సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఢిల్లీ, నేషనల్ కాపిటల్ ప్రాంతం (గురుగ్రామ్, ఫరీదాబాద్, మనేసర్, బల్లభ్‌గఢ్) కర్నాల్, పానిపట్, గన్నౌర్, సోనిపట్, ఖర్ఖోడా, ఝజ్జర్, సోహనా, పాల్వాల్, నూహ్ (హర్యానా) ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం శనివారం ఉదయం వరకు కురిసింది.
ఢిల్లీలో పాటు బాగ్‌పత్ (ఉత్తరప్రదేశ్), తిజారా (రాజస్థాన్) వర్షం కురిసినట్లు భారత వాతావరణ శాఖ ట్విటర్‌లో పేర్కొంది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు మొత్తం జలమయం అయ్యాయి. శనివారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
#WATCH: Rain lashes Delhi-NCR; visuals from Chanakyapuri area
— ANI (@ANI) January 7, 2022
"Thunderstorm with moderate to heavy intensity rain would occur over & adjoining areas of entire Delhi and NCR (Gurugram, Faridabad, Manesar, Ballabhgarh) during the next 2 hours," says India Meteorological Department pic.twitter.com/0ue7HoLvMj
Comments
Please login to add a commentAdd a comment