ముంబై: దేశంలో స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఫార్ములాను ముంబైకి చెందిన మరో ప్రభుత్వ రంగ కంపెనీ హాఫ్కిన్ బయోఫార్మాతో పంచుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హాఫ్కిన్ బయోఫార్మా సంవత్సరానికి కోవాగ్జిన్ 22.8 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయనుంది. దేశంలో మొత్తం జనాభాకు త్వరగా టీకాలు వేయడానికి దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని భారీగా పెంచాడనికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆత్మ నిర్భర్ భారత్ 3.0 మిషన్ 'కోవిడ్ సురక్ష' కింద మూడు ప్రభుత్వ సంస్థలకు ఈ ఫార్ములాను పంచుకునేందుకు భారత్ బయోటెక్ అంగీకారం తెలిపింది. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన పీఎస్‌యు హాఫ్కిన్ బయోఫార్మా, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ లిమిటెడ్‌తో టెక్నాలజీ బదిలీ కింద కోవాగ్జిన్ టీకా తయారు చేస్తుంది. హాఫ్కిన్ సంస్థ పరేల్ కాంప్లెక్స్ వద్ద ఉత్పత్తి జరుగుతుంది. హాఫ్కిన్ బయోఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ రాథోడ్ మాట్లాడుతూ.. సంవత్సరంలో 22.8 కోట్ల మోతాదుల కోవాగ్జిన్ ఉత్పత్తి చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. "కోవాగ్జిన్ టీకాలను భారీగా ఉత్పత్తి చేయడానికి హాఫ్కిన్ బయోఫార్మాకు కేంద్రం రూ .65 కోట్లు, మహారాష్ట్ర ప్రభుత్వం రూ.94 కోట్లు మంజూరు చేసినట్లు" అని ఆయన అన్నారు.
చదవండి: Fact Check: కేంద్రం మన ఫోన్ కాల్స్ రికార్డు చేస్తుందా?
Comments
Please login to add a commentAdd a comment