కాంగ్రెస్ దివంగత నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్ కుమార్తె 'పద్మజ వేణుగోపాల్' కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. పద్మజ ఫేస్‌బుక్ ఖాతాలో పార్టీకి సంబంధించిన పోస్ట్‌లను తొలగించడంతో ఆమె పార్టీ మారనున్నట్లు పలువురు భావిస్తున్నారు.
పద్మజ బీజేపీలో చేరితే.. అది చాలా ద్రోహమని, ఆమె వల్ల బీజేపీకి ఏ మాత్రం ఉపయోగం లేదని, ఆమె సోదరుడు పార్టీ ఎంపీ కే మురళీధరన్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె త్రిసూర్ నియోజకవర్గం నుంచి లెఫ్ట్ ఫ్రంట్ తరఫున పోటీ చేసి ఓడిపోయారని, కేరళ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పద్మజకు మూడుసార్లు పార్టీ టిక్కెట్ ఇచ్చారని, ప్రతిసారీ ఆమె ఓడిపోయిందని మురళీధరన్ అన్నారు.
తన తండ్రి (కరుణాకరన్) ఎప్పుడూ మత రాజకీయాల విషయంలో రాజీ పడలేదని, పద్మజ ఇప్పుడు పార్టీ మారి బీజేపీలో చేరితే అతి చాలా బాధాకరమని మురళీధరన్ పేర్కొన్నారు.
అధిష్టానం తనను పక్కన పెట్టడంతో పద్మజ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ రోజు పద్మజ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని, ఢిల్లీలో ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతలతో ఈ అంశంపై ఆమె చర్చించనున్నట్లు కొందరు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment