
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ ఛాయలు ప్రస్ఫుటమవుతున్నాయి. మార్చి నెలారంభం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సుమారు 48 రోజుల తర్వాత రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఐదు వేల నుంచి ఎనిమిది వేలకు చేరింది. ఈ ఏడాదిలో జనవరి 23వ తేదీన గరిష్టంగా 902 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గత శుక్రవారం 833 పాజిటివ్‌లు వెలుగుచూశాయి. సౌతాఫ్రికా స్ట్రెయిన్ కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా కరోనా టీకా వేశారు. శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 9,58,417 ఉంది. చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!)
లాక్‌డౌన్ దిగులు..
బెంగళూరులో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 71 రోజుల తర్వాత 500 సంఖ్య దాటింది. మహరాష్ట్రలో మాదిరిగా లాక్‌డౌన్ విధిస్తారేమోనని బెంగళూరుతో పాటు పలు జిల్లాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. పాజిటివ్ కేసుల కన్నా డిశ్చార్జిల సంఖ్య తగ్గడం మహమ్మారి తీవ్రతకు నిదర్శనం. కరోనా వైరస్ నివారణలో భాగంగా కర్ణాటకలో తొలిసారిగా వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించి మార్చి 14నాటికి ఏడాది పూర్తయింది. చదవండి: (వారం రోజులు లాక్‌డౌన్.. తెరచి ఉంచేవివే..)
Comments
Please login to add a commentAdd a comment