
సాక్షి బెంగళూరు: కన్నడనాట రెండోసారి కరోనా మహమ్మారి వీరంగం సృష్టిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 6,570 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సగం కంటే తక్కువగా 2,393 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 10.40 లక్షల మంది కోవిడ్ బారిన పడగా 9.73 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 53,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
బెంగళూరులో అధికం..
బెంగళూరును కోవిడ్ వదలడం లేదు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సుమారు 70 శాతం బెంగళూరులోనే వెలుగుచూస్తున్నాయి. ఐటీ సిటీలో కొత్తగా 4,422 మందికి కోవిడ్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 4,64,438కు పెరిగింది. 1,243 మంది కోలుకోగా, మొత్తం డిశ్చార్జ్‌లు 4,20,751 కి చేరాయి.
36 మంది మృతి..
మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. గురువారం 36 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 22 మంది బెంగళూరు వాసులే. రాష్ట్రంలో ఇప్పటివరకు 12,767 మంది కోవిడ్‌కు బలి అయ్యారు.
- 51 లక్షలకు టీకాలు
- ఐసీయూలో కేసులు – 357
- మొత్తం కోవిడ్ టీకాల పంపిణీ – 51.74 లక్షలు
- మొత్తం కరోనా పరీక్షలు – 2.23 కోట్లు
చదవండి: కేంద్రం, ‘మహా’ వ్యాక్సిన్ వార్
దేశాన్ని హడలెత్తిస్తోన్న కరోనా సెకండ్ వేవ్
Comments
Please login to add a commentAdd a comment