Delhi Lieutenant Governor Anil Baijal Resigns, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ రాజీనామా! వ్యక్తిగత కారణాలతోనే..

Published Wed, May 18 2022 5:27 PM | Last Updated on Wed, May 18 2022 5:56 PM

Delhi Lieutenant Governor Anil Baijal Resigns - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపించారాయన.

2016 నుంచి అనిల్‌ బైజల్‌ ఢిల్లీ ఎల్జీగా కొనసాగుతున్నారు. చాలాకాలంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో ఆయనకు విబేధాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కీలక నిర్ణయాలకు సైతం ఎల్జీ హోదాలో అనిల్‌ బైజల్‌ బీజేపీ పర్యవేక్షణతోనే అడ్డుపుల్లలు వేస్తున్నారనే విమర్శలు చేసింది ఆప్‌ సర్కార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement