Bharat Biotech Company
-
భారత్ బయోటెక్.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ మధ్య ఒప్పందం - అందుకేనా?
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు ఒక ఆవాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఎందుకు జరిగింది? దీని వల్ల ఉపయోగం ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వ్యాక్సిన్ పరిశోధన కార్యక్రమాలు, విద్యా పరిశ్రమ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మాత్రమే కాకుండా.. అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాలను పెంపొందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం బయో థెరప్యూటిక్స్ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను సరైన సమయంలో రక్షించుకోవడానికి తక్కువ ఖర్చుతో సాధ్యమవుతాయి. ప్రాణాంతక వ్యాధుల భారీ నుంచి కాపాడానికి వ్యాక్సిన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కరోనా మహమ్మారి సమయంలో చాలా దేశాలకు వ్యాక్సిన్స్ అందించిన ఘనత భారత్ సొంతం. ఈ సమయంలోనే మన దేశం సామర్థ్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందం సందర్భంగా.. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ 'కృష్ణ ఎల్లా' మాట్లాడుతూ.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్తో ఏర్పడిన ఈ బంధం పరిశోధనలను సులభతరం చేస్తుంది, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది, సైన్స్ వ్యాక్సిన్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఒప్పందం ఉపయోగపడుతుందని వెల్లడించారు. కొత్త వ్యాక్సిన్లు, బయోథెరఫిటిక్స్ అభివృద్ధిలో మా నైపుణ్యాన్ని హైలైట్ చేయడానికి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కలిసి, ప్రపంచ ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపడమే లక్ష్యమని.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ 'జామీ ట్రిక్కాస్' అన్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ వంటి కంపెనీలు ప్రపంచ డిమాండ్‌లో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ వ్యాక్సిన్లను అందించగలిగాయి. ఏకంగా 2.4 బిలియన్ డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్లను సరఫరా చేసిన రికార్డ్ భారత్ సొంతమైంది. దీంతో దేశ ఖ్యాతిని గుర్తించిన చాలా సంస్థలు, ఇండియన్ కంపెనీలతో చేతులు కలపడానికి ఆసక్తి చూపాయి. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారి వైరస్ భారీ నుంచి ప్రజలను రక్షించుకోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధి రూపకల్పన కోసం భారతదేశం ఆర్&డీ పెట్టుబడులను కొనసాగిస్తోంది. -
Global Investors Summit: ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సందర్బంగా ఏపీలో పెట్టుబడులపై వివిధ కంపెనీలు తన పెట్టుబడులను ప్రకటించారు. జిందాల్ కంపెనీ రానున్న రోజుల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొంది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయి. ఏపీలో పారిశ్రామిక అనుకూల వాతావరణం భేష్. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది. 10వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి కల్పించబోతున్నట్టు తెలిపారు. ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్ వన్‌గా ఉందన్నారు. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు మాట్లాడుతూ.. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది. సీఎం వైఎస్ జగన్ దార్శనికత ప్రశంసనీయం. సీఎం జగన్ విజన్ అద్భుతం. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుండటంతో ఏపీకి మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయం అని అన్నారు. సియాంట్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో మా కంపెనీలకు మరింత విస్తరిస్తాం. ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం. విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం. పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి జరుగుతోందన్నారు. భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ప్రపంచాలనికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోందన్నారు. నైపుణ్యానికి ఏపీ చేస్తున్న కృషి అభినందనీయం. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. -
కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి
న్యూఢిల్లీ/జెనీవా: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా ‘కోవాగ్జిన్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. కోవాగ్జిన్‌ను ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్(ఈయూఎల్)లో చేర్చినట్లు డబ్ల్యూహెచ్ఓ బుధవారం ప్రకటించింది. కోవాగ్జిన్‌కు ఈయూఎల్ హోదా కల్పించవచ్చంటూ డబ్ల్యూహెచ్ఓకు చెందిన స్వతంత్ర సాంకేతిక సలహా బృందం(టీఏజీ) ప్రతిపాదించడంతో టీకాకు మార్గం సుగమమైంది. గర్భిణులకు.. ఇప్పుడే చెప్పలేం కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసినందుకు గాను డబ్ల్యూహెచ్ఓకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కృతజ్ఞతలు తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు, దేశ ప్రజల విశ్వాసానికి ఇదొక నిదర్శనమని చెప్పారు. ఇది ఆత్మనిర్భర్ దీపావళి అని పేర్కొన్నారు. దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి దక్కడం పట్ల డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ భారత్‌కు అభినందనలు తెలియజేశారు. కరోనా నుంచి రక్షణ కల్పించే విషయంలో కోవాగ్జిన్ చక్కగా పని చేస్తున్నట్లు సాంకేతిక సలహా బృందం గుర్తించింది. దీంతో ఎలాంటి రిస్కు లేదని తేల్చింది. 18 ఏళ్లు దాటిన వారంతా ఈ టీకా నిరభ్యంతరంగా తీసుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ మరో ట్వీట్లో సూచించింది. నాలుగు వారాల వ్యవధితో రెండు డోసులు తీసుకోవాలని పేర్కొంది. అయితే, గర్భిణులకు కోవాగ్జిన్ ఇవ్వొచ్చా లేదా అనేది చెప్పడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం సరిపోదని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపింది. రెండు డోసులు తీసుకున్న 14 రోజుల తర్వాత కోవాగ్జిన్ టీకా కరోనాపై దాదాపు 78 శాతం సమర్థతను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది. కోవాగ్జిన్‌ను నిల్వ చేయడం చాలా తేలిక అని, అందుకే తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలకు ఈ టీకా చక్కగా సరిపోతుందని వివరించింది. లక్షణాలు కనిపించే కరోనాపై 77.8 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం కోవాగ్జిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే రోమ్‌లో జి–20 సమావేశాల సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయెసస్తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ నుంచి అత్యవసర వినియోగ అనుమతి రావడం విశేషం. కోవాగ్జిన్ షెల్ఫ్ లైఫ్ 12 నెలలు కోవాగ్జిన్ టీకా షెల్ఫ్ లైఫ్‌ను తయారీ తేదీ నుంచి 12 నెలల దాకా పొడిగించేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అంగీకరించినట్లు భారత్ బయోటెక్ సంస్థ బుధవారం వెల్లడించింది. కోవాగ్జిన్ షెల్ఫ్‌లైఫ్ అనుమతి తొలుత ఆరు నెలలకే లభించింది. తర్వాత దీన్ని తొమ్మిది నెలలు పొడిగించారు. తాజాగా ఒక సంవత్సరం(12 నెలల) పొడిగించడం విశేషం. అంటే టీకాను తయారు చేసిన తర్వాత 12 నెలల్లోగా ఉపయోగించవచ్చు. (చదవండి: కోవాగ్జిన్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా) విదేశాలకు వెళ్లేవారికి ఇక్కట్లు తప్పినట్లేనా? భారత్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి కరోనా టీకా కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగ అనుమతి దక్కడం పట్ల ఊరట వ్యక్తమవుతోంది. భారత్‌లో ఇప్పటిదాకా దాదాపు 15 కోట్ల మంది ఈ టీకా తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగస్థులు, గృహిణులు, కార్మికులు.. ఇలా అన్ని రంగాల వారు ఉన్నారు. అయితే, కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ నుంచి అనుమతి రావడంలో తీవ్ర జాప్యం జరగడంతో విదేశాలకు వెళ్లేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోవాగ్జిన్ తీసుకున్న వారు విదేశాలకు వెళ్లిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. సొంత ఖర్చుతో కరోనా పరీక్ష చేయించుకొని నెగెటివ్ ఆర్టీ–పీసీఆర్ రిపోర్టు ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఆమోదం పొంది కరోనా టీకాను తీసుకోక తప్పలేదు. డబ్ల్యూహెచ్ఓ నుంచి అత్యవసర వినియోగ అనుమతి లభించిన కరోనా టీకాలను ప్రపంచంలో దాదాపు చాలా దేశాలు అధికారికంగా గుర్తిస్తున్నాయి. అయితే అమెరికా, యూరోప్ దేశాల్లో మాత్రం వారి సొంత ఔషధ నియంత్రణ సంస్థలు కూడా ఆమోదం తెలిపితేనే... ఏ టీకానైనా అనుమతిస్తారు. అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ), యూరోప్ దేశాల్లో యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) అనుమతులను కోవాగ్జిన్ పొందాల్సి ఉంటుంది. తర్వాతే కోవాగ్జిన్ తీసుకున్న వారికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లుగా అమెరికా, యూరోప్ దేశాలు పరిగణిస్తాయి. మిగతా దేశాల్లో మాత్రం ఈ టీకా తీసుకున్న భారతీయులు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మళ్లీ మరోసారి కరోనా టీకా తీసుకోవాల్సిన పని ఉండదు. చదవండి: ‘ఇంటింటికి వెళ్లండి.. మత పెద్దల సాయం తీసుకోండి’ -
చిన్నారులకు కోవాగ్జిన్.. అనుమతించిన నిపుణుల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. 2-18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈమేరకు అనుమతులు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు వారిపై కోవాగ్జిన్ 2,3వ దశ ట్రయల్స్‌ని సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేసింది భారత్ బయోటెక్. ఇటీవలే రెండు, మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 2, 3 దశల్లో 20 రోజుల గ్యాప్‌తో రెండు డోసుల వ్యాక్సిన్‌ను దాదాపు 525 మంది చిన్నారులపై ప్రయోగించారు. (చదవండి: కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!) ఈ నేపథ్యంలో ‘‘పూర్తి చర్చల అనంతరం ఈ కమిటీ 2-18 ఏళ్ల చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కింద కోవాగ్జిన్ ఇచ్చేందుకుభారత్ బయోటెక్ కంపెనీకి అనుమతులిచ్చాం” అని సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కోవాగ్జిన్ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం -
Oral Vaccine: ప్రయోగాలకు ఐసీఎంఆర్ రెడీ!
కొవిడ్-19 జబ్బు కోసం ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌ను ఇదివరకే భారత్ బయోటెక్ రూపొందించింది. ప్రస్తుతం అది క్లినికల్ ట్రయల్స్ స్టేజ్‌లో ఉంది. ఇప్పుడు నోటి ద్వారా అందించే టీకాను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది ఐసీఎంఆర్. . కోల్‌కతా: ఈ మేరకు ఒక ప్రతిపాదనను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖలోని బయోటెక్నాలజీ విభాగానికి పంపినట్లు భారత వైద్య పరిశోధన మండలి-కలరా అండ్ ఎంటెరిక్ సీసీజెస్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. జర్మనీకి చెందిన ఒక సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని ఐసీఎంఆర్–ఎన్ఐసీఈడీ డైరెక్టర్ శాంతా దత్తా వెల్లడించారు. ప్రయోగానుమతి లభించి, నిధుల లభ్యత కాగానే పని ఆరంభిస్తామన్నారు. ఒక్కసారి టీకా తయారయ్యాక జంతువులపై ప్రయోగిస్తారని తెలిపారు. మాములు టీకా తయారీలో ఉన్నట్లే ఇందులో అన్నిరకాల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ల్యాబ్‌లో ఓరల్ వ్యాక్సిన్ తయారీకి కనీసం 5–6 సంవత్సరాలు పడతుందని ఆమె వివరించారు. -
బయోటెక్ టీకాపై బ్రెజిల్‌కూ అనుమానం
భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాగ్జిన్ టీకాను ప్రధాని మోదీ బ్రెజిల్లో ప్రమోట్ చేయడానికి çపూనుకున్న సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు బొల్సొనారో– మోదీల మధ్య నడచిన సంభాషణ పూర్తి వివరాల రికార్డు ఆధారంగా ఇప్పుడు బ్రెజిల్లో తీవ్రస్థాయిలో విచారణ సాగుతోంది. పైగా భారత్ నుంచి బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యే హెచ్.సి.క్యు ఔషధం లోతుపాతులపై బ్రెజిల్ సెనెట్ కమిషన్ కేంద్రీకరించింది. బొల్సొనారో ఉన్మాద చర్యలలో మన ప్రధాని మోదీని కూడా ఇరికించబోవడం ఒకటి! ప్రయివేట్ కంపెనీల వ్యాపారానికి ఐవర్ మెక్టిన్, తదితర మందుల్ని సరఫరా చేయడానికి ప్రభుత్వ నిధుల్ని వినియోగించడాన్ని బ్రెజిల్ సెనేటర్ అజీజ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రధాని మోదీ పేరు బ్రెజిల్ విచారణలో ప్రస్తావనకు రావడం మనకు బాధాకరమే. అందుకే ’ప్రజలముందు నిజం దాచొద్దు’ అని చెప్పడం. 1918 నాటి ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల ఆ శతాబ్ది నుంచి వచ్చిన పెద్ద గుణపాఠం– ‘‘ప్రభుత్వాలు ప్రజలకు అబద్ధాలు చెప్పరాదు’’ అని! ప్రపంచంలో ఎప్పుడు పెను వ్యాధులు పెల్లుబుకినా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వాలు అంటువ్యాధులకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియకుండా తొక్కిపెట్టడం వల్ల వ్యాధి విస్తరణ సమాచార వివరాలు పూర్తిగా కనుమరుగవుతాయి. ఫలితంగా నమూనాలు సేకరించాల్సిన వారు వాస్తవ విరుద్ధమైన సమాచారం అందించే ప్రమాదం ఉంటుంది. ఈ తప్పుడు లెక్కలనేవి తప్పుడు విధానాలకు, తప్పుడు కార్యక్రమాల రూపకల్పనకు దారితీస్తాయి. కనుక సంబంధిత నిపుణులకు సరైన వివరాలు అందుబాటులో ఉండితీరాలి. ’’ - ప్రసిద్ధ ప్రపంచ చరిత్రకారుడు జాన్ బారీ రెండు బ్రెజిలియన్ ప్రైవేట్ ఫార్మా కంపెనీలు ‘ఫ్లూ’ సంబంధిత వైరస్ వ్యాధులకు వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును ఉత్పత్తి చేయ డానికి అనువైన ముడి సరుకును భారతదేశం నుంచి బ్రెజిల్‌కు ఎగు మతి చేయవలసిందిగా బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో అడిగిందే తడ వుగా భారత ప్రధాని నరేంద్రమోదీ హుటాహుటిన ముడి సరుకును పంపించడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన రహస్య సంభాషణపై బ్రెజిల్ పార్లమెంటరీ కమిషన్ విచారణ జరుపుతోంది. అందులో మోదీ ప్రస్తావన చోటు చేసుకుంది. 2020 ఏప్రిల్ 4న బొల్సొనారో– మోదీల మధ్య సాగిన పూర్తి సంభాషణ నివేదికలోని కొన్ని భాగాలను ‘‘గోబో’’ వార్తా పత్రిక ప్రచురించింది. ఇంతకూ మోదీ అసలు ఏ ఫార్మా వ్యాపార కంపెనీని ప్రమోట్ చేసిన సందర్భంలో బ్రెజిల్ పార్లమెంటరీ సెనేట్ కమిషన్ విచారణలో మోదీ ప్రస్తావన ప్రముఖంగా తలెత్తింది? భారత బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాగ్జిన్ టీకాను మోదీ ప్రమోట్ చేయడానికి పూనుకున్న సందర్భంగా బొల్సొనారో– మోదీల మధ్య నడచిన సంభాషణ పూర్తి వివరాలు రికార్డు అయిన ఉదంతాన్ని బ్రెజిల్ సెనెటర్స్ ప్రత్యేక కమిషన్ పేర్కొని బహిర్గతం చేయడం అసలు విశేషం. బ్రెజిల్ ప్రయి వేట్ ఫార్మా కంపెనీలలో ఒకటి– బ్రెజిల్లో భారత్ బయోటెక్ ప్రయి వేట్ కంపెనీ ప్రతినిధిగా ఉన్న ప్రెసిసా మెడికమెంటోస్. రెండవ బ్రెజి లియన్ కంపెనీ ‘అప్సేన్’. ఇది బ్రెజిల్లో ‘ఫ్లూ’ సంబంధిత అంటు వ్యాధుల నిరోధానికి వాడే భారత ఔషధం (టీకా) హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)ని ఉత్పత్తి చేసే సంస్థ అని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొ నారో భారత ప్రధాని మోదీకి తెలుపుతూ.. కోవిడ్– 19 వ్యాధి పీడితు లకు ఈ మందును వాడటం వల్ల ప్రోత్సాహకర ఫలితాలు వస్తు న్నాయి కాబట్టి ఈ మందుకు ఉపయోగించే ముడిసరుకును బ్రెజిల్‌కు త్వరగా పంపించాలని కోరారు (4–4–2020). ఈ సంభాషణ పూర్తి పాఠాన్ని బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నమోదు చేసింది. ఈ పాఠాన్ని కాస్తా ‘‘ఓ గ్లోబ్’’ వార్తా పత్రికలో భాగాల కింద ప్రచురించింది. రెండు బ్రెజిలియన్ కంపెనీలకు తక్షణం హెచ్‌సీక్యూ ఔషధం ముడిసరుకును పంపాలని మోదీని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొ నారో కోరడమూ, ‘‘బ్రెజిల్‌కు తక్షణం ఇండియా సహాయపడటానికి శాయశక్తులా సిద్ధమని మోదీ ప్రకటించడమూ’’ బ్రెజిల్ విదేశాంగ శాఖ మంత్రి ఎర్నెస్టో అరయుదో సమక్షంలో రికార్డయిందని సావో పాలో నుంచి సుప్రసిద్ధ జర్నలిస్టులు షోభన్ సాక్సేనా, ఫ్లోరెన్సియా కోస్టాలు రాసిన రిపోర్టును ‘‘వైర్’’ సంస్థ వరల్డ్ ఎనాలసిస్ సమీక్షలో వెల్లడించింది. బొల్సొనారో బ్రెజిల్ అధ్యక్షుని హోదాలో వెలగబెడు తున్న పెక్కు ఉన్మాద చర్యలలో భారత ప్రధాని మోదీని కూడా ఇరికించబోవడం ఒకటి! ఫలితంగా బ్రెజిల్ పార్లమెంటరీ ఉన్నత స్థాయి కమిషన్ విచారణలోకి మోదీని కూడా లాగడం విశేషం! బ్రెజిల్ టి.వి. న్యూస్ చానల్స్ అన్నీ ఈ ఉదంతాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయని కూడా ‘‘వైర్’’ విశ్లేషణ. పైగా ఉభయ నాయకుల సంభాషణ, ఫొటోలు ప్రముఖంగా అక్కడి చానల్స్‌లో వైరల్ అయ్యాయి. అంతేగాదు, తన పని నెరవేర్చుకునే సందర్భంలో బొల్సొ నారో రామాయణ కావ్యంలో రాముడి సోదరుడు లక్ష్మణుని రక్షిం చడం కోసం రాముని బంటు హనుమాన్ హిమాలయాల నుంచి తెచ్చిన ‘‘సంజీవని’’ ప్రయోగం ఎలా పని చేసిందో కూడా ఉదాహరిం చడం విశేషం! బహుశా ఇందుకేనేమో... కొంటె అమెరికన్ రాజకీయ వేత్తలు కొందరు ఇటీవల పతనమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ ప్రెసిడెంట్ బొల్సొనారోను, భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిపి ‘‘ ప్రజాస్వామ్య వ్యతిరేక పక్షం’’ గా ఒకేగాటన కట్టడా నికి సాహసించారు! మరో విశేషమేమంటే, ఇండియాతో సంబంధం ఉన్న రెండు బ్రెజిలియన్ ప్రయివేట్ ఫార్మా కంపెనీలలో ఒకటైన ఇ.ఎమ్. ఎస్’’ బ్రెజిల్లో జెనరిక్ మెడిసిన్స్ ఉత్పత్తి చేసే బడా కంపెనీ కాగా, ‘‘ఆప్సెన్’’ బ్రెజిల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్.సి.క్యు) ఔషధాన్ని భారీగా ఉత్పత్తి చేసే కంపెనీ. కానీ ఈ రెండు బడా ప్రయివేటు ఫార్మా కంపెనీల యజమానులు బొల్సొనారోకు బడా బడా తబలిస్టులని బెల్జియన్ పత్రికల భావన! బొల్సొనారో– మోదీల మధ్య సాగిన సంభాషణ పూర్తి పాఠాన్ని ఒకవైపు సెనెటర్స్ కమిషన్ పరిశీలిస్తుండ గానే ఇండియా నుంచి బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యే హెచ్.సి.క్యు ఔషధం లోతుపాతులపై బ్రెజిల్ సెనెట్ కమిషన్ కేంద్రీకరించింది. పైగా సెనెట్ విచారణ సంఘం ఉపాధ్యక్షుడైన సెనెటర్ రాండోల్ఫి రోడ్రిగస్ ఈలోగా రెండు బడా బ్రెజిల్ ఫార్మా కంపెనీల ఉన్నతాధి కారులను వారి బ్యాంకు, టెలిఫోన్ రికార్డులు అన్నింటినీ విచారణా సంఘానికి తక్షణం దఖలుపర్చాలని ఆదేశించడం కొసమెరుపు అని బ్రెజిల్ పత్రికలు పేర్కొన్నాయని కూడా ’వైర్’ సమాచారం. కాగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ దిగుమతుల కుంభకోణంలో బెల్జియన్ పాలకవర్గంలో లేదా దాని వందిమాగధుల్లో ఎవరెవరికి ఎంతెంత మొత్తం ముట్టి ఉంది అనే అంశంపై బ్రెజిల్ పార్లమెంటరీ కమిషన్ అధ్యక్షుడు ఒమర్ అజీజ్ తాజాగా విచారణ జరుపుతున్నారు. పైగా ప్రయివేట్ కంపెనీల వ్యాపారానికి ప్రజాధనాన్ని (ప్రభుత్వ నిధుల్ని) వినియోగించి ఐవర్ మెక్టిన్, తదితర మందుల్ని సరఫరా చేయడానికి వినియోగించడాన్ని సెనేటర్ అజీజ్ తీవ్రంగా దుయ్యబట్టారు. పైగా బొల్సొనారో చైనాను రెచ్చగొడుతూ యూరప్ దేశాధిపతులతో చేతులు కలపడాన్ని కూడా అజీజ్ విమర్శించారు. ఇంతకూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమోట్ చేయగా బొల్సొనారో కళ్లకద్దుకున్న భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు ప్రశంస నీయమైన ఉత్పత్తి నాణ్యతా ప్రమాణాలు గల టీకా అన్న సర్టిఫికెట్ ఇవ్వడానికి బ్రెజిల్ సాధికార ఆరోగ్య సంస్థ నిరాకరించడం పెద్ద కొసమెరుపు. కోవాగ్జిన్ మూడవ దశ నాణ్యతా పరీక్షలు నిర్ధారణ అయ్యేదాకా ఆ సంస్థ తయారు చేసిన టీకాను బ్రెజిల్‌కి దిగుమతి చేయరాదని దాని ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఆది నుంచీ ప్రముఖంగా పేర్కొంటూ వస్తున్న భారత సుప్రసిద్ధ వైరాలజిస్టు గంగదీప్ కౌర్ ఇప్పటికీ పదే పదే దీనిపై విమర్శిస్తూ ఉండటం ఈ సందర్భంలో గమనార్హం. కానీ ఈ లోపుగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు బ్రెజిల్ పార్లమెంటరీ కమిషన్ విచారణలో ప్రస్తావనకు రావడం మనకు బాధాకరమే. అందుకే ’ప్రజలముందు నిజం దాచొద్దు’ అని చెప్పడం. అందుకే ఎప్పుడూ ప్రజల మాటే పాలకుల కోటగా వర్ధిల్లాలి. లేకపోతే బుచ్చయ్య అనే భూతానికి రామయ్య అనే రక్ష రేక అవసరం కల్గుతుందన్న సామెతలో ఎంత నిజముందో! abkprasad2006@yahoo.co.in -
వ్యాక్సిన్ల ఖర్చు ఎంతైనా రెడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన మేర వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు గ్లోబల్ టెండర్ల ద్వారా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం ఇచ్చే కేటాయింపుల్లోనూ ఇప్పటికే భారీగా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తోంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ కోసం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ మరిన్ని డోసులు పొందేలా ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలన్న ధ్యేయంతో ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడటం లేదు. దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా ఒకేరోజు 6.28 లక్షలు టీకాలు వేసి మన రాష్ట్రం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.125,63,97,450 విలువైన వ్యాక్సిన్ డోసుల కోసం ఆర్డరు పెట్టింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఆర్డర్లు పెట్టారు. ఇప్పటికే రూ.61 కోట్ల వరకు చెల్లింపు వ్యాక్సిన్ల కోసం ఇప్పటికే రూ.61 కోట్ల వరకూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మే నెలలో సరఫరా అయిన వ్యాక్సిన్‌కు రూ.49 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు జరిపారు. ఆ మొత్తం చెల్లించిన తరువాతే రాష్ట్రానికి మే నెలలో వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. మరో రూ.64 కోట్లను చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఆర్డరు పెట్టిన మేరకు వ్యాక్సిన్ రెడీ కాగానే సంబంధిత సంస్థలు ప్రభుత్వానికి సమాచారం ఇస్తాయి. వెంటనే చెల్లింపులు చేసి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని ఏపీఎంఎస్ఐడీసీ (రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు ఆసక్తి చూపలేదని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఇప్పటివరకూ జూన్ వరకే పర్చేజ్ ఆర్డర్లు పెట్టామని.. జూలై కేటాయింపులను బట్టి మళ్లీ ఆర్డర్లు పెడతామని ఆ అధికారి తెలిపారు. -
కోవాగ్జిన్ ఉత్పత్తి పెంపు కోసం కేంద్రం కీలక నిర్ణయం
ముంబై: దేశంలో స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఫార్ములాను ముంబైకి చెందిన మరో ప్రభుత్వ రంగ కంపెనీ హాఫ్కిన్ బయోఫార్మాతో పంచుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హాఫ్కిన్ బయోఫార్మా సంవత్సరానికి కోవాగ్జిన్ 22.8 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయనుంది. దేశంలో మొత్తం జనాభాకు త్వరగా టీకాలు వేయడానికి దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని భారీగా పెంచాడనికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆత్మ నిర్భర్ భారత్ 3.0 మిషన్ 'కోవిడ్ సురక్ష' కింద మూడు ప్రభుత్వ సంస్థలకు ఈ ఫార్ములాను పంచుకునేందుకు భారత్ బయోటెక్ అంగీకారం తెలిపింది. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన పీఎస్‌యు హాఫ్కిన్ బయోఫార్మా, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ లిమిటెడ్‌తో టెక్నాలజీ బదిలీ కింద కోవాగ్జిన్ టీకా తయారు చేస్తుంది. హాఫ్కిన్ సంస్థ పరేల్ కాంప్లెక్స్ వద్ద ఉత్పత్తి జరుగుతుంది. హాఫ్కిన్ బయోఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ రాథోడ్ మాట్లాడుతూ.. సంవత్సరంలో 22.8 కోట్ల మోతాదుల కోవాగ్జిన్ ఉత్పత్తి చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. "కోవాగ్జిన్ టీకాలను భారీగా ఉత్పత్తి చేయడానికి హాఫ్కిన్ బయోఫార్మాకు కేంద్రం రూ .65 కోట్లు, మహారాష్ట్ర ప్రభుత్వం రూ.94 కోట్లు మంజూరు చేసినట్లు" అని ఆయన అన్నారు. చదవండి: Fact Check: కేంద్రం మన ఫోన్ కాల్స్ రికార్డు చేస్తుందా? -
బాబూ.. టీకా తెప్పించవూ!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొత్తం కేంద్రం కనుసన్నల్లో నడుస్తోంది. ఏ రాష్ట్రానికి ఎంత కోటా ఇవ్వాలనేది కంపెనీలకు కేంద్రమే నిర్దేశిస్తోంది. కంపెనీలకు ఎంత డబ్బు చెల్లించాలో రాష్ట్రాలక్కూడా కేంద్రమే చెబుతోంది. అంతేకాదు!! కంపెనీల నుంచి తీసుకున్నాక ఏ వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలన్నదీ కేంద్రం నిర్దేశమే. ఈ వాస్తవాల నడుమ అటు కేంద్రానికి, ఇటు కంపెనీలకూ అభ్యర్థనలు చేస్తూ... లేఖలు రాస్తూ వీలైనంత ఎక్కువ వ్యాక్సిన్లు పొందటానికి రాష్ట్రం ప్రయత్నిస్తోంది. దేశంలో రెండు కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయి కనక.. వాటి ఉత్పత్తి సామర్థ్యం ఇంకా పెరగలేదు కనక కేంద్రం నుంచి కూడా సానుకూల స్పందన రావటం లేదు. దీంతో వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న వారికి సకాలంలో రెండో డోసు వేయకపోతే మళ్లీ మొదటి నుంచి వేయాల్సి వస్తుందనే వాస్తవాన్ని వివరిస్తూ... ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని, అది కూడా రెండో డోసుకు ప్రాధాన్యమిచ్చి... ఆ తరవాత మొదటి డోసు వేస్తామని ఈ మేరకు అనుమతివ్వాలని కూడా కేంద్రాన్ని రాష్టం కోరింది. ఆ మేరకే చేస్తోంద కూడా. ఇన్ని వాస్తవాలు తెలిసి కూడా... తెలుగుదేశం పార్టీ జనాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందటానికి దుష్ప్రచారానికి దిగుతుండటం రాష్ట్రంలో ఎవ్వరికీ మింగుడు పడటం లేదనే చెప్పాలి. రెండో డోసు వారికి తొలుత పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా కూడా వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ తమ కార్యకర్తలను పంపిస్తోందని... వ్యాక్సిన్ వేయకపోవటంతో వెనుదిరుగుతున్నారనే ప్రచారానికి ఒడిగడుతోందని విమర్శలున్నాయి. ఈ విమర్శలను పతాక శీర్షికల్లో ప్రచురిస్తూ ఈనాడుతో సహా కొన్ని బాబు అనుకూల పత్రికలు ఛానెళ్లు తమ ప్రభు భక్తిని చాటుకుంటున్నాయి. నిజానికి కేంద్ర నియంత్రణలు, కంపెనీల పరిమిత విక్రయాలు... ఇవన్నీ నిజం కాదనుకున్నా, లేవని భావించినా వ్యాక్సిన్ విషయంలో చంద్రబాబు కాస్త పరిణితితో వ్యవహరించే అవకాశం ఎటూ ఉంది. చౌకబారు విమర్శలు మాని... వ్యాక్సిన్ తయారీ కంపెనీల్లో ఒకటైన భారత్ బయోటెక్.. రాష్ట్రానికి ఎక్కువ కోవాగ్జిన్లు విక్రయించేలా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ స్వయానా రామోజీరావు కుమారుడి వియ్యంకుడిది. చంద్రబాబుకూ వీరు సన్నిహితులే కాబట్టి ఈ కంపెనీ ద్వారా రాష్ట్రానికి కావలసిన వ్యాక్సిన్లు తెప్పించాలని రెండ్రోజులుగా రాష్ట్ర మంత్రులు అభ్యర్థిస్తున్నారు కూడా. కాకపోతే రాజకీయ లబ్ధి తప్ప వేరేవీ పట్టని చంద్రబాబు... ప్రభుత్వంపై బురద చల్లటానికి, జనాన్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ప్రాధాన్యమిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. టీకా వేసే సామర్థ్యంలో ఏపీ ముందంజ దేశంలోనే రోజుకు ఎక్కువ డోసులు టీకా వేసే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉందని, ఒక్క రోజులో ఏకంగా 6.28 లక్షల మందికి టీకా వేసి గత నెల 14న నిరూపించింది. టీకా దొరికితే రాష్ట్ర ప్రభుత్వమే కొని వేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కంపెనీలకు లేఖలు సైతం రాసింది. టీకా కొనుక్కోవడం మన చేతుల్లో లేకపోవడంతో కేంద్రానికి ఇప్పటికే ముఖ్యమంత్రి నుంచి అధికారుల వరకు ఐదు దఫాలు లేఖలు రాశారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశారు. అధికారులు ఇప్పటికీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ప్రతిరోజూ దీనిపై అభ్యర్థిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష నేత మాత్రం దీన్ని రాజకీయం చేయాలని, వ్యాక్సిన్ సకాలంలో వేస్తే ఎక్కడ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందో అన్నట్టు వ్యవహరిస్తుండటం నిపుణులనే కాదు సామాన్యులనూ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటి వరకు కేంద్రానికి ఐదు లేఖలు ► తమకు టీకా అదనంగా కావాలని, రోజుకు 6 లక్షల డోసులు పైగా వేసే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి, అధికారులు కేంద్రాన్ని అభ్యర్థించారు. 2021 ఏప్రిల్ 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ‘1,140 పీహెచ్‌సీలు, 259 అర్బన్ హెల్త్ పీహెచ్‌సీలు ఉన్నాయి. విలేజ్/వార్డు వలంటీర్లు కృతనిశ్చయంతో ఉన్నారు. తక్షణమే 25 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలి’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు. ► 2021 ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి మరోమారు ప్రధానికి లేఖ రాశారు. ‘ఏప్రిల్ 14న టీకా ఉత్సవ్‌లో భాగంగా ఒకే రోజు 6.28 లక్షల పైచిలుకు డోసులు వేశాం. 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే తక్షణమే 60 లక్షల డోసులు పంపించండి’ అని ఆ లేఖలో విన్నవించారు. ► 2021 మార్చి 26వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్.. రానున్న నెల రోజుల్లో కోటి డోసులు వ్యాక్సిన్ ఇస్తే వేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌కు లేఖ రాశారు. ► 2021 ఏప్రిల్ 30న వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్... రెండో డోసు పూర్తి చేయటానికి తక్షణం వ్యాక్సిన్లు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ► 2021 ఏప్రిల్ 24న వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర (సర్వీసెస్) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘18–45 ఏళ్ల మధ్య వారికి టీకా ఇచ్చేందుకు మాకు 4.08 కోట్ల డోసుల అవసరం ఉంది. మేం కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రోజుకు 6 లక్షల డోసులు వేసే సామర్థ్యం ఉంది. వీలైనంత త్వరగా మాకు వ్యాక్సిన్ అందించండి’ అని కోరారు. కేంద్రం నుంచి లేఖలు ఇలా.. ► 2021 ఏప్రిల్ 29న జాతీయ హెల్త్ మిషన్ అధికారులు రాష్ట్రానికి లేఖ రాశారు. ‘మీకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 9,91,700 డోసులు అలాట్ చేశాం. మే 1కి మీకు ఈ వ్యాక్సిన్ అందుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు. ► అదే రోజు మరో లేఖ అందింది. ‘మీకు భారత్ బయోటెక్ సంస్థ నుంచి 3,43,930 డోసులు కేటాయించాం. ఈ వ్యాక్సిన్ మీకు మే 1 నాటికి వస్తుంది. మీరు టీకా ప్రక్రియ కొనసాగించండి’ అని పేర్కొన్నారు. టీకా లభ్యత పెరిగే వరకూ ఏమీ చేయలేం అన్ని రకాలుగా టీకా గురించి కేంద్రాన్ని అడుగుతున్నాం. మేమే కొనుక్కుంటామని కూడా చెప్పాం. దీనిపై లేఖ రాశాం. ప్రతిరోజూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్న లభ్యతను బట్టి రెండో డోసు మాత్రమే వేస్తున్నాం. 18 ఏళ్ల వయసు దాటిన వాళ్లందరికీ టీకా వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డబ్బు పెట్టి కొనేందుకూ సిద్ధంగా ఉన్నాం. కానీ లభ్యత లేదు. కోటా ప్రకారమే వస్తోంది. – అనిల్‌కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ -
సరసమైన ధర, సబ్సిడీ... అంత ఈజీ కాదు
కోవిడ్ రెండోదశ చాలా ఉధృతంగా వచ్చింది. అయినా పౌరుల్లో మాత్రం స్పృహ ఇంకా కొరవడుతూనే ఉంది. ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కేసులు, మొత్తం కోటిన్నర మందికిపైగా బాధి తులు, 1.86 లక్షల మరణాలు.. ఈ అంకెలు చూస్తేనే భయం అనిపిస్తున్నా.. రాబోయే కాలంలో ఇవి మరింతగా ఎక్కు వయ్యే ప్రమాదం కళ్లెదుటే కనిపిస్తోంది. కోవిడ్ పరీక్షలు, బాధితుల మరణాల విషయంలో కొన్ని రాష్ట్రాలు ఇస్తున్న లెక్కలు ఎంతవరకు నిజమన్న అనుమానాలూ తలెత్తుతు న్నాయి. కానీ వీటన్నింటి కంటే ప్రజల నిర్లక్ష్యమే చాలా ప్రమా దకరం. వైరస్ ప్రస్తుతం విజృంభిస్తున్న తీరు చూస్తే దాన్ని నిరో ధించడం మన చేతుల్లోనే ఉందని అర్థమవుతుంది. జూలై లోపు రెండోదశ ఉధృతి తగ్గుతుందన్న ఆశలు ఏమాత్రం లేవు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? టీకా వేసుకోవడం ఒక్కటే ప్రస్తుత తరుణంలో వైరస్‌ను అడ్డుకోవడానికి కొంతలో కొంత ఉత్తమ మార్గం. అయినా టీకా వేయించుకున్నంత మాత్రాన భౌతికదూరం నిబం ధనలను మాత్రం వదలకూడదు. టీకా వేయించుకుంటే కరోనా వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. ఒకవేళ వచ్చినా.. వ్యాధి తీవ్రత బాగా తగ్గుతుంది. ఈ కథనం రాసే సమయానికి దేశంలో 13.5 కోట్ల టీకాలు వేశారు. వారిలో 11.5 కోట్ల మంది తొలిడోసు తీసుకున్నారు. రోజుకు సుమారు 50 లక్షలమందికి వేయొచ్చని ఓ అంచనా. ఈ లెక్కన మొత్తం జనాభాకు టీకాలు వేయడానికి ఎంత సమయం పడుతుందో లెక్క వేసుకోవచ్చు. భారతదేశ జనాభా, వైశాల్యం.. వీటన్నింటి దృష్ట్యా చూస్తే అందరికీ టీకాలు అంత త్వరగా వేయడం కష్టమే. ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ టీకాలే అందుబాటులో ఉన్నాయి. త్వరలో స్పుత్నిక్ కూడా వస్తుంది. డిమాండు- సరఫరా పరిస్థితిని బట్టే టీకా ధర ఎంతన్నది నిర్ణయిస్తారు. ప్రభుత్వం టీకాను ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తే.. మార్కెట్ అస్తవ్యస్తం అవుతుంది. క్లియరెన్స్ సేల్ పద్ధతిలో టీకాలను ఎవరూ ఇవ్వలేరు. అందువల్ల ప్రభుత్వం నిర్ణయించే ధర కూడా అలాంటి ధర కంటే ఎక్కువగానే ఉండాలి. మూడోదశ టీకా వ్యూహం ప్రకారం.. కంపెనీలు ముందుగానే టీకా ధర వెల్ల డిస్తాయి. ఈ ధర ఒక్కో డోసు రూ. వెయ్యి కంటే తక్కువగానే ఉండే అవకాశం లేదు. రూ. 150, రూ. 200 అనేది సాధారణ ధర కంటే చాలా తక్కువ. దురదృష్టవశాత్తు ప్రజలు చెల్లించలేరన్న భావనతో ముందుగా తక్కువ ధరలు నిర్ణయిస్తారు. కానీ భరించ లేనివారికి మాత్రమే సబ్సిడీ ధరలకు ఇవ్వడం వేరు.. అందరికీ అలా ఇవ్వడం వేరు. టీకా డిమాండు ఎప్పుడూ సరఫరా కంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ ధరకు టీకా ఉత్పత్తి చేయడం వల్ల వారికి ఎలాంటి ప్రోత్సాహం అందదు. మొత్తం జనాభా అందరికీ ప్రభుత్వమే టీకాలు వేయించాలా అన్నది కూడా ఒక ప్రశ్నే. తొలుత 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటినవారిలో వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే టీకాలు ఇచ్చారు. వీరిలో చాలామంది ఉత్పాదకతకు దూరంగా ఉన్నవారే. ఉత్పాదక రంగంలో యువత ఉంటారు. ఆర్థిక కార్యకలాపాలు, జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలంటే.. ఉత్పాదక రంగం లోని వారికి తొలుత టీకాలు ఇవ్వాలి. కానీ రాజకీయ పరంగా చూస్తే ఇది అంత సులభం కాదు. మూడోదశలో 50% టీకాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి, మిగిలినది మార్కెట్ ధరకు రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామన్నారు. దానివల్ల 18 ఏళ్లు దాటిన వారం దరికీ టీకాలు ఇవ్వచ్చు. ఈ పద్ధతి వల్ల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు ఉత్పత్తి పెంచగలవు. ఈ రెండు కంపెనీలూ విదేశాలకూ టీకాను సరఫరా చేయడానికి ముందే ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ లెక్కన టీకా ఉత్పత్తి పెరిగి, అది అందరికీ అందుబాటు లోకి రావాలంటే కనీసం 2021 సెప్టెంబర్ వరకు వేచిచూడాలి. అప్పటికీ కొంత కొరత ఉంటుంది. టీకా ముడిపదార్థాల ఎగుమ తిని నియంత్రించడానికి అమెరికాలో డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ అమలుచేశారు. దీనికితోడు ప్రపంచ వాణిజ్య ఒప్పందం నేప థ్యంలో టీకా ఉత్పత్తికి లైసెన్సు తప్పనిసరి. ఇంతటి సంక్లిష్ట పరి స్థితుల్లో టీకా ఉత్పత్తి చేయడం, దాన్ని సరసమైన ధరలకే అందించడం అంటే కంపెనీలకు అసాధ్యం. కేంద్ర ప్రభుత్వం తమకు అందే 50% కోటాలో ఎంత మొత్తాన్ని ఏయే రాష్ట్రాలకు ఎలా సరఫరా చేస్తుందన్నది చూడాలి. ఆ టీకాలు చాలకపోతే.. రాష్ట్రాలు తమంతట తాముగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలాగే ప్రైవేటు ఆసుపత్రులూ టీకా ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుక్కోవాలి. తప్పనిసరిగా మార్కెట్ ధరలకు అను గుణంగానే వారు వెచ్చించాల్సి ఉంటుంది. బిబేక్ దేబ్ రాయ్ ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ (ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో) -
కరోనా టీకా సంస్థలకు బూస్ట్
న్యూఢిల్లీ: త్వరలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా కోవిడ్–19 టీకాలు వేసేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల సరఫరాను పెంచడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), భారత్ బయోటెక్ తదితర టీకాల తయారీ సంస్థలకు భవిష్యత్‌లో సరఫరా చేయబోయే వ్యాక్సిన్లకు సంబంధించి రూ. 4,500 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ల తయారీ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకునేందుకు తోడ్పడేలా బ్యాంక్ గ్యారంటీ అవసరం లేకుండా అడ్వాన్స్ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనలను సడలించినట్లు వివరించాయి. దీనికి క్యాబినెట్ అనుమతి అవసరం ఉండదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ‘క్రెడిట్ లైన్ రూపంలో ఈ నిధులు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపారని భావిస్తున్నాను. ఇందుకు ఆర్థిక మంత్రికి అధికారాలు ఉంటాయి. దీనికి క్యాబినెట్ ఆమోదం అవసరం లేదు. ప్రభుత్వం తలపెట్టిన టీకాల కొనుగోలు, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అవసరమైన స్థాయిలో వ్యాక్సిన్ల సరఫరాకు ఇది తోడ్పడుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం ఎస్ఐఐకి రూ. 3,000 కోట్లు, భారత్ బయోటెక్‌కు సుమారు రూ. 1,500 కోట్లు లభిస్తాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఎస్ఐఐ సీఈవో అదార్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. ‘దేశీయంగా టీకాల ఉత్పత్తి, పంపిణీకి తోడ్పడేలా విధానపరమైన మార్పులు చేయడంతో పాటు సత్వరం ఆర్థిక సహాయం చేయడంలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పూనావాలా ట్వీట్ చేశారు. మరోవైపు, పన్నుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలకు సంబం ధించి ఫైనాన్స్ బిల్లు 2021కి చేసిన సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. కోవిడ్ వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం మినహాయింపు! విదేశాల నుంచి భారత్‌కు వచ్చే కోవిడ్–19 వ్యాక్సిన్లపై ప్రభుత్వం దిగుమతి సుంకం మినహాయించే అవకాశం ఉంది. విదేశీ వ్యాక్సిన్ల ధర తక్కువగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. దిగుమతయ్యే వ్యాక్సిన్లపై ప్రస్తుతం 10% కస్టమ్స్ డ్యూటీ (దిగుమతి సుంకం) ఉంది. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల ప్రారంభంలో రష్యాకు చెందిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ భారత్‌లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. మరోవైపు అత్యవసర వినియోగానికి తమ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాల్సిందిగా మోడెర్నా, జాన్సన్ సైతం ప్రభుత్వానికి విన్నవించాయి. దిగుమతి అయ్యే వ్యాక్సిన్లపై కస్టమ్స్ డ్యూటీతోపాటు 16.5% ఐ–జీఎస్టీ, సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ వసూలు చేస్తున్నారు. వ్యాక్సిన్లను భారత్‌కు సరఫరా చేసేందుకు అనుమతించాల్సిందిగా విదేశీ సంస్థలు భారత ప్రభుత్వాన్ని కోరిన వెంటనే కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్లో తమ వ్యాక్సిన్‌కు అనుమతి కోసం ఫైజర్ ప్రభుత్వాన్ని సంప్రదించిన సమయంలోనే సుంకం మినహాయింపు అంశంపై చర్చ మొదలైంది. ఐసీఏఐ, సీఏఏఎన్‌జెడ్ ఒప్పందానికి ఓకే.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆ్రస్టేలియా అండ్ న్యూజిలాండ్ (సీఏఏఎన్‌జెడ్) మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందానికి (ఎంవోయూ) కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సభ్యుల అర్హతలకు సంబంధించి రెండు సంస్థలూ పరస్పరం గుర్తింపునిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, భారత్‌కు రెమిటెన్సులు పెరిగేందుకు కూడా ఇది తోడ్పడగలదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఐసీఏఐ, సర్టిఫైడ్ ప్రాక్టీసింగ్ అకౌంటెంట్ ఆస్ట్రేలియా మధ్య ఒప్పందానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు వివరించింది. తాల్చేర్ ఫెర్టిలైజర్ యూరియాకు సబ్సిడీ కోల్–గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా యూరియా ఉత్పత్తి చేసే తాల్చేర్ ఫెర్టిలైజర్స్ (టీఎఫ్ఎల్) కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన సబ్సిడీ విధానానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గెయిల్, కోల్ ఇండియా, ఆర్సీఎఫ్, ఎఫ్‌సీఐఎల్ కలిసి జాయింట్ వెంచర్‌గా 2015లో దీన్ని ఏర్పాటు చేశాయి. ఒరిస్సాలో ఎఫ్సీఐఎల్కి చెందిన తాల్చేర్ ప్లాంట్‌ను పునరుద్ధరించే దిశగా టీఎఫ్ఎల్ 12.7 లక్షల టన్నుల వార్షిక సామర్ధ్యంతో ప్లాంటును నిర్మిస్తోంది. యూరియా ఉత్పత్తికి సహజ వాయువుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, ఎల్ఎన్జీ దిగుమతి బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. -
7,598 మందికి వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా బుధవారం 7,598 మందికి వ్యాక్సిన్ వేశారు. వీరిలో కోవిషీల్డ్ (సీరం కంపెనీ) వ్యాక్సిన్ 6,619 మందికి వేయగా, కోవాగ్జిన్ (భారత్ బయోటెక్ కంపెనీ) వ్యాక్సిన్‌ను 979 మందికి వేశారు. ఈ టీకా ప్రక్రియలో 8 మంది స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 839 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టారు. ఏపీలో 111 పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33,808 పరీక్షలు నిర్వహించగా, 111 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ 1,29,75,961 మందికి పరీక్షలు నిర్వహించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,349కి చేరింది. ఒకేరోజు 97 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,78,828కి చేరింది. తాజాగా ఇద్దరి మృతితో మొత్తం మరణాలు 7,152కి చేరాయి. యాక్టివ్ కేసులు 1,369 ఉన్నాయి. -
కోవాగ్జిన్ సైడ్ ఎఫెక్ట్స్.. 14 రకాలు
సాక్షి, హైదరాబాద్: కోవాగ్జిన్ కరోనా టీకాతో 14 రకాల సాధారణ సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఇవిగాక అరుదుగా మరో ఐదు రకాల సీరి యస్ రియాక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. టీకా తీసుకునే ముందు కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందికి లబ్ధిదారులు తమ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా వివరించాలని, కొన్ని రకాల అల ర్జీలు, రక్తస్రావం సమస్యలు, జ్వరంతో ఉన్నవాళ్లు, బ్లడ్ థిన్నర్లు (రక్తాన్ని పలుచ బరిచే మందులు) వాడుతున్న వారు, రోగనిరోధక శక్తి తక్కువున్న వారు.. కోవాగ్జిన్ టీకాను తీసుకోకపోవడమే మంచిదని సూచించింది. కోవాగ్జిన్ తీసుకోవా లని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నుంచి సందేశాలు అందినవారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. ఈ మేరకు ఐదు పేజీలతో కోవాగ్జిన్ టీకా ఫ్యాక్ట్‌షీట్‌ను భారత్ బయోటెక్ తాజాగా విడుదల చేసింది. టీకా వేసుకునే ముందు కేంద్రంలో కోవాగ్జిన్‌పై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించింది. అనంతరం వేసుకోవాలా? లేదా? అనేది లబ్దిదారుల ఇష్టమేనని స్పష్టం చేసింది. టీకా వేసుకోవడానికి లేదా తిరస్కరించడానికి కూడా లబ్దిదారుడికి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. నెల రోజుల్లో దాని సామర్థ్యంపై స్పష్టత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలో కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించిందని ఫ్యాక్ట్‌షీట్‌లో భారత్ బయోటెక్ తెలిపింది. అందువల్ల వ్యాక్సిన్ వేసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎందుకంటే దీనికి సంబంధించి మూడో విడత క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయని వివరించింది. ఈ నెల 6వ తేదీన మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా 25,800 మందికి కోవాగ్జిన్ మొదటి డోస్ ఇచ్చారు. వారికి రెండో ఇంజెక్షన్ ఫిబ్రవరి 4వ తేదీన వేస్తారు. అప్పటి నుంచి 14 రోజులకు అంటే ఫిబ్రవరి 18వ తేదీ నాటికి వారిలో... ఎందరిలో ఏమేరకు యాంటీబాడీలు తయారయ్యాయో నిర్దారణకు వస్తారు. అంటే దాని సామర్థ్యం మరో నెలకు తెలుస్తుందని తెలిపింది. ఈ సమస్యలు రావొచ్చు... కోవాగ్జిన్ టీకా తీసుకున్న కొందరిలో సాధారణంగా 14 రకాల సైడ్ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. వికారం, వాంతులు, దద్దుర్లు, నీరసం, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, ఇంజెక్షన్ వేసినచోట నొప్పి, వాపు, ఎర్రబారడం, దురద వంటివి ఉంటాయి. అలాగే ఇంజెక్షన్ వేసిన చేయి పైభాగం బిగుతుగా (కండరాలు పట్టేసినట్లుగా) తయారవుతుంది. ఇలా కొందరిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. ఇక చాలా అరుదుగా కొందరిలో ఐదు రకాల సీరియస్ సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందని తెలిపింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, ముఖంపైనా, గొంతులో వాపు రావడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం, మైకంతో కూడిన నీరసం ఏర్పడటం జరుగుతుంది. వ్యాక్సినేషన్ ముందు డాక్టర్‌కు ఇవి చెప్పాలి... – ఏమైనా రెగ్యులర్‌గా మందులు వాడుతున్నారా? దేనికోసం వాడుతున్నారు? ఆయా వివరాలు. – ఏమైనా అలర్జీలు ఉన్నాయా? – జ్వరం ఉందా – రక్తస్రావం వంటి సమస్యలు – బ్లడ్ థిన్నర్ వాడుతున్నారా? – రోగ నిరోధక శక్తికి సంబంధించి సమస్యలున్నాయా? – గర్భంతో ఉన్నారా? – పాలు ఇచ్చే తల్లులా – ఇంతకుముందు ఏదైనా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? మూడు నెలల పర్యవేక్షణ... దాదాపు క్లినికల్ ట్రయల్స్ పద్దతిలోనే ఈ వ్యాక్సిన్‌ను లబ్దిదారులకు వేస్తారు. ఇది అన్నిచోట్ల అందుబాటులో ఉండదు. కాబట్టి నిర్దేశించిన టీకా కేంద్రాల్లోనే వీటిని వేయాలి. రెండు డోసులు వేసుకున్నాక చివరి డోస్ నుంచి మూడు నెలల వరకు టీకాదారుల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. వారికి ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ వస్తే ప్రభుత్వ నిర్దేశిత ఆసుపత్రుల్లో చికిత్స ఇస్తారు. టీకా వేసుకున్నవారు అవసరమైతే భారత్ బయోటెక్‌కు చెందిన టోల్‌ఫ్రీ నెంబర్ 18001022245కు ఫోన్ చేయవచ్చు. ఒకవేళ ఏదైనా సీరియస్ సైడ్ఎఫెక్ట్స్ వస్తే ఐసీఎంఆర్ నైతిక విలువల కమిటీ విచారణ అనంతరం వాళ్లకు నష్టపరిహారాన్ని కంపెనీ చెల్లిస్తుంది. వీటన్నింటినీ ఒప్పుకున్నవారు కోవాగ్జిన్ టీకా వేసుకునేముందు అంగీకారపత్రం పైనా సంతకం చేసి ఇవ్వాలి. -
11 నగరాలకు కోవాగ్జిన్
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ ను దేశంలోని 11 నగరాలకు చేర్చామని, ప్రభుత్వానికి దాదాపు 16.5 లక్షల డోసుల వ్యాక్సిన్లను విరాళంగా ఇచ్చినట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ (బీఈ) వెల్లడించింది. ఈమేరకు ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి నిర్వహించ నున్న టీకా కార్యక్రమం కోసం భారత ప్రభు త్వం బీఈ నుంచి 55 లక్షల డోసుల కోవాగ్జిన్‌ను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తొలి విడతగా శంషాబాద్ అంతర్జాతీ య విమానాశ్రయం నుంచి గన్నవరం, గువా హటి, పట్నా, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, పుణే, భువనేశ్వర్, జైపూర్, చెన్నై, లక్నో నగరాలకు బుధవారం టీకాలను సరఫరా చేసినట్లు బీఈ వివరించింది. నిర్వీర్యం చేసిన సార్స్–కోవ్2 వైరస్‌తో తయారు చేసిన కోవాగ్జిన్ దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో తయారైన తొలి టీకా కావడం గమనార్హం. -
‘ప్రజలను కాపాడటమే మా ప్రథమ కర్తవ్యం’
న్యూఢిల్లీ: భారత్‌లో రెండు కరోనావైరస్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమత్చిన నేపథ్యంలో పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే.. కోవాగ్జిన్‌కు ఎలా అనుమతి ఇచ్చారని విమర్శలు వెల్లువత్తాయి. కోవాగ్జిన్ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపడంపై నిన్న భారత్ బయోటెక్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో దీనికి ముగింపు పలికేందుకు రెండు సంస్థలు ముందుకు వచ్చాయి. వివాదానికి శుభం కార్డు వేస్తూ భారత్ బయోటెక్, సీరం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. (చదవండి: ఎందుకు భారత వ్యాక్సిన్లపై వివాదం...?) Important Announcement: Joint statement @BharatBiotech and @SerumInstIndia pic.twitter.com/la5av27Mqy — SerumInstituteIndia (@SerumInstIndia) January 5, 2021 ప్రపంచానికి కరోనా టీకాలు అందించాలన్నదే తమ లక్ష్యం అని.. ప్రజలను కాపాడటమే తమ కర్తవ్యం అని రెండు కంపెనీలు తెలిపాయి. ప్రజలను కరోనా నుంచి రక్షించే సత్తా వ్యాక్సిన్లకు ఉంది అని స్పష్టం చేశాయి. తమ టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చిందని.. ప్రస్తుతం టీకాల ఉత్పత్తి, పంపిణీపై దృష్టి పెట్టామని భారత్ బయోటెక్, సీరం ఈ ప్రకటనలో తెలిపాయి. వ్యాక్సిన్ల పంపిణీ సవ్యంగా జరిగేలా చూస్తామని వెల్లడించాయి. అంతేకాక తమ వ్యాక్సిన్లను ప్రపంచం అంతా వినియోగించేలా చూస్తామని ప్రతిజ్ఞ చేశాయి. కోవిడ్ -19 వ్యాక్సిన్లకు సంబంధించిన వివాదంపై ఇరు కంపెనీలు సంయుక్తంగా వివరణ ఇవ్వబోతున్నాయని ముందురోజు అదార్ పూనావాలా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
స్ట్రెయిన్: ‘ఆ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయి’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ నిరోధానికి అభివృద్ధి చేస్తున్న టీకాలు రూపాంతరిత వైరస్‌పై కూడా సమర్థంగా పనిచేస్తాయని భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణా ఎల్లా స్పష్టం చేశారు. వైరస్ కొమ్ములోని పలు భాగాలను లక్ష్యంగా చేసుకోగల వ్యాక్సిన్లు ఉండటం.. ఇటు నిర్వీర్యం చేసిన వైరస్ ఆధారంగా తయారైన టీకాలో రెండు రకాల ప్రొటీన్లుండటం ఇందుకు కారణమని తెలిపారు. ప్రఖ్యాత వైరాలజిస్ట్ మనోహర్ వీఎన్ శిరోద్కర్ స్మారకార్థం తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆన్లైన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ‘ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ హెల్త్–అవర్ జర్నీ’ అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ‘ప్రకృతిలో ఇప్పటికీ మనకు తెలియని వైరస్లు ఎన్నో ఉన్నాయి. మానవాళి మరింత జాగ్రత్త గా వ్యవహరించాలి’ అని అన్నారు. 1997లో ఓ స్టార్టప్ కంపెనీ మాదిరిగా వ్యాక్సిన్ తయారీ రంగంలో ప్రవేశించిన భారత్ బయోటెక్ పరిశోధనలతో ఒకప్పుడు రూ.800 ఉన్న హెపటైటిస్–బీ వ్యాక్సిన్ ధర ఇప్పుడు రూ.12కు చేరుకుంది. అనేక వ్యాధులకు టీకాలను అభివృద్ధి చేయడంలో విజయం సాధించాం’ అని కృష్ణా ఎల్లా అన్నారు.(చదవండి: కొత్త వైరస్కూ పాత జాగ్రత్తలే ) -
కోవిడ్ వ్యాక్సిన్ రూపకల్పనలో ముందడుగు
-
ప్రయోగ దశలో జికా వ్యాక్సీన్లు!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్‌ను నియంత్రించడంలో భారత్ ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ వైరస్‌తో పోరాడేందుకు వ్యాక్సిన్లను తీసుకురానున్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ వాటిపై క్లినికల్ ట్రయల్స్ చేపడుతోంది.. ఇవి విజయవంతమైతే భారత్ ప్రపంచ బయోటెక్ రంగంలో అగ్రభాగాన నిలవనుంది. భారత్ బయోటెక్ ఇలాంటి రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసినట్లు ప్రకటించడం తెలిసిందే. జికా మన దేశంలో లేనప్పటికీ భారత్ బయోటెక్ ప్రయోగాలు చేపట్టింది. వ్యాక్సిన్‌కు పేటెంట్ దక్కించుకోవడంతో ఈ ప్రయోగంతో ప్రపంచదేశాల కన్నా భారత్ ముందే ఉందనే చెప్పొచ్చు. భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా నేతృత్వంలోని బృందం ఈ వ్యాక్సిన్లను తయారు చేసింది. అవి క్లినికల్ పరీక్షలకు సిద్ధమయ్యాయి. వాటిని ముందుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) నిపుణులు ఆమోదించాలి. ‘జికా వైరస్‌కు వ్యాక్సిన్లను భారత్ బయోటెక్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. వైరస్‌ను అడ్డుకోవడంలో ఏ మేరకు సత్ఫలితాలిస్తాయో పరీక్షించి ముందుకు తీసుకుపోతాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భారత్ బయోటెక్ సంస్థ హెపటైటిస్-బి, పోలియో వైరస్ వంటి వ్యాధులకు వ్యాక్సిన్లను తక్కువ ధరకే అందరికీ లభ్యమయ్యేలా తయారు చేస్తోందని సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలసి డయేరియాను అరికట్టేందుకు గాను ‘రోటావాక్’ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధిపరిచింది.