
సాక్షి, చెన్నై : బురేవి తుపాన్ తమిళనాడు రామనాథపురం జిల్లా తీరానికి దగ్గరగా ఉన్న మన్నార్ గల్ఫ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఆరు గంటలలో 90 కి.మీ వేగంతో నైరుతి దిశగా పయనిస్తూ ప్రస్తుతం మన్నార్ గల్ఫ్ వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది రామనాథపురానికి నైరుతి దిశలో 40 కి.మీ, పంబన్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 70 కి.మీ, కన్యా కుమారికి ఈశాన్యంగా 160 కి.మీ. దూరంలో ఉంది. దీంతో గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే పాంబన్, మండపం, ధనుష్కోటి తీరాల్లో తుపాన్ దాటికి తీవ్ర నష్టం ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. తుపాన్ ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాంద్ర ప్రాంతంలో మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. (బురేవి తుపాన్: ఆ మూడు చోట్ల కల్లోలమే..)
Comments
Please login to add a commentAdd a comment