నలుగురు ఉగ్రవాదులు హతం | Four Terrorists Deceased In An Encounter With Security Forces In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

భద్రతా దళాల చేతిలో నలుగురు ఉగ్రవాదులు హతం

Published Fri, Aug 28 2020 7:04 PM | Last Updated on Fri, Aug 28 2020 9:08 PM

Four Terrorists Deceased In An Encounter With Security Forces In Jammu And Kashmir - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లోని సోపియన్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కిలూరి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగరు ఉగ్రవాదులు మరణించారని జమ్ము కశ్మీర్‌ పోలీసులు నిర్ధారించారు. కిలూర గ్రామంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు, పోలీసులు అక్కడికి చేరుకోగా గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు దాగిఉన్నారనే అనుమానంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. కాగా ఈ ఏడాది కశ్మీర్‌లో 26 మంది ఉగ్రవాద సంస్ధల టాప్‌ కమాండర్లు సహా 150 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. చదవండి : లష్కరే కీలక కమాండర్‌ హతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement