వైరల్: మనిషి జీవితంలో ప్రత్యేక క్షణాలు కొన్ని ఉంటాయి. మనకు అవి సాధారణమే అనిపించొచ్చు. కానీ, అవతలి వాళ్లకు మాత్రం అవి ఎంతో మధురం.. ప్రత్యేకం. అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ యువకుడి సందేశం ఇప్పుడు నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
భారత్‌కు చెందిన దత్తాత్రేయ జే.. సింగపూర్‌లో బ్లాక్‌చెయిన్ డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అతను లింకెడిన్‌లో రెండు ఫొటోలను పోస్ట్ చేశాడు. అవి అతను తన తల్లితో ఉన్నవి. పరాయి గడ్డపై తన ప్రపంచం ఎలా ఉందో చూపించేందుకు తల్లిని ఆహ్వానించినట్లు.. ఏనాడూ ఊరిని దాటని ఆమె ఎట్టకేలకు దేశం దాటిందని సంతోషం వ్యక్తం చేశాడతను.
ఎట్టకేలకు మా అమ్మ నా దగ్గరికి.. సింగపూర్‌కి వచ్చింది. ఆమెకు నా ఆఫీస్‌ను, అందమైన ఈ నగరాన్ని చూపించాలనుకుంటున్నా(ఆల్రెడీ అంతా తిప్పి చూపించాడట). ఆమె భావోద్వేగాలను, భావాలను వర్ణించడం కష్టమే. ఎందుకంటే.. తన జీవితంలో ఆమె ఊరు దాటింది లేదు. విమానాన్ని ఏ రకంగానూ ఆమె చూసి ఎరగదు. నా తండ్రి ఇక్కడ లేకపోవడం.. నన్నెంతో బాధించింది.
మా కుటుంబంలో వేరే దేశానికి వెళ్లిన మొదటి మహిళ.. మా అమ్మే. మా ఊరి నుంచి రెండో ఘనత సాధించారామె(మొదటి వ్యక్తి దత్తాత్రేయ భార్య). అందుకే నాకిది ప్రత్యేకమైన సందర్భం అంటూ పోస్ట్ చేశాడతను. ఇలా విదేశాల్లో ఉన్న పిల్లలు.. తమ తల్లిదండ్రులను తమ చెంతకు రప్పించుకుని.. దగ్గరుండి వాళ్లకు సంతోషాన్ని పంచాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎందుకంటే తనలా తల్లిదండ్రులు దేశవిదేశాలు తిప్పాలని కలలు గనే పిల్లలు ఎంతో మంది ఉంటారనేది అతని ఉద్దేశమంట. ప్రస్తుతం అతని పోస్ట్‌కు లైకులు, షేర్లు దక్కుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment