
న్యూఢిల్లీ: కోవిడ్-19 థర్డ్‌వేవ్ ముప్పు ఉందన్న మాట నిజమేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు. కరోనా కేసులు తగ్గుతున్న వేళ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా మరిన్ని ఆంక్షలను సడలిస్తున్నట్లు మీడియాతో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..'' థర్డ్ వేవ్ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్చలు చేపట్టాం.సెకండ్ వేవ్‌పై పోరాటంలో ఢిల్లీ ప్రజలు భుజం-భుజం కలిపి సహకరించారు. పారిశ్రామిక రంగం కూడా ఈ యుద్ధంలో పాల్గొంది. యూకేలో పరిస్థితులు చూస్తుంటే థర్డ్ వేవ్ భయం నెలకొంది. ఈ పరిస్థితుల్లో మనం ఖాళీ కూర్చోలేం'' అని తెలిపారు.
చదవండి: చిన్నపాటి ఘర్షణ.. ఆసుపత్రిలోనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు
Comments
Please login to add a commentAdd a comment