
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 57 లక్షలు దాటాయి. గురువారం కొత్తగా 86,508 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 57,32,518 కి చేరుకుంది. మొత్తం రికవరీల సంఖ్య 46,74,988కు చేరుకుంది. ప్రస్తుతం 9,68,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,129 మంది మరణించారు. మరోవైపు దేశంలో ఇప్పటివరకూ కరోనా మృతుల సంఖ్య 91,149కి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. (కరోనాతో కేంద్ర మంత్రి కన్నుమూత)
కొత్త కేసులను మించిన రికవరీలు
దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 81.25 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.59 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 22 వరకు 6,62,79,462 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మంగళవారం మరో 9,53,683 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇక మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. (కరోనా పాపం చైనాదే)
Comments
Please login to add a commentAdd a comment