సాక్షి, న్యూఢిల్లీ: గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్రంలోని తీరప్రాంతాలలో అధిక వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కర్ణాటక, కేరళలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ మహారాష్ట్ర, ఉత్తర కేరళ తీరప్రాంతల మధ్య అల్పపీడనం ఏర్పడిందని, దీని వలన గాలి దిశ, వేగంలో మార్పువస్తుందని సూచించింది. దీని ప్రభావం దేశం అంతటా ఎంతో కొంత ఉంటుందని తెలిపింది. తూర్పు కర్ణాటక తీరం- అరేబియా సముద్రం మీద తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది.
కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, అస్సాం, మేఘలయాలలో గురువారం, శుక్రవారం ఆరెంజ్ రంగు కేటగిరీ హెచ్చరికను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ ప్రాంతాలలో విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. సెప్టెంబర్ 11 నుంచి నెలాఖరు వరకు దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆ రెండు రాష్ట్రాలలో భారీ వర్షాలు!
Published Thu, Sep 10 2020 11:26 AM | Last Updated on Thu, Sep 10 2020 11:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment