టీచర్లు!)
భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షల 04 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 584 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,32,162కు చేరింది. (చదవండి: కరోనా టీకా ధర ప్రకటించిన సీరం)
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయంతో ఢిల్లీలోని ప్రైమరీ స్కూళ్ల టీచర్లు వణికిపోతున్నారు. కరోనాకు నెలవైన ప్రాంతాల్లో సర్వే విధులు నిర్వర్తించాలని సర్కార్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. కోవిడ్ కేసులతో హాట్‌స్పాట్లు ఉన్న చోట పీపీఈ కిట్లు కూడా లేకుండా ఎలా పనిచేస్తామని వాపోతున్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో తగ్గినట్టే కనిపించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఇంటింటి సర్వే చేసి బాధితుల వివరాలు కనుక్కొని వృద్ధులు, గర్భిణీ మహిళలకు సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వం భావించింది.
Comments
Please login to add a commentAdd a comment