
బళ్లారి రూరల్(బెంగళూరు): ఆ రైతు పక్కా ప్రణాళికతో బంతిపూలు సాగు చేసి లాభాలు గడించాడు. దసరా, దీపావళి పండుగలకు బంతిపూలను భారీగా వినియోగిస్తారు. ఆలయాలు, ఇళ్లలో పూజలకు రోజువారీగా బంతిపూల వినియోగం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శాంతినగర్‌కు చెందిన సుబ్బారావు పదిరోజుల పాటు దసరా, తరువాత వచ్చే దీపావళికి పంటవచ్చెలా ముక్కాలు ఎకరంలో బంతిపూలు సాగుచేశాడు. పండిన పంటను రోజూ మార్కెట్‌కు తరలిస్తున్నాడు. కేజీ రూ.40తో విక్రయించినా లాభాలు వచ్చాయని రైతు ఆనందం వ్యక్తం చేశాడు.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!