
సాక్షి, ఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. తూర్పు లద్ధాఖ్ సెక్టార్‌లోని ఎల్‌ఏసీలో భారత్, చైనా బలగాల మధ్య సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినట్లు సమాచారం. భారత్ సైన్యమే కాల్పులు జరిపిందంటూ చైనా ఆరోపణలు చేస్తోంది. కాల్పులపై భారత్ ఇంకా స్పందించలేదు. గత మూడు నెలలుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ జరగడంతో భారీ ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. (చదవండి: భారతీయుల కిడ్నాప్.. చైనా స్పందన)
(చదవండి: ఎల్‌ఏసీని గౌరవించాలి)
Comments
Please login to add a commentAdd a comment