న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మరోసారి దేశంలో 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,96,414 కు చేరింది. గడిచిన 24గంటల్లో 4,092 మంది కోవిడ్ బాధితులు మరణిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,42,362 కు చేరింది. వైరస్ బాధితుల్లో ఇప్పటివరకు 1,83,17,404 మంది కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 37,36,648 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,186 కోవిడ్ కేసులు నమోదవడగా.. వైరస్ బాధితుల్లో 38మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 2,704 పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment