feminist
-
మహిళల హక్కులను కించపరిచిన ట్రంప్
-
హక్కుల ఉద్యమకారిణి కమలా భాసిన్ కన్నుమూత
-
హక్కుల ఉద్యమకారిణి కమలా భాసిన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, రచయిత్రి కమలా భాసిన్(75) మృతిచెందారు. ఆమె చాలా రోజులుగా కేన్సర్‌తో పోరాడుతున్నారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో మహిళా ఉద్యమాల్లో కమల చురుగ్గా పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో పుట్టిన తేదీ న్యూఢిల్లీ: మీరు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారా? విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అలాగైతే మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం పూర్తిగా ముద్రించిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను మీరు పొందొచ్చు. ప్రస్తుతం ఈ సర్టిఫికెట్లలో వయస్సు మాత్రమే ఉంటోంది. దీనివల్ల విదేశాలకు వేళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో లబ్ధిదారుల పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని ముద్రించనున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్.. ముహుర్తం ఖరారు -
నది దాహం
కిష్వర్ నషీద్ ఇరవయ్యో శతాబ్దపు గొప్ప స్త్రీవాద రచయిత్రి. గత ఏడాది జూన్‌తో ఎనభై ఏళ్లు నించిన కిష్వర్ పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ శహర్ లో. దేశ విభజన అనంతరం వారి కుటుంబం పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వెళ్లింది. అక్కడ ఆమె ఉర్దూ, పర్షియా భాషలు చదువుకున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి ఆడపిల్లలను అనుమతించని రోజుల్లో చదువు కోసం కిష్వర్ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత చదువు కొనసాగించడానికి ఇంట్లో పెద్ద సమావేశం... సుదీర్ఘ చర్చ. ఎట్టకేలకు ఆమె కాలేజ్‌లో చేరగలిగారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారామె. ఆమె రచనా వ్యాసంగం 1968లో మొదలైంది. పన్నెండు స్వీయ రచనలతోపాటు అనేక అనువాద రచనలు కూడా చేశారామె. ఆమె కలం నుంచి జాలువారిన గజల్లకు లెక్కే లేదు. ప్రపంచ సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కిష్వర్. ఆమె రచనలు ప్రధానంగా మహిళలను ఒత్తిడికి గురి చేస్తున్న మతపరమైన విధానాల మీదనే సాగేవి. స్టార్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు, సాహిత్య విభాగంలో లైఫ్ టైమ అచీవ్మెంట్ అవార్డులతోపాటు ఇతర పురస్కారాలను కూడా అందుకున్నారు. గత ఏడాది కోవిడ్ బారిన పడి కోలుకున్న నషీద్ కోవిడ్ బారిన పడిన సమాజాన్ని అక్షరబద్ధం చేశారు. ‘దర్యా కీ తిష్ణాగీ(నది దాహం)’ పేరుతో ఉర్దూలో విడుదల చేసిన సంకలనంలో ఆమె కరోనా బారిన పడిన సమాజంలో ఆమె గమనించిన విషయాలను ప్రస్తావించారు. ఆ కవిత సారాంశం క్లుప్తంగా... డబ్బాలు నిండే రోజు ‘‘కరోనా ఆర్థిక వ్యవస్థను నిలువుగా చిదిమేసింది. ఇల్లు దాటి కాలు బయటపెట్టకపోతే రోజు గడవదు, కాలు బయటపెట్టినా పని కనిపించదు. ‘ఎవరినీ తాకవద్దు– సామాజిక దూరం పాటించాలి’ అనే మాటలను వింటూనే రోజులు వెళ్లిపోతున్నాయి. మధ్య తరగతి ఎట్టకేలకు సొంతం చేసుకున్న కారును కరోనా అమ్మేసింది. ఇంటి నుంచే పని చేయమని కోరుతోంది ప్రపంచం. ఇంట్లో కూర్చుని చేసే పనులు కాని వృత్తుల్లో వాళ్లకు పని చేసే దారి మూసుకుపోయింది. ఇంట్లో దినుసుల డబ్బాలు ఎప్పుడు ఖాళీ అయిపోతాయోనని భయం. అప్పటికే ఖాళీ అయిన డబ్బాలు... నిండే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ రోజులు లెక్కపెట్టుకుంటున్నాయి. ఎవరి ముందూ చేయి చాచలేని మొహమాటం, అగ్గిపుల్లను కూడా అరువడగలేని ఆత్మగౌరవం. పిల్లల్ని ఇంట్లోనే అట్టి పెట్టుకోవాలి, ఏమీ తోచక ఏడుస్తున్న పిల్లలను రోజంతా సంతోషపెట్టాలి. ఇంటి పద్దులు చూసుకుంటూ అరుచుకుంటూ పరస్పరం కోపంతో విరుచుకుపడుతూ భార్యాభర్తలిద్దరూ అలసిపోతున్నారు. ఎవరినీ ఏమీ అడగడం చేతరానితనం, అడగడానికి అడ్డుపడే గౌరవాల మధ్య జీవితాలు నలిగిపోతున్నాయి. వాస్తవాలను అర్థం చేసుకున్న వృద్ధతరం మాత్రం ఈ కరోనా కష్టకాలానికి వారి జీవితానుభవాలను జోడించుకుని కొత్త భాష్యం చెప్పుకుంటోంది. ఇది ఇలా ఉంటే... ఇదే ఏడాది పాకిస్థాన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొనుగోలు జరిగింది. వార్ధక్యంలో వివాహం జరిగింది. వరుడు వివాహవేదికకు కిలో బంగారంతో వచ్చాడు. యూరప్ దేశాల వాళ్లు బాల్కనీలో నిలబడి గిటార్ వాయిస్తూ గడిపారు. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. నలుగురు మనుషులున్న కుటుంబం కనిపించడం కష్టమైంది. సంగీతంలో శ్రావ్యతలన్నీ ఏకమయ్యాయి కానీ పాటలే వేరయ్యాయి. గోడను మరొక గోడ కలుపుతోంది. గోడల ఆలంబనతో జీవిస్తున్న ఇరుగుపొరుగు మధ్య పలుకు భయం మాటున మూగబోయింది. మౌనంగా సంభవించిన మరణాలు... పూడ్చి పెట్టిన బారులు చైనా గోడలాగ ఆకాశం నుంచి కూడా కనిపిస్తాయి. కరోనా దూసుకుపోతోంది... మానవత్వం మరణిస్తోంది... ఏడాది దాటి పోయింది’’. -
స్త్రీవాద సాహిత్య యుగకర్త 'ఓల్గా'
సాక్షి,తెనాలి : తెలుగునాట స్త్రీవాద సాహిత్యాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లేందుకు జీవితాన్ని అంకితం చేసిన ఆచరణశీలి ఓల్గా. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సాధికారికంగా ఉపన్యసించగల వక్త. కొత్త ఆలోచనలపై జరిగే దాడులను నిబ్బరంగా ఎదుర్కోగల సాహసి. మగవారికి మాత్రమే పరిమితమైన తాత్విక సైద్ధాంతిక రంగాల్లో ఒక స్త్రీగా ధీమాతో తిరుగాడిన మేధావి. ఈ సాహిత్య, సామాజిక, వ్యక్తిత్వ ప్రస్థానానికి నేటితో అర్ధ శతాబ్దం నిండింది. ఇదేరోజు ఏడు పదుల వయసులోకి ప్రవేశించటం మరో విశేషం! ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఓల్గా మిత్రులు ‘సాహిత్య సాన్నిహిత్య ఓల్గా ఎట్ 50’ సభను డిసెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. నారాయణగూడలోని రెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగే సభలో కేఎన్ మల్లీశ్వరి సంపాదకత్వంలో తీసుకొచ్చిన ‘సాహిత్య సాన్నిహిత్య ఓల్గా’, ఓల్గా రచించిన ‘చలం–నేను’, ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్నిచ్చిన ‘విముక’ కన్నడ అనువాద పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. కలాన్ని కదం తొక్కించి.. ప్రముఖ స్త్రీవాద స్వచ్ఛంద సంస్థ ‘అస్మిత’లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఓల్గా తన కలాన్ని కదం తొక్కించారు. ‘సహజ’, ‘మానవి’, ‘కన్నీటి కెరటాల వెన్నెల’, ‘ఆకాశంలోసగం’, ‘గులాబీలు’, ‘గమనమే గమ్యం’, ‘యశోబుద’ నవలలు రాశారు. చలం రచనల్లోని ఆరు స్త్రీ పాత్రలతో ‘వాళ్లు ఆరుగురు’ నాటకం రచించారు. ఆమె రాసిన ‘రాజకీయ కథలు’, ‘ప్రయోగం’ సంపుటాలు, స్త్రీ దేహాన్ని కేంద్రంగా చేసుకొని ఆలోచించటం, రాజకీయం చేయటాన్ని ఎండగట్టాయి. భిన్న సందర్భాలు, మృణ్మయనాథం, విముక్త, కథలు లేని కాలం.. వంటివి మరికొన్ని కథా సంపుటాలు. వీటిలో విముక్తకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పలు అనువాద రచనలు, నృత్యరూపకాలు, సిద్ధాంతవ్యాసాలు రాశారు. అనేక పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. రచనల్లో సీత, అహల్య, శూర్పణఖ వంటి పురాణపాత్రల పేర్లను చేర్చటం, సందేశంతో కూడిన నృత్యరూపకాలను రాయటం, ప్రజలకు దగ్గరయే అంశాలతో స్త్రీవాదాన్ని వారి దగ్గరకు చేర్చటానికే అంటారామె. స్త్రీవాదం అంటే పురుషులకు వ్యతిరేకం కాదని, వారి మైండ్‌సెట్ మారాలనేది ఓల్గా చెప్పే మాట. సినిమా రంగంలోనూ.. అధ్యాపక వృత్తి తర్వాత హైదరాబాద్ వెళ్లిన ఓల్గా ‘భద్రం కొడుకో’, ‘తోడు’, ‘గాంధీ’ (డబ్బింగ్), ‘పాతనగరంలో పసివాడు’, ‘గులాబీలు’, ‘అమూల్యం’ సినిమాలకు స్క్రిప్టు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా, పాటల రచన, సహాయ దర్శకురాలిగా రకరకాల బాధ్యతలు నిర్వర్తించారు. పలు టెలీఫిలింలు, టీవీ సీరియల్స్‌కూ పనిచేశారు. బీజింగ్‌లో జరిగిన మహిళల సదస్సు, అమెరికాలో ప్రపంచ మానవహక్కుల కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యారు. బంగ్లాదేశ్, బ్యాంకాక్లోనూ పర్యటించారు. పాటకు జాతీయ అవార్డులు ఆమె పాటలు రాసిన ‘భద్రం కొడుకో’ సినిమాకు రెండు జాతీయ అవార్డులొచ్చాయి. ‘తోడు’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు దక్కింది. తనదైన సొంత నిబంధనలు, సిద్ధాంతాలతో వ్యక్తిగత స్వేచ్ఛ, సాధికారత కోసం కృషిచేస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. అందుకే ఓల్గా మిత్రులు సాహితీ సాన్నిహిత్య సభను ఏర్పాటు చేసి ఓల్గా తన రచనల్లో పదే పదే ప్రస్తావించిన ‘సిస్టర్హుడ్ రిలేషన్షిప్’ స్త్రీల మధ్య నిలిచి ఉందని రుజువు చేయనున్నారు. -
రేపటి దీపాల్ని వెలిగిద్దాం రండి
కొంత ప్రజాస్వామ్యం, కొన్ని పౌరహక్కులు, కాస్తంత సమభావన వైపు సాగుతున్నాం అనుకునే లోపే భారీ తిరోగమనం ప్రారంభమైంది. ఆర్థికరంగంలో స్త్రీ పాత్ర 19.5 శాతానికి పడిపోవడమే కాదు.. మగ ఛాతీ కొలతల్ని సామర్థ్యంగా ప్రకటించుకోవడంతో ఆగకుండా స్త్రీలపై భౌతిక, లైంగిక హింసలు, అంతర్జాలపు దాడులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల వలయం నుంచి బయటపడాలంటే శతాబ్దాల పోరాట స్ఫూర్తి ఆసరా తప్పనిసరి. ఈ మార్చి 8ని ముందుకే సాగే కాలం సాక్ష్యంగా పరిణామం చెందే లోకాన్ని మార్పులోకి వరుగులెత్తించే పోరాటాల స్ఫూర్తిగా భుజాన్నేసుకుని మోసుకుపోవాలి. పాత లోకాల్ని కాల్చే రేపటి దీపాల్ని వెలిగిద్దాం పదండి. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు పిలుపులూ వచ్చాయి. ఒకటి స్వచ్ఛంద సంస్థల నుంచి ’’మెరుగుపడాలంటే సమతుల్యం అవసరం’’ అని. మరొకటి ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం నుంచి ’’సమభావపు ఆలోచన చురుకుగా నిర్మించడం, పురోగమనం కోసం వినూత్నత’’ అనే పిలుపూ వచ్చింది. సమానం అనే ఆలోచన చేసినంత మాత్రాన సమానత్వం ఉందా, వస్తుందా.. లేక ఆలోచనతో మొదలు పెట్టి చురుకుగా సమానత్వం నిర్మించాలా అనే అనుమానం రాకుండా అలవాటైపోయిన ఈ అసమ వ్యవహార శైలిని ఛేదింది సమానత్వం సాధించే దిశగా సాగాలని దానికి వినూత్న పద్ధతులు, ప్రక్రియలు కనిపెట్టాలని ఐరాస కోరింది. ప్రతివారు సాధికారిత గురించే మాట్లాడుతున్నారు కానీ ఆచరణలో అంగుళం కూడా ముందుకు సాగడం లేదు. ఎందుకంటే కనీస హక్కులు అంటే చదువుకోవడం ఉద్యోగం వంటివి ఇస్తే చాలు సాధికారతే అంటూ ప్రతిపనికీ సాధికారత పేరు తగిలిస్తున్నారు. సాధికారత అంటే అధికారం కావాలి. దేనిపైన అధికారం కావాలి స్త్రీలకు? భర్తపైనా? పిల్లలపైనా? కుటుంబం పైనా? సమాజంపైనా? అంటే వందసార్లు కాదు అని చెప్పాల్సి ఉంటుంది.వారి శరీరాలపైనా, వారి చదువులు, ఉపాధి అవకాశాల పైనా, వనరులపైనా, భాగస్వామి ఎంపికపైనా మొత్తంగా చెప్పాలంటే వారి జీవితాలపై నిర్ణయాధికారం కోరుకుంటున్నారు. బీజింగ్ సదస్సు పత్రాల ఆధారంగా 2001–02లో ఐరాస ప్రత్యుత్పత్తి హక్కుల తీర్మానం ప్రతిపాదించింది. దానిపై భారతదేశం సంతకం చేసింది. కానీ ఆనవాయితీ అది అమలులో పెట్టేందుకు ఏ చర్యా తీసుకోకపోగా పరిస్థితి మరింత విషమించింది. స్త్రీలకు ప్రత్యుత్పత్తి హక్కు ఎంత ఘోరంగా నిరాకరించబడుతున్నదో ఆడపిల్లల జననాల రేటు సరోగసీ వ్యాపారాన్ని పరిశీలిస్తే చాలు. నీతిఆయోగ్ 2018లో ప్రచురించిన ’’ఆరోగ్యకరమైన రాష్ట్రాలు భారత దేశ పురోగతి’’ ప్రకారం ప్రధానమైన 17 పెద్ద రాష్ట్రాల్లో ఆడపిల్లల జననాల సంఖ్య దారుణంగా పడిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు కేవలం 914 మంది అమ్మాయిలు పుడుతుండగా (జాతీయ సగటు) అది ఇప్పుడు 900కి తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాలు బాలికా భ్రూణ హత్యల్లో మేం తక్కువ కాదు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బాలికల జననాల రేటు దారుణంగా పడిపోయిందన్న విషయం గుర్తించినట్లు గానీ మాట్లాడినట్లు గానీ కనపడదు. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ఇది 918గా ఉంది. నీతి ఆయోగ్ లెక్కప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిల పుట్టుక 907 (ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు) అంటే మొత్తంమీద అమ్మాయిలను పుట్టనీయకుండా గర్భస్రావాలకు పాల్పడుతున్నారా లేక తాజా టెక్నాలజీతో పిండంగా మారకముందే ఎలిమినేట్ చేస్తున్నారా అనే అంశంపై ఏ లెక్కలూ లేవు. అమ్మాయిల సంఖ్య పడిపోవడంలో గమనించాల్సిన అంశాలు డబ్బున్న, విద్యావంతులున్న ప్రాంతాలు నగర సంస్కృతిలో అమ్మాయిల పుట్టుక రేటు అతి తక్కువ. ఆదివాసీలు అమ్మాయిల, స్త్రీల సంఖ్య ప్రకృతి నిర్దేశించిన ప్రకారం మగవాళ్ల కంటే అధికంగా అంటే 1000: 1121 (బాలలు: బాలికలు) నిష్పత్తిలో ఉంది. స్త్రీ పురుష వివక్షత ఆదివాసీల్లో చాలా తక్కువగా ఉంది. స్త్రీలపై హింస కూడా. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఆధిపత్య కులాల్లో పెళ్లికి అమ్మాయిల కొరత ఏర్పడింది. హరియాణా, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు పేద రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని కొనుక్కుని ద్రౌపది ఆచారానికి తిరోగమిస్తున్నారు. హరియాణాలో పెళ్లికాని యువకులు పెరిగిపోవడం, ఫోర్న్ అందుబాటుతో రోజుకి సగటున 8 సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. సంపద పెరుగుదలకూ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధికీ, అమ్మాయిల సంఖ్య బాగా పడిపోవడానికి, స్త్రీలపై హింస విపరీతంగా పెరగడానికీ మధ్యగల సంబంధం ఏమిటి? కారణాలు ఏమిటి? అనే విషయం ఈ దేశంలో కనీస చర్చకు నోచుకోలేదు. దేశం కోసం నలుగురు కొడుకుల్ని కనాలని ఒక సాధ్వి, కాదు.. 10 మందిని కనాలని వారిని సైన్యంలోకి పంపాలంటూ ఒక మహారాజు (ఇద్దరూ పార్లమెంటు సభ్యులే) వాగుతుంటే పట్టించుకోని పార్లమెంటరీ వ్యవస్థ స్త్రీలకు ప్రత్యుత్పత్తి హక్కు ఉందని ఒప్పుకోవడానికి నిరాకరించినట్లు కాదా? 53 శాతం విద్యార్థులు ప్రైవేట్ విద్యావ్యాపారపు వనరుగా మారాక ప్రభుత్వ పాఠశాల కూడా వదిలి అన్నదమ్ముల ఫీజు కోసమో, ఇంటి పనుల భారం మోయడానికో బడి వదిలేసే ఆడపిల్లలను ఏ విద్యా హక్కు ఆదుకుంటోంది? ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా చేసే ఉద్యోగాలు, వృత్తులే స్త్రీలు ఎంచుకుంటే కుటుంబాలు నడుస్తాయనే అభ్యుదయవాదులకు శాస్త్ర సాంకేతిక రంగాల పురోగమనంలో ఏర్పడుతున్న విస్తృతావకాశాల క్రీనీడలు స్త్రీపురుషుల మధ్య డిజిటల్ అగాధాలు ఏర్పరుస్తున్నాయని గమనిస్తున్నారా? గణితంలో, భౌతిక రసాయన శాస్త్రాల్లో పరిశోధనా రంగాల్లో అసలే అంతంతమాత్రంగా ఉంటున్న మహిళలు మరింత ముందుకు సాగి వారి మేధోఫలితాలు సమాజానికి అందించడానికి బదులు కుటుంబంలో కూరుకుపోవడం వల్ల దేశానికి జరిగే నష్టం ఎంతో అంచనా వేస్తున్నారా? పనిచేయగలిగే వయస్సులోని స్త్రీలకు వారు చేయగలిగే ఉపాధి ఇవ్వలేకపోవడంతో ఈ దేశం ఏటా 1.7 ట్రిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోతున్నదని ఏ అర్థశాస్త్రవేత్తలయినా పాలకుల కళ్లు తెరిపించే కాలం కోసం ఇంకెంత కాలం వేచి చూడాలో? ఈనాటికీ ఇంటా బయటా స్త్రీలు చేస్తున్న పని విలువను గుర్తించడంలో దేశాలు, సమాజాలు, కుటుంబాలు విఫలం అయ్యాయని చెప్పాలా? లేక గుర్తించ నిరాకరిస్తున్నారా? ఇంటి పనుల్లో రోజూ పురుషునికంటే కనీసం 3 నుంచి 5 గంటలు స్త్రీలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల శ్రమ స్త్రీలదేనని ఐరాస అధికారిక అధ్యయనం వెల్లడించింది. అయినా ఒక్క వెనిజులా తప్ప మరే దేశం కూడా ఇంటి చాకిరి విలువను స్థూల జాతీయోత్పత్తిలో భాగంగా లెక్కగట్టేందుకు చొరవ చూపడం లేదు. స్త్రీలు ఉపాధుల్లో ఉండటం అన్నిరకాల ఉత్పత్తిని పెంచుతుందని తెలిసినా స్త్రీల ప్రథమ బాధ్యత పిల్లలు, ఇల్లు అని ఎందుకు నీతులు ఎడతెగకుండా ప్రచారం చేస్తున్నారు? అలాగే స్త్రీలు పనిలో ఆదాయం పొందటం ద్వారా పెరిగే కొనుగోలు శక్తి వలన ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటుంది. అయినా ఆ వైపుగా విధానాలు రూపొందించడం లేదు. స్త్రీలు సహజసిద్ధమైన పిల్లల పెంపకం నైపుణ్యాలు, సేవాభావం కలిగి ఉంటారనడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేదు. పిల్లల్ని కనడం, పాలివ్వడం వంటి జైవిక ధర్మాలను పిల్లల పెంపకం, త్యాగం, ప్రేమలతో ముడిపెట్టడం ద్వారా స్త్రీలను ఇంటికి పరిమితం చేయడం ఒక సహజ విషయంగా ప్రచారం జరుగుతోంది. స్త్రీ పురుషుల్లో ఎవరైనా నేర్చుకుంటే ఆసక్తి ఉంటే పిల్లల పెంపకం, పెద్దల సేవ చేయవచ్చు. కానీ అలాంటి భావాలకు చోటిస్తే అతి మామూలుగా జరిగిపోతున్న స్త్రీల శ్రమదోపిడీకి దెబ్బతగులుతుంది. పైగా బయట సంపాదించే బాధ్యత మగాడిదే అని చెప్పడం ద్వారా పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, అసంఘటిత రంగంలో స్త్రీల ఉపాధికి పురుషుని కంటే తక్కువ వేతనం ఇచ్చి మరింత లాభాలు పొందే అవకాశం పోతుంది. ధర్మశాస్త్రాలు, రస వివేచనలు, సకల కళలు వాడి ఇంట్లో పనిముట్లు. స్వర్గానికీ నరకానికీ వాడే కామందు అంటూ ధనస్వామ్యం లాభం కోసం పవిత్రాత్మ తోక చివర ఈకలమ్ముతుందంటాడు మయకోవస్కీ. కులసతుల త్యాగాలతో సినిమాలు, మాదకద్రవ్యాల నిషాలో హింసాత్మక ఫోర్నోగ్రఫీ స్త్రీల శరీరాల సరకుపై వారు లాభాలార్జిస్తారు. కొంత ప్రజాస్వామ్యం, కొన్ని పౌరహక్కులు, కాస్తంత సమభావన వైపు సాగుతున్నాం అనుకునే లోపే భారీ తిరోగమనం ప్రారంభం అయింది. ఆర్థికరంగంలో స్త్రీ పాత్ర 19.5 శాతానికి పడిపోవడం ఒక్కటే కాదు. మగ ఛాతీ కొలతల్ని సామర్థ్యంగా ప్రకటించుకోవడంతో ఆగకుండా స్త్రీలపై భౌతిక, లైంగిక హింసలు, అంతర్జాలపు దాడులు పెరుగుతున్నాయి. పురుగులు పడ్డ శవంలా కుళ్లి గబ్బు కొడుతున్న ఆధిపత్యం సాంస్కృతిక రంగాన్ని సైతానులాగా ఆక్రమించుకుంటోంది. స్త్రీలను రాతిబొమ్మలుగా, దేవతలుగా కొలుస్తాం తప్ప రక్తమాంసాలున్న మనుషులుగా పరిగణించం అని పురుషత్వం చిందులు దొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఏది నిజం, ఏది కాదు, ఎటుపోవడం సరైంది, ఏది నీతి, ఏది అభివృద్ధి, ఏది అభ్యుదయం, ఏది అమ్ముడుపోవడం అర్థం కాక స్త్రీల జీవితం దళారులకు అమ్ముడుపోతోంది. తమ జీవితాలపై హక్కుకోసం సంఘటితంగా ఉద్యమించిన మహిళల పోరాట స్ఫూర్తి దినోత్సవం కూడా తార్పుడు భావాల వలలో చిక్కి ఒకరోజు ’బారు’ మహిళల కోసం దాగా ఎగబాకింది. నూనెలో తడిసిన పాలరాయి గచ్చుపై నిలుచున్నట్లున్న ఈ పరిస్థితుల వలయం నుంచి బయటపడాలంటే శతాబ్దాల పోరాట స్ఫూర్తి ఆసరా తప్పనిసరి. దిక్కూ దివాణం తెలియనట్లు కకావికలంగా పరుగులు పెడుతున్న గందరగోళం మధ్య నిదానంగా, నిశ్శబ్దంగా ఒక ఉద్యమ ప్రణాళిక రేఖా చిత్రం కూడా చూడొచ్చు. సమభావన బలం పుంజుకుంటోంది కాబట్టి ఈ ఇనుప డేగలు వేట ఉధృతం చేశాయని గమనించక తప్పదు. కాబట్టి ఈ మార్చి 8ని ముందుకే సాగే కాలం సాక్ష్యంగా పరిణామం చెందే లోకాన్ని మార్పులోకి వరుగులెత్తించే పోరాటాల స్ఫూర్తిగా భుజాన్నేసుకుని మోసుకుపోవాలి. జీవితం పట్ల ప్రేమతో సమానతపై అచంచల విశ్వాసంతో మన లక్ష్యంపై అకుంఠిత దీక్షతో ముందుకు సాగుదాం పదండి. ఇది మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాట దినోత్సవం. పాత లోకాల్ని కాల్చే రేపటి దీపాల్ని వెలిగిద్దాం పదండి. వ్యాసకర్త: పి.దేవి, సాంస్కృతిక కార్యకర్త -
స్త్రీలోక సంచారం
►‘ఆడవాళ్లకు బయటికి వెళ్లి పని చేయవలసిన అవసరం ఏమిటి?’ అనే వ్యంగ్య, హాస్య కథాంశంతో ‘అఫ్గానిస్తాన్ టీవీ’లో ‘రోయా’ అనే ఒక స్త్రీవాద సీరియల్ ఈ నెలలో మొదలవుతోంది. యు.ఎస్.లో వీక్షకాదరణ పొందిన ‘అగ్లీ బెట్టీ’ సీరీస్లానే ఈ ‘రోయా’ సీరియల్లో.. ఆడవాళ్లు ఉద్యోగం చేయవలసిన అవసరాన్ని.. ‘ఆడవాళ్లు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమిటి?’ అనే సంప్రదాయవాదుల కోణంలో నరుక్కొస్తూ సరదా సన్నివేశాలతో ఆలోచన రేకెత్తించేలా చిత్రీకరిస్తున్నారు. ►ఈరోజు (గురువారం) యు.ఎస్.లోని గూగుల్ కంపెనీలో పని చేస్తున్న 200 మంది మహిళా ఇంజనీర్లు వాకౌట్ చేయబోతున్నారు! గూగుల్ పూర్వపు ఉద్యోగి, ఆండ్రాయిడ్ సృష్టికర్త అయిన ఆండీ రూబిన్ 2013లో ఒక హోటల్ గదిలో తన కోరిక తీర్చమని తనను వేధించినట్లు గూగుల్ కంపెనీ మహిళా ఉద్యోగి ఒకరు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన అనంతరం ఆండీ రూబిన్ను తొలగిస్తూ గూగుల్ అతడికి 90 మిలియన్ డాలర్ల పరిహారాన్ని (665 కోట్ల 75 లక్షల 25 వేల రూపాయలు) ఇచ్చి పంపిందని ‘న్యూయార్క్ టైమ్స్’ గత వారం ప్రచురించిన వార్తకు ఉలిక్కిపడిన గూగుల్ మహిళా సిబ్బంది.. లైంగిక దుష్ప్రవర్తన కలిగిన వ్యక్తికి ఇంత డబ్బు ఇవ్వడమేంటని.. వాకౌట్ ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయదలచుకున్నారు. ►రేపటి తరం పురుషులు స్త్రీల పట్ల మర్యాదస్తులుగా మెసులుకోవాలంటే.. వారిని ఇప్పట్నుంచే (బాలురుగా ఉన్నప్పట్నుంచే) తల్లిదండ్రులు.. స్త్రీలు ఎందులోనూ, ఏ మాత్రం తక్కువ కాదన్న స్పృహతో సహానుభూతితో, సంస్కారవంతులుగా పెంచాలని ‘ది గార్డియన్’ సైట్‌కు రాసిన తాజా వ్యాసంలో ప్రముఖ మహిళా జర్నలిస్టు సైమా మిర్ సూచించారు. ►గత ఏడాది ఏప్రిల్‌లో మరణించిన ప్రసిద్ధ ఇంగ్లండ్ రచయిత్రి, కవయిత్రి, ‘ది లిటరరీ కన్సల్టెన్సీ’ వ్యవస్థాపకురాలు రెబెక్కా స్విఫ్ట్ స్మృత్యర్థం ప్రారంభమైన ‘ఉమెన్ పొయెట్స్ ప్రైజ్’ కు తొలి ఏడాది విజేతలుగా క్లెయిర్ కాలిసన్, నినా మింగ్యా పావెల్స్, అనితా పతి ఎంపికయ్యారు. స్త్రీ సాధికారత అంశాలపై సృజనాత్మకమైన ప్రతిభ కనబరుస్తున్న కవయిత్రులకు ఈ అవార్డు ఇస్తారు. -
‘నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు’
దక్షిణ కొరియాలో ‘రహస్య కెమెరాలతో చిత్రీకరణ’ సమస్య తీవ్రరూపం దాల్చింది. బీచులు, స్విమ్మింగ్పూల్లే కాకుండా పార్కులు ఇతర బహిరంగప్రదేశాల్లోనూ ఇలాంటి చిత్రీకరణలు పెరిగిపోయి వ్యక్తిగత గోప్యతకు ఆటంకంగా మారుతున్నాయి. ఇది ఎంతవరకు వెళ్లిందంటే సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది మహిళలు ’ నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు’ అనే ప్లకార్డులు చేపట్టి ఇటీవల వీధుల్లో నిరసనలు తెలిపే వరకు వెళ్లింది. ఇలాంటి వీడియోలు రికార్డ్ చేస్తున్న, వీక్షిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా ‘మీ టూ ఉద్యమం’ సాగుతోంది. దీని ద్వారా మహిళలపై లైంగికదాడులు, వేధింపులకు పాల్పడిన అధికార డెమొక్రాటిక్ పార్టీ నేత యాన్ హి–జింగ్‌తో సహా పలువురు ప్రముఖులను సైతం ఎండగట్టగలిగారు. ఈ నేపథ్యంలోనే తమను రహస్య కెమెరాల్లో చిత్రీకరించడంపైనా మహిళలు గళమెత్తుతున్నారు. పార్కులు, స్విమ్మింగ్‌పూల్‌లు, బీచుల్లోని రెస్ట్రూమ్లు, గదుల్లో దుస్తులు మార్చుకుంటున్న మహిళలను రహస్య కెమెరాల ద్వారా రికార్డ్ చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. వీటిపై మహిళల నుంచి ఒక్కసారిగా ఫిర్యాదులు పెరిగిపోవడంతో పోలీస బృందాలు స్కానర్లతో రంగంలోకి దిగి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్న దానిని కనిపెట్టే చర్యలు చేపడుతున్నారు. అయితే చిన్న చిన్న కెమెరాలు ఎక్కడ పెట్టారనేది మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా లెక్కకు మించి తనిఖీలు చేపడుతున్నా ఈ సమస్యకు చెక్ పెట్టలేకపోతున్నారు. పెరుగుతున్న రహస్య కెమెరా బాధితులు 2012–16 మధ్యకాలంలో రహస్య చిత్రీకరణ బాధితులుæ 26 వేల మందికి పైగానే ఉన్నారని, వారిలో 80 శాతం మంది మహిళలేనని గుర్తించారు. తమను రికార్డ్ చేశారన్న సంగతి కూడా వారిలో చాలా మందికి తెలియదని పోలీసులు చెబుతున్నారు. వారు చెబుతున్న దాని కంటే కనీసం పదింతలు ఎక్కువగా బాధితుల సంఖ్య ఉండొచ్చునని సూన్‌చున్హ్ యాంగ్ వర్సిటీ క్రిమినాలజీ (నేరశాస్త్రం) ప్రొఫెసర్ ఓహ్ యూన్–సంగ్ పేర్కొన్నారు. ‘ఇది రోజువారి జీవితంలో భాగమై పోయింది. ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై మరింత కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని ఆ దేశ అధ్యక్షుడు మూన్ జో–ఇన్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. 2011లో 1,354 మందిని పోలీసులు గుర్తించగా, 2017 వారి సంఖ్య 5,363 మందికి పెరిగింది. సులభంగా స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండడంతో పాటు సోషల్ మీడియా వ్యాప్తి కూడా ఈ నేరానికి దోహదపడుతోంది. అధికారులకు సవాలే... బేస్‌బాల్ టోపి, బెల్టు, గడియారం, లైటర్, యూఎస్బీ పరికరం, చొక్కాపై ధరించే టై, కారుతాళాలు, పాదరక్షలు ఇలా ప్రతి వస్తువుపై అతిచిన్న రహస్య కెమెరాలు అమరుస్తున్నారు. మాల్‌లు, షాపింగ్సెంటర్లు, బీచులు, స్విమ్మింగ్ పూల్‌లలోని దుస్తులు మార్చుకునే గదుల్లో డోర్‌లాకర్లు, ఫ్రేమ్‌లు, స్నానపు గదుల్లోని షవర్లు, టాయ్లెట్లలో ఎక్కడబడితే అక్కడ వీటిని పెట్టి దృశ్యాలు రికార్డ్ చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీన్ని అదుపుచేయడంతో పాటు ఆన్లైన్, ఇతర వెబ్ కంటెంట్‌లో ఇలాంటి అక్రమ రికార్డింగ్‌లు పెట్టకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కెమెరా హార్డ్‌వేర్ అమ్మకాలపై నిఘాతో పాటు రహస్య చిత్రీకరణలు పెద్ద నేరమనే అంశానికి ప్రచారం కల్పిస్తున్నారు. అంతేకాకుండా బహిరంగప్రదేశాల్లో ఏయే రూపాల్లో అతిచిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్‌కు వీలుందో అవగాహన కల్పిస్తున్నారు. రహస్య రికార్డింగ్‌లకు పాల్పడిన వారికి అయిదేళ్ల శిక్ష లేదా రూ.6.2 లక్షల జరిమానా విధిస్తున్నారని, ఇంతకంటే కఠినమైన శిక్షలుండాలని కొరియా మహిళా న్యాయవాదుల సంఘం నేత కిమ్ యంగ్–మి డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో 5.3 శాతం మాత్రమే జైలుకు వెళ్లినట్టుగా అయిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
తగని ప్రశ్న తగిన జవాబు
‘నేను ఫెమినిస్టును కాదు’ అంటున్నారు. కానీ స్త్రీ, పురుష సమానత్వం ఉండాలంటున్నారు! ఫెమినిజం, సమానత్వం రెండూ ఒకటే కదా! త్రిష : ఎస్! నేను ఫెమినిస్టును కాదు. ఫెమినిజం అనే భావన విస్తృతమైనది. ‘సమానత్వం’ అనే అర్థంతో ఫెమినిజం అనే మాటను సరిపెట్టేయలేం. ఫెమినిస్టులు ఒక్క సమానత్వం గురించే మాట్లాడరు. వాళ్లు చాలా చేస్తారు. అసమానత్వాన్ని ప్రశ్నిస్తారు. బయటికి వచ్చి పోరాడతారు. స్త్రీల సమస్యలపై, స్త్రీల సంక్షేమంపై, స్త్రీల భద్రతపై సామాజిక, రాజకీయ, సృజనాత్మక వేదికలపై ప్రసంగిస్తారు. ఉద్యమాలు చేస్తారు. మగవాళ్లలో స్త్రీల సమస్యలపై సహానుభూతిని కలిగిస్తారు. నేను ఇవన్నీ చేయడం లేదు. కాబట్టి ఫెమినిస్టును కాదు. స్త్రీ, పురుష సమానత్వం ఆశిస్తున్న ఒక సాధారణ మహిళను. అంతే. త్రిష నటించిన హారర్ థ్రిల్లర్ ‘మోహిని’ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఆ చిత్రం ప్రోమో కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో త్రిష వెలిబుచ్చిన అభిప్రాయాలివి. -
స్త్రీవాద దేశంగా వేల్స్
వేల్స్ ప్రభుత్వాన్ని ‘ఫెమినిస్టు ప్రభుత్వం’గా మార్చేందుకు ఏం చేయాలన్న విషయమై ఆ దేశంలో ఇప్పుడు ఒక కమిటీ ఆధ్యర్యంలో దీర్ఘాలోచన సాగుతోంది! గ్రేట్ బ్రిటన్ పరిధిలోని ఒక దేశం వేల్స్. ఆ దేశ ఫస్ట్ మినిస్టర్ కార్విన్ జోన్స్ (అక్కడ ప్రధానిని ‘ఫస్ట్ మినిస్టర్’ అంటారు) బి.బి.సి. రేడియో 4 లోని ‘ఉమెన్స్ అవర్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘లైంగిక సమానత్వాన్ని సాధించేందుకు ‘ఫెమినిజం’ అనే భావనను పురుషులు అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం’ అని కూడా అన్నారు. బ్రిటన్ యువరాణి మేఘన్ మార్కెల్ తన అధికారిక జీవిత చరిత్రలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఈ సందర్భంగా ఆయన మద్దతు తెలిపారు. ‘నేను స్త్రీనైనందుకు, స్త్రీవాదినైనందుకు గర్విస్తున్నాను అని స్త్రీ అనగానే (మేఘన్ ఇలాగే అన్నారు) ఆమెను మనం ఒక సాధారణ స్త్రీగా కాకుండా, ఆమెనొక దుడుకుమోతుగా చూస్తాం. దీనిని బట్టి స్త్రీ,పురుష సమానత్వం కోసం మనమింకా ఎంతో దూరం ప్రయాణించవలసి ఉందని తెలుస్తోంది’ అన్నారు కార్విన్ జోన్స్. పదేళ్లుగా అధికారంలో ఉన్న జోన్స్ ఈ ఏడాది డిసెంబరులో పదవి నుంచి దిగిపోతున్నారు. ఆలోపే వేల్స్‌ను ‘స్త్రీవాద దేశం’గా మలుస్తానని తన ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముందైతే ఒక విధాన నిర్ణయాన్ని రూపొందించే పనిలో పడ్డారు. ఆయన తర్వాత వచ్చేవారు ఆ విధానాలను పాటిస్తారు. -
మహాత్ముడినే ప్రశ్నించింది!
నిన్నంతా గూగుల్ ‘డూడుల్’లో మీరు కమలాదేవి ఛటోపాధ్యాయ్‌ని చూసి ఉంటారు. ఏప్రిల్ 3 ఆమె బర్త్‌డే. 1903లో జన్మించారు. 1988 అక్టోబర్ 29న మరణించారు. డూడుల్‌లో నృత్యం, సంగీతం, రంగస్థలం, సంస్కృతి, సంప్రదాయ రూపాలతో కమలకు గూగుల్ నివాళులు అర్పించింది. అందులో గూగుల్ మిస్ అయిన రూపం.. ఫెమినిజం! ఆ తర్వాత రాజకీయం. అవును. కమల భారతదేశంలో తొలినాళ్ల ఫెమినిస్ట్. తొలినాళ్ల మహిళా రెబలియన్. ఈ రెండు కోణాల్లో కమలా ఛటోపాధ్యాయ్ గురించి మనం తెలుసుకుని తీరాలి. కమలకు ఏడేళ్ల వయసులో తండ్రి పోయారు. అయితే ఆయన విల్లు రాయకుండా పోయారు. దాంతో ఆస్తంతా సవతి తల్లి కొడుక్కి సంక్రమించింది. కమల, ఆమె తల్లి కట్టుబట్టల్తో మిగిలిపోయారు!ఇరవై ఏళ్ల వయసులో కమల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నిజానికి ఆమెకు ఆలోచనలేదు. ఆమె చురుకుదనం చూసి గాంధీజీ స్వయంగా ఆమెను పార్టీలోకి రమ్మని కోరారు. తర్వాత మూడేళ్లకు మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆమె పోటీ చేశారు. 55 ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోయారు. గాంధీజీ పిలుపుతో కమల రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. కొన్నిసార్లు ఆయన్ని విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి! ‘దండి’ యాత్రలోకి, ‘సత్యాగ్రహ’ ప్రదర్శనల్లోకి స్త్రీలు వద్దని గాంధీజీ అన్నారు. ఎందుకు వద్దు?’ అని కమల ఆయన్ని ప్రశ్నించారు!గాంధీజీ కమలకు ఆరాధ్యులే. అయితే గాంధీజీ కోరుకున్న మార్పు వేగంగా జరగడం లేదని ఆమె భావించారు. అందుకని కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ‘కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ’ వైపు మొగ్గు చూపారు. ఆ పార్టీకి అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. అప్పుడు ఆమె వయసు 33 ఏళ్లు మాత్రమే!భారతీయ మహిళా హక్కులపై తన 26వ ఏట నుంచే కమల పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. తన జీవిత కాలం మొత్తం మీద ఇలాంటివి 20 వరకు పుస్తకాలు రాశారు ఆమె. చివరి పుస్తకం ‘ఇండియన్ ఉమెన్స్ బ్యాటిల్ ఫర్ ఫ్రీడమ్’ 1982లో పబ్లిష్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా కమల తన గళం విప్పారు. ఆఫ్రికన్ మహిళల హక్కుల కోసం పోరాడారు. -
వియ్ ఆర్ ద క్రియేటర్స్
నేను ఫెమినిస్టు (స్త్రీవాది). అమ్మాయిలు, అబ్బాయిలు సమానమని కొందరు అంటుంటారు. నేను ఒప్పుకోను. ఎందుకంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే గొప్ప. అమ్మాయిలు లేకపోతే ఈ జగమే లేదు.‘వియ్ ఆర్ ద క్రియేటర్స్’. అయినప్పటికి ఇంకా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు ఇద్దరు మగపిల్లలు. నా కెరీర్‌తో ఇప్పుడు బిజీగా ఉన్నాను. కానీ, తప్పనిసరిగా ఒక అమ్మాయిని కంటాను. ఒక అమ్మాయికి అమ్మ కాకపోతే నా జీవితం సంపూర్ణం కాదు. -
క్రియేటివ్ హిస్టారియన్
డీడీ కోసంబి.. భారతదేశ చరిత్రను వాస్తవిక కోణంలో చూపిన చరిత్రకారుడు. యాభైల్లో ఆయన రాసిన పుస్తకం తెలుగులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా ఎన్.వేణుగోపాల్ కలం నుంచి ‘భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం’గా వెలువడనుంది. దీన్ని ప్రముఖ హిస్టారియన్, ఫెమినిస్ట్, ఫిల్మ్ మేకర్ ఉమా చక్రవర్తి నేడు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కోసంబిని ఆమె పరిచయం చేశారిలా... ‘స్వాతంత్య్రానికి పూర్వం మన దగ్గర రెండు రకాల రచనలుండేవి. మన సంస్కృతిని చిన్నచూపు చూసే, తేలిక చేసే వలసవాద రచనలు ఒక రకం అయితే, ‘లేదు మా సమాజంలో కూడా మంచి విషయాలున్నాయి, ప్రజాస్వామ్య భావనలున్నాయి’ అంటూ అసలు విషయాన్ని రొమాంటిసైజ్ చేస్తూ వచ్చిన కౌంటర్ రచనలు రెండోవి. అసంబద్ధమైన ఈ రెండూ మన సమాజానికి, చరిత్రకు అద్దం పట్టలేదు. స్వాతంత్య్రం వచ్చాక మన గతాన్ని మనం తరచి చూసుకునే అవసరం, సందర్భం ఏర్పడ్డాయి. ఆ చరిత్రను తిరగరాయాలని కొంతమంది కలం పట్టారు. వాళ్లే మొదటిసాంఘిక చరిత్రకారులు. వాళ్లలో ఒకరు దామోదర్ ధర్మానంద్ కోసంబి. జర్నీలోనే పుస్తకం... నిజానికి కోసంబి చరిత్రకారుడు కాదు. బట్ హీ ప్రాక్టీస్డ్ హిస్టరీ ఆల్ హిజ్ లైఫ్. ఆయనో మ్యాథమెటీషియన్. టాటా ఇనిస్టిట్యూట్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగం చేశారు. ముంబైలో ఉద్యోగం అయినా అక్కడికి షిఫ్ట్ కాలేదు. ప్రతిరోజూ ఉదయం డెక్కన్ క్వీన్ ట్రైన్లో ముంబై వెళ్లి సాయంకాలం తిరిగి పుణే వచ్చేవారు. ఆ జర్నీలోనే ఈ పుస్తకం రాయడం పూర్తి చేశాడు. ఆయన తండ్రి ధర్మానంద్ కోసంబి భాషావేత్త, పాలీ స్కాలర్, హిస్టారియన్ ఆఫ్ బుద్ధిజం. ఈయన ప్రభావం కోసంబిపై చాలా ఉంది. అఫీషియల్ మార్క్సిస్ట్... చరిత్ర అధ్యయనానికి కోసంబి చూపిన దారి అమోఘం. గతాన్ని ఎలా చూడాలి, పురాణాలను చదువుతూ సాంఘిక సంబంధాలను ఎలా వెదకాలనేది నేర్పాడు. ‘మిథ్ అండ్ రియాలిటీ’ పుస్తకంలో ఊర్వశి, పురూరవ లకు గురించిన ఒకే కథ వివిధ కాలాల్లో ఎలాంటి మార్పులను చేర్చుకుందనే విషయాన్ని ఇందులో చక్కగా విశ్లేషించాడు. కోసంబి అఫీషియల్ మార్క్సిస్ట్ అయినా చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఆ చట్రంలో బందీ కాలేదు. ఏ చరిత్రను అర్థం చేసుకోవాలన్నా సోషల్ రిలేషన్సే మూలం అని గ్రహించినవాడు. అందుకే కోసంబిని ఎవరూ అనుకరించలేరు. స్ఫూర్తి పొందడం తప్ప చరిత్రను ఆయనలా ఎవరూ విశ్లేషించలేరు. ముక్కుసూటి మనిషి... నమ్మినదాన్ని ఆచరించడంలో కోసంబిని మించినవారు లేరు. యాంటి న్యూక్లియర్ మూవ్మెంట్లో చురుగ్గా ఉన్నాడు. అందుకే టాటా ఇన్స్టిట్యూట్ ఉద్యోగాన్ని వదిలేశాడు. అంతేకాదు చెక్‌డ్యామ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ.. కోసంబి ఆ రోజుల్లోనే రాశాడు. మంచి విమర్శకుడు. చరిత్రను తప్పుగా చెప్తున్నవాళ్లను తూర్పారబ ట్టాడు. రష్యాలో కూర్చొని భారతదేశ చరిత్ర రాస్తున్నవాళ్లనూ వదిలిపెట్టలేదు. ‘నేను సొంతంగా ఆలోచించగలిగినప్పుడు, విషయాన్ని విశ్లేషించే శక్తి ఉన్నప్పుడు, నేను చెప్పే ప్రతి అంశాన్ని రుజువు చేయగులుగుతున్నప్పుడు ఎవరి మార్గదర్శకత్వమో ఎందుకు’ అనేది ఆయన అభిప్రాయం. కోసంబి తన పుస్తకంలో కొన్ని విషయాలను డ్రాయింగ్స్, ఫొటోగ్రాఫ్స్‌తో కూడా వివరిస్తాడు. ట్రైబల్స్ మీద వర్క్ చేసిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ సునీల్ రాణా ఫొటోగ్రాఫ్స్‌ను ఎక్కువగా ఉపయోగించుకున్నాడు. సరస్వతి రమ -
పురుషాహంకారానికి జవాబు శిఖండి
అంబ తొలితరం స్త్రీవాది అంటే కాదనడానికి కారణం ఏమీ కనపడటం లేదు. భీష్ముడి పురుషాహంకారాన్ని జన్మలకొద్దీ నీడలా వెంటాడి శిఖండిలా అవతరించి అతడి మరణం చూసిందామె. అయితే దురదృష్టవశాత్తు ఆమెను ఒక స్వతంత్ర పాత్రగా కాకుండా ఇతరులు ‘అడ్డు పెట్టుకొని’ విజయం సాధించే పాత్రగా మార్చారు. ఇంతకీ శిఖండి కథ ఏమిటి? జనసామాన్యంలో నలిగే ఆ పేరు వెనుక పగ ఏమిటి? కురుక్షేత్ర యుద్ధానికి కౌరవ సేనలు సిద్ధమవుతున్నాయి. ‘నీకు విజయమో నాకు వీర మరణమో ఈ యుద్ధంలో తేలాలి. పాండవపక్షంలో ఉన్న ఎవరినైనా ఎదిరిస్తాను. కానీ పాంచాల రాజకుమారుడైన శిఖండి నా ఎదుట నిలిస్తే నేను అతనిని కొట్టను’... అన్నాడు భీష్ముడు.‘తాతా! ఎందరో మహావీరులను గెలిచిన నువ్వు శిఖండి ముందు నిశ్చేష్టుడివి కావటం ఏమిటి?’ అన్నాడు దుర్యోధనుడు. ‘దుర్యోధనా! పురుషాహంకారానికి నాకు నేను విధించుకున్న శిక్షే దానికి కారణం. నన్నెదిరించిన శిఖండిని నేను ఎందుకు ఎదిరించలేనో చెబుతాను. అందరూ శ్రద్ధగా వినండి. నా తండ్రి శంతనుని వివాహం కోసం నేను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. ఇచ్చిన మాట ప్రకారం ఆయన మరణానంతరం పెద్ద తమ్ముడు చిత్రాంగదుణ్ని రాజును చేశాను. అతడు చనిపోవడంతో చిన్నతమ్ముడు విచిత్రవీర్యునికి పట్టాభిషేకం చేసి అతనికి తగిన కన్యను చూసి పెళ్లి చెయ్యాలనుకున్నాను. కాశీరాజు కుమార్తెలు ముగ్గురు అంబ, అంబిక, అంబాలిక స్వయంవరానికి సిద్ధంగా ఉన్నారని విని నేను ఒక్కడినే స్వయంవరానికి వెళ్లాను. నా అహంకారం కొద్దీ ఆ ముగ్గురి ఇష్టాయిష్టాలు ఎరగక వచ్చిన రాజులందరినీ ఎదిరించి రథంపై ఎక్కించుకొని హస్తినాపురానికి వచ్చి తల్లి సత్యవతికి అప్పగించాను. అక్కచెల్లెళ్లు ముగ్గురినీ విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేయబోతుండగా కాశీరాజు పెద్దకూతురు అంబ ‘ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను ఇంతకుమునుపే సాళ్వరాజును ప్రేమించాను. అతనినే పెళ్లి చేసుకుంటాను. సాళ్వరాజు నాకోసం ఎదురుచూస్తూ ఉంటాడు’ అంది. నేను తల్లిని, పెద్దలను అడిగి అంబ ఇష్టప్రకారం ఆమెను సాళ్వరాజు దగ్గరకు పంపాను. అయితే ‘నిన్ను భీష్ముడు ఎత్తుకువెళ్లాడు. ఇప్పుడు నువ్వు పరాయిదానివి. నాకు అక్కర్లేదు’ అని సాళ్వుడు తిరస్కరించాడు. దాంతో అంబ హతాశురాలయ్యింది. అంతేకాదు తనకు జరిగిన అన్యాయానికి నేనే ముఖ్యకారణం అని నాపై పగతో ఒక ఆశ్రమానికి వెళ్లి రాజర్షి హోత్రవాహనుణ్ణి కలిసింది. ఆమె తన మనుమరాలనీ, కూతురు బిడ్డ అనీ ఆయన తెలుసుకున్నాడు. బాధపడ్డాడు. ‘అమ్మా! నీ ప్రతీకారం తీరే ఉపాయం చెబుతాను. నువ్వు పరశురాముడి దగ్గరకు వెళ్లి శరణు వేడు. నీ దుఃఖాన్ని పోగొడతాడు. భీష్ముడు ఆయన శిష్యుడు. తాను చెప్పినట్టు వినకపోతే భీష్ముణ్ని శిక్షిస్తాడు’ అన్నాడు. అంబ పరశురాముడి దగ్గరకు వెళ్లింది. తన జీవితం అడవిగాచిన వెన్నెల కావటానికి కారణమైన నన్ను శిక్షించమని ప్రార్థించింది. ‘ఏం చెయ్యమంటావు?’ అని అడిగాడు పరశురాముడు. ‘భీష్మున్ని చంపండి’ అంది అంబ. ‘భీష్ముడు మంచివాడు, నా శిష్యుడు’ అన్నాడు పరశురాముడు. ‘అతడు నా దుఃఖానికి కారణం. మీరు నాకు ఇచ్చినమాట నిలబెట్టుకోండి. భీష్ముణ్ని చంపటమే నాకు ఇష్టం’ అంది అంబ. పరశురాముడు అంబతో హస్తినాపురానికి వచ్చాడు. నన్ను కలిశాడు. ‘భీష్మా! నీవు ఎత్తుకురావడం వల్ల ఈమె బ్రతుకు నాశనమైంది. ఈమెను స్వీకరించు’ అన్నాడు. ‘వివాహం చేసుకోరాదనే నా ప్రతిజ్ఞను నేను వీడను. పరాయివాణ్ని ప్రేమించిన ఆమెను నా తమ్ముడు చేసుకోడు’ అన్నాను. ‘భీష్మా! అయితే యుద్ధంలో నీ అహంకారాన్ని పోగొడతాను’ అన్నాడు పరశురాముడు. మా ఇరువురికీ భయంకరమైన యుద్ధం ఇరవైనాలుగు రోజులు జరిగింది. చివరికి పరశురాముడే ఓడిపోయాడు. దాంతో అంబకు రోషం ఇనుమడించింది. తపస్సు చేయాలని నిశ్చయించింది. యమునాతీరంలో పన్నెండేళ్ల కఠోరమైన తపస్సు చేసింది. తపస్సులో సగ భాగంతో అంబానదిగా మారింది. మిగిలిన తపోబలంతో కన్యగా పుట్టింది. ఆ జన్మలో కూడా నాపై పగతో ఘోరమైన తపస్సు చేసింది. కాని ఏమీ చేయలేకపోయింది. ‘నా స్త్రీత్వం వ్యర్థమైంది. ఈసారి పురుషుణ్ని అయి అనుకున్నది సాధిస్తాను’ అని అడిగినవారికి తన ఆశయాన్ని చెప్పింది. శివుడు ప్రత్యక్షమైనాడు. ‘అమ్మా! నీ తపస్సుకు మెచ్చాను. యుద్ధంలో భీష్ముణ్ని చంపుతావు. అందుకోసం పురుషత్వాన్ని పొందుతావు’ అని వరం ఇచ్చాడు. అప్పుడు అంబ చితి పేర్చుకొని ‘భీష్ముని వధ కోసం’ అంటూ అగ్నిప్రవేశం చేసింది. దుర్యోధనా! నా మీద కోపంతో ద్రుపదుడు నన్ను చంపే కొడుకు కోసం శివుణ్ని తపస్సు చేశాడు. శివుడు ‘నీకు మొదట ఆడపిల్ల పుట్టి, తరువాత మగవాడుగా మారి భీష్ముణ్ని చంపుతుంది’ అని వరం ఇచ్చాడు. అలాగే ద్రుపదునికి ఆడపిల్ల పుట్టింది. కానీ మగపిల్లవాడు పుట్టినట్టు ప్రకటించారు. అలాగే పెంచారు. శిఖండి పేరుతో ద్రోణుని వద్ద విద్యలు నేర్పించారు. దశార్ణ దేశపురాజు కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు. శిఖండి పురుషుడు కాదనే నిజం తెలిసిన మామ వియ్యంకుడైన ద్రుపదునిపై యుద్ధానికి వచ్చాడు. శిఖండి దుఃఖంతో ఇల్లు వదిలి అడివికి వెళ్లింది. ఆ వనాన్ని రక్షిస్తున్న స్థూణాకర్ణుడనే యక్షుడు ఈమె కథ విని జాలిపడి ‘తాత్కాలికంగా నా పుంసత్వాన్ని నీకు ఇస్తాను. నీ స్త్రీత్వాన్ని నేను తీసుకొంటాను’ అని ఓదార్చాడు. శిఖండి మగవాడై ఇంటికి వెళ్లాడు. మామగారికి నమ్మకం కలిగించి తిరిగి వచ్చేసరికి యక్షుని స్త్రీత్వం శిఖండి మరణించేదాకా ఉంటుందని కుబేరుడు శాపం పెట్టాడు. దాంతో శిఖండి శాశ్వతంగా పురుషుడై, మహావీరుడై, పాండవపక్షంలో ఉన్నాడు. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. స్త్రీ మీద గాని, పూర్వం స్త్రీగా ఉన్నవాని మీద గాని, స్త్రీ పేరు ఉన్నవాని మీద గాని, స్త్రీ రూపం గలవాని మీద గాని నేను బాణం విడువను. ఈ కారణంగానే శిఖండిని నేను చంపను. యుద్ధరంగంలో అతడు చంపడానికి బద్ధమై వచ్చినా నేను అతనిని చంపను... అని భీష్ముడు అంబ వృత్తాంతాన్ని దుర్యోధనునికి మొత్తం చెప్పాడు. పురుషాహంకారాన్ని పరాక్రమంగా భావించి తన జీవితాన్ని చిందరవందర చేసిన భీష్ముణ్ని పడగొట్టి ప్రతీకారం తీర్చుకున్న స్త్రీరత్నం అంబ. పట్టువదలని మొండిశిఖండిగా స్త్రీ జాతిని మేలుకొల్పుతోంది. - డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్ . -
ఉద్యమించిన మానవత్వం
రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా: హేతువాదం-కాంతికిరణాలు-చీకటి వెలుగులు వంటి నవలలు, భారతీయ భాషలలోకి అనువాదమైన ‘హిందూయిజం అండ్ ఉమెన్: రీజనల్ పర్స్పెక్టివ్ 1860 - 1993’ వంటి వ్యాససంపుటిలు అనేకం ఆమె వెలువరిం చారు. సమాజంలో మహిళల స్థానం (1985), మహిళలు - శాంతి (1986), వరకట్న దురాచారం (1987), అశ్లీలత (1987), లైంగిక స్వేచ్ఛ (1989), సాహిత్యం-మహిళ- సంస్కరణ-విప్లవం(1992), పెళ్లి-నాడు-నేడు(1993) వంటి అంశాల మీద గోష్టులు నిర్వహించారు. ‘నల్లవారి స్వేచ్ఛ-సమానత్వం కోసం కృషి చేసిన అబ్రహాం లింకన్, కెనడీ తెల్లవారిచేత హత్యచేయబడినట్లే నల్లవారికోసం పనిచేస్తోన్న మార్టిన్ లూథర్ కింగ్ కూడా తెల్లవాడి చేత హత్యచేయబడ్డాడు’ 1964లో రేడియోలో ఈ వార్త విన్న కోట్లాది ప్రజలు దుఃఖించారు. కొందరు అందులో దాగిన జాతి వివక్షను గుర్తించి ఆక్రోశం చెందారు. ఆగ్రహించారు. అటువంటి వారిలో గురువారం కన్నుమూసిన మల్లాది సుబ్బమ్మ ఒకరు. ఈ సంఘటన ఆమెను నిలువనివ్వలేదు. ఈ వివక్షత తెల్లవారిలోనే ఉందా? మనలో లేదా! ఆలోచనల దొంతరలు. ‘నల్ల భార్యవల్ల నల్ల పిల్ల పుట్టిందని ఒక భర్త భార్యాపిల్లలను వదలివేసి తెల్లగా ఉన్న భార్యను మరోపెళ్లి చేసుకుంటాడు.’ సుబ్బమ్మ రాసిన తొలి కథ ‘పనికి రాని ముత్యం’ పత్రికల నుంచి తిరుగు టపాలో వచ్చింది. ఎందుకని? ఇతివృత్తాన్ని కొంచెం మార్చి, అనేక కథలు చదవగా అలవడిన మెరుగుపడిన శైలితో అదే ఇతివృత్తాన్ని మార్చి పంపింది. పదేళ్ల తర్వాత కథ ప్రచురితం అయ్యింది! తనను తాను నిత్యం సానబెట్టుకున్న మల్లాది సుబ్బమ్మ వ్యక్తిత్వానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ! ‘మలిన’గురువులు! గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో 1924 ఆగస్టు 2న జన్మించిన సుబ్బమ్మకు బాపట్లకు చెందిన ఎం.వి.రామమూర్తితో బాల్యంలోనే వివాహం అయ్యింది. ‘శుద్ధ’ శోత్రియ కుటుంబం. 22వ ఏటకే నలుగురు బిడ్డలను కన్నారు. భర్త లిబరల్. అత్త అమాయక అద్వైతి. ఆమె గురువు ఆషాఢభూతి. శిష్యులు ధన-మాన-ప్రాణాలను సంతోషంగా సమర్పించుకోవాలన్న ‘మలిన’ గురువు మహత్యం(ఆమె మాటల్లోనే)తో సుబ్బమ్మ రెబెల్ అయ్యింది. మెతకవాడయినా మంచివాడయిన భర్త సహకారంతో మరచిపోయిన అక్షరాలను మళ్లీ దిద్దారు. గ్రంథా లయాలలో ప్రపంచ సాహిత్యాన్ని చదువుతూ అనుభవానికి నిలిచే పరీక్షలతో హేతువాదిగా రూపొందారు. ఆత్మవిశ్వాసోద్యమం! మూఢనమ్మకాలను స్వానుభవంతో వ్యతిరేకించిన మల్లాది సుబ్బమ్మకూ విశ్వాసం ఉంది. అది మతగ్రంథాలలోంచి, సిద్ధాంతాలలోంచి వచ్చింది కాదు. తనలోని చైతన్యానికి కారణం తనలోని ఆత్మవిశ్వాసమేనని పలుమార్లు, పలు వేదికలపై వ్యాసాల ద్వారా చెప్పారు. తనపై తాను విశ్వాసం కోల్పోయిన వ్యక్తి బానిసేనని, బానిసలు స్వేచ్ఛను కోరవచ్చేమో కాని పొందలేరని స్పష్టం చేసేవారు. తన వ్యక్తిగత జీవితానుభవాలలోంచే సిద్ధాంతాలను, పార్టీలను, సంఘాలను చూశారు. కాబట్టే లిబరల్ ఫెమినిస్టులు పెట్టుబడిదారుల ప్రయోజన చట్రాల్లో పనిచేస్తారని, మార్క్సిస్ట్ ఫెమినిస్ట్‌లు వర్గసిద్ధాంతాల ప్రయోజనాల పరిధిలోనే పనిచేస్తారని భావించారు. ప్రతి మహిళ తనను తాను ముందుగా మనిషిగా భావించాలని, పురుషుడూ అలా భావించాలని, సహజాతాలరీత్యా అంగీకరించని పురుషాధిక్యతపై పోరాడేందుకు ‘రాడికల్ హ్యూమనిజం’ ఆసరా తీసుకోవాలని సూచించారు. ఫెమినిస్ట్లను స్త్రీత్వం కోల్పోయిన వారిగా విమర్శించే పురుషాధిక్యులను చీల్చి చెండాడుతూనే ‘అశ్లీలతా ఛాందసం’పై కూడా చురకలం టించారు. సమానుల మధ్య నిజమైన ప్రేమ ఉంటుంది. అసమానుల మధ్య ప్రేమ ఎలా సాధ్యం అంటూ పురుషప్రపంచాన్ని ప్రేమాస్పదులు కావలసినదిగా హితవు పలికారు. ఏది అశ్లీలం? ఏది అసభ్యత? ఎవరు నిర్ణయిం చాలి!’ అనే వ్యాసంలో ‘కాంతుడు నీవు ఏకాంతమున పెనగువేళ’ తరహా రామదాసు తదితరుల అభివర్ణనలను ఉదహరిస్తూ సాహిత్యాన్ని చూడాల్సిన సౌందర్యదృష్టినీ ప్రతిపాదించారు. మల్లాది సుబ్బమ్మకు తనదైన పరిశీలన ఉంది. విషపానం చేస్తూ ‘మగువను మగవారితో సమానం చేస్తే ఆమె అతనికంటే అధికురాలవుతుంద’న్న సోక్రటీస్ పట్ల మల్లాది సుబ్బమ్మ కారుణ్యాన్నే ప్రదర్శించారు ‘భార్యపరమగయ్యాళి కాబట్టి అపోహ పడ్డారని’ వ్యాఖ్యానించడం ద్వారా! పున్నా కృష్ణమూర్తి