లక్నో: భార్య పరాయి వ్యక్తులతో గడుపుతుండగా.. భర్త రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త.. ఆమెను ఫాలో అవ్వగా.. గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాస్‌గంజ్ వెలుగుచూసింది. కాగా భార్యభర్తలిద్దరూా వైద్యులు కావడం గమనార్హం.
మహిళ పట్టుబడటంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది భౌతిక ఘర్షణకు దారి తీసింది. దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్య దంపతుల మద్య గతకొంతకాలంగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఇద్దరు ఏడాదిగా వేర్వేరుగా జీవిస్తున్నారు.
ఈ క్రమంలో భార్య కదలికలపై అనుమానం పెంచుకున్న భర్త... ఆమెను అనుసరించాడు. గురవారం ఆమె హోటల్ గదిలో ఉన్న సమాచారంతో తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త హోటల్ గదిలోకి చొరబడ్డాడు. ఇద్దరు వ్యక్తులతో భార్య ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పట్టకున్నాడు. దీంతో పట్టుబడిన భార్య, వ్యక్తులపై భర్త, బంధువులు తీవ్రంగా దాడి చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు మహిళతోపాటు ఘజియాబాద్, బులంద్‌షహర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతోపాటు భార్య, ఇద్దరు వ్యక్తులపై భర్త ఫిర్యాదు చేశాడు. మహిళ మాత్రం ఇప్పటి వరకు తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment