హక్కుల ఉద్యమకారిణి కమలా భాసిన్‌ కన్నుమూత | Feminist Kamala Bhasin Passsesaway In New Delhi | Sakshi
Sakshi News home page

హక్కుల ఉద్యమకారిణి కమలా భాసిన్‌ కన్నుమూత

Published Sun, Sep 26 2021 8:31 AM | Last Updated on Sun, Sep 26 2021 11:37 AM

Feminist Kamala Bhasin Passsesaway In New Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, రచయిత్రి కమలా భాసిన్‌(75) మృతిచెందారు. ఆమె చాలా రోజులుగా కేన్సర్‌తో పోరాడుతున్నారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో మహిళా ఉద్యమాల్లో కమల చురుగ్గా పాల్గొన్నారు.   

వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ 
న్యూఢిల్లీ: మీరు కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారా? విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అలాగైతే మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం పూర్తిగా ముద్రించిన వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను మీరు పొందొచ్చు.

ప్రస్తుతం ఈ సర్టిఫికెట్లలో వయస్సు మాత్రమే ఉంటోంది.  దీనివల్ల విదేశాలకు వేళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  అందుకే వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లలో లబ్ధిదారుల పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని  ముద్రించనున్నట్లు అధికారులు వెల్లడించారు.  

చదవండి: కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్‌.. ముహుర్తం ఖరారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement