సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాంలో ఆధారాలున్న మొబైల్ ఫోన్‌ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాయం చేశారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపిస్తోంది. అయితే, ఈడీ వ్యాఖ్యల్ని ఆప్ తీవ్రంగా ఖండిస్తోంది.
కొద్ది రోజుల క్రితం లిక్కర్ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లను మార్చారని, ధ్వంసం చేశారంటూ ఈడీ అధికారులు అభియోగాలు మోపారు. తాజాగా, అరవింద్ కేజ్రీవాల్ సైతం లిక్కర్ కేసుకు సంబంధించిన ఆధారాలున్న ఫోన్‌లను మాయం చేశారని ఈడీ చెప్పినట్లు సమాచారం. దీంతో లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 171 ఫోన్ మాయమైనట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఈడీ బీజేపీ రాజకీయ భాగస్వామి
ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ఫోన్ గురించి పై విధంగా మాట్లాడడంపై ఢిల్లీ ఆప్ మంత్రి అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో విచారణ ‘బీజేపీ కార్యాలయం నుంచే జరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 'బీజేపీకి రాజకీయ భాగస్వామి’ అని మండిపడ్డారు.
ఈడీ బీజేపీ అనుబంధం సంస్థ కాదు
దేశంలోని రాజ్యాంగం, చట్టం మీకు కొంత శక్తిని ఇచ్చాయని అన్నారు. దర్యాప్తు అధికారులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించవద్దని కోరారు. ఈడీ బీజేపీకి అనుబంధ సంస్థ కాదు. దేశ చట్టాల రూపొందించిన స్వచ్ఛంద దర్యాప్తు సంస్థ అని సూచించారు. లిక్కర్ కేసు గురించి అధికారులు ఏదైనా చెప్పాలంటే ముందు ఛార్జిషీట్ దాఖలు చేయాలి. చెప్పాలనుకుంది న్యాయమూర్తి ముందే చెప్పాలి అని అన్నారు.
ఏ ఫోన్ వాడానో గుర్తులేదు
కాగా, రెండేళ్ల క్రితం మద్యం పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్ వాడారో చెప్పాలంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు సుమారు 4 గంటల పాటు విచారించారు. అయితే ఈ విచారణంలో ఆ సమయంలో తాను ఏ ఫోన్ వినియోగించింది గుర్తు లేదని చెప్పారని, ఆ ఫోన్‌లో లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న సమీర్ మహేంద్రుతో మాట్లాడారని ఈడీ సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment