న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. గత కొద్దిరోజుల నుంచి ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిలో రాహుల్ గాంధీ షేర్ చేసిన పంజాబ్‌కు చెందిన 65 ఏళ్ల రైతుపై జవాను దాడి ఫొటో ఒకటి. దీనిపై కొన్ని రోజులుగా కాంగ్రెస్, బీజేపీల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. రైతుపై దాడి చేశారని కాంగ్రెస్, చేయలేదని బీజేపీ ఇలా ఎవరి వాదనను వారు వినిపించారు. అయితే ఓ నేషనల్ మీడియా నిజానిజాలను తేల్చడానికి సదరు రైతు గురించి ఆరాతీసింది. ( రైతుల నిరసన.. మద్దతు తెలిపిన ‘ఖలీ’)
ఈ నేపథ్యంలో ఆయన ఎవరో తెలుసుకుని అసలు విషయం ఏంటని అడిగింది. పంజాబ్‌లోని కాపుర్తలకు చెందిన సదరు రైతు సుఖ్‌దేవ్ సింగ్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రైతుల ఆందోళన సందర్భంగా జవాన్లు మాపై నీళ్లతో, టియర్ గ్యాస్‌తో దాడి చేశారు. అనంతరం కర్రలకు పని చెప్పారు. నా శరీరం మొత్తం గాయాలయ్యాయ’’ని చెబుతూ చేతులపై ఉన్న గాయాల తాలూకూ మచ్చల్ని చూపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment