భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాగ్జిన్ టీకాను ప్రధాని మోదీ బ్రెజిల్‌లో ప్రమోట్ చేయడానికి çపూనుకున్న సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు బొల్సొనారో– మోదీల మధ్య నడచిన సంభాషణ పూర్తి వివరాల రికార్డు ఆధారంగా ఇప్పుడు బ్రెజిల్‌లో తీవ్రస్థాయిలో విచారణ సాగుతోంది. పైగా భారత్ నుంచి బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యే హెచ్.సి.క్యు ఔషధం లోతుపాతులపై బ్రెజిల్ సెనెట్ కమిషన్ కేంద్రీకరించింది. బొల్సొనారో ఉన్మాద చర్యలలో మన ప్రధాని మోదీని కూడా ఇరికించబోవడం ఒకటి! ప్రయివేట్ కంపెనీల వ్యాపారానికి ఐవర్ మెక్టిన్, తదితర మందుల్ని సరఫరా చేయడానికి ప్రభుత్వ నిధుల్ని వినియోగించడాన్ని బ్రెజిల్ సెనేటర్ అజీజ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రధాని మోదీ పేరు బ్రెజిల్ విచారణలో ప్రస్తావనకు రావడం మనకు బాధాకరమే. అందుకే ’ప్రజలముందు నిజం దాచొద్దు’ అని చెప్పడం.
1918 నాటి ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల ఆ శతాబ్ది నుంచి వచ్చిన పెద్ద గుణపాఠం– ‘‘ప్రభుత్వాలు ప్రజలకు అబద్ధాలు చెప్పరాదు’’ అని! ప్రపంచంలో ఎప్పుడు పెను వ్యాధులు పెల్లుబుకినా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వాలు అంటువ్యాధులకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియకుండా తొక్కిపెట్టడం వల్ల వ్యాధి విస్తరణ సమాచార వివరాలు పూర్తిగా కనుమరుగవుతాయి. ఫలితంగా నమూనాలు సేకరించాల్సిన వారు వాస్తవ విరుద్ధమైన సమాచారం అందించే ప్రమాదం ఉంటుంది. ఈ తప్పుడు లెక్కలనేవి తప్పుడు విధానాలకు, తప్పుడు కార్యక్రమాల రూపకల్పనకు దారితీస్తాయి. కనుక సంబంధిత నిపుణులకు సరైన వివరాలు అందుబాటులో ఉండితీరాలి. ’’
- ప్రసిద్ధ ప్రపంచ చరిత్రకారుడు జాన్ బారీ
రెండు బ్రెజిలియన్ ప్రైవేట్ ఫార్మా కంపెనీలు ‘ఫ్లూ’ సంబంధిత వైరస్ వ్యాధులకు వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును ఉత్పత్తి చేయ డానికి అనువైన ముడి సరుకును భారతదేశం నుంచి బ్రెజిల్‌కు ఎగు మతి చేయవలసిందిగా బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో అడిగిందే తడ వుగా భారత ప్రధాని నరేంద్రమోదీ హుటాహుటిన ముడి సరుకును పంపించడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన రహస్య సంభాషణపై బ్రెజిల్ పార్లమెంటరీ కమిషన్ విచారణ జరుపుతోంది. అందులో మోదీ ప్రస్తావన చోటు చేసుకుంది. 2020 ఏప్రిల్ 4న బొల్సొనారో– మోదీల మధ్య సాగిన పూర్తి సంభాషణ నివేదికలోని కొన్ని భాగాలను ‘‘గోబో’’ వార్తా పత్రిక ప్రచురించింది.
ఇంతకూ మోదీ అసలు ఏ ఫార్మా వ్యాపార కంపెనీని ప్రమోట్ చేసిన సందర్భంలో బ్రెజిల్ పార్లమెంటరీ సెనేట్ కమిషన్ విచారణలో మోదీ ప్రస్తావన ప్రముఖంగా తలెత్తింది? భారత బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాగ్జిన్ టీకాను మోదీ ప్రమోట్ చేయడానికి పూనుకున్న సందర్భంగా బొల్సొనారో– మోదీల మధ్య నడచిన సంభాషణ పూర్తి వివరాలు రికార్డు అయిన ఉదంతాన్ని బ్రెజిల్ సెనెటర్స్ ప్రత్యేక కమిషన్ పేర్కొని బహిర్గతం చేయడం అసలు విశేషం. బ్రెజిల్ ప్రయి వేట్ ఫార్మా కంపెనీలలో ఒకటి– బ్రెజిల్‌లో భారత్ బయోటెక్ ప్రయి వేట్ కంపెనీ ప్రతినిధిగా ఉన్న ప్రెసిసా మెడికమెంటోస్. రెండవ బ్రెజి లియన్ కంపెనీ ‘అప్‌సేన్’. ఇది బ్రెజిల్‌లో ‘ఫ్లూ’ సంబంధిత అంటు వ్యాధుల నిరోధానికి వాడే భారత ఔషధం (టీకా) హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)ని ఉత్పత్తి చేసే సంస్థ అని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొ నారో భారత ప్రధాని మోదీకి తెలుపుతూ.. కోవిడ్– 19 వ్యాధి పీడితు లకు ఈ మందును వాడటం వల్ల ప్రోత్సాహకర ఫలితాలు వస్తు న్నాయి కాబట్టి ఈ మందుకు ఉపయోగించే ముడిసరుకును బ్రెజిల్‌కు త్వరగా పంపించాలని కోరారు (4–4–2020). ఈ సంభాషణ పూర్తి పాఠాన్ని బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నమోదు చేసింది.
ఈ పాఠాన్ని కాస్తా ‘‘ఓ గ్లోబ్’’ వార్తా పత్రికలో భాగాల కింద ప్రచురించింది. రెండు బ్రెజిలియన్ కంపెనీలకు తక్షణం హెచ్‌సీక్యూ ఔషధం ముడిసరుకును పంపాలని మోదీని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొ నారో కోరడమూ, ‘‘బ్రెజిల్‌కు తక్షణం ఇండియా సహాయపడటానికి శాయశక్తులా సిద్ధమని మోదీ ప్రకటించడమూ’’ బ్రెజిల్ విదేశాంగ శాఖ మంత్రి ఎర్నెస్టో అరయుదో సమక్షంలో రికార్డయిందని సావో పాలో నుంచి సుప్రసిద్ధ జర్నలిస్టులు షోభన్ సాక్సేనా, ఫ్లోరెన్సియా కోస్టాలు రాసిన రిపోర్టును ‘‘వైర్’’ సంస్థ వరల్డ్ ఎనాలసిస్ సమీక్షలో వెల్లడించింది. బొల్సొనారో బ్రెజిల్ అధ్యక్షుని హోదాలో వెలగబెడు తున్న పెక్కు ఉన్మాద చర్యలలో భారత ప్రధాని మోదీని కూడా ఇరికించబోవడం ఒకటి! ఫలితంగా బ్రెజిల్ పార్లమెంటరీ ఉన్నత స్థాయి కమిషన్ విచారణలోకి మోదీని కూడా లాగడం విశేషం!
బ్రెజిల్ టి.వి. న్యూస్ చానల్స్ అన్నీ ఈ ఉదంతాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయని కూడా ‘‘వైర్’’ విశ్లేషణ. పైగా ఉభయ నాయకుల సంభాషణ, ఫొటోలు ప్రముఖంగా అక్కడి చానల్స్‌లో వైరల్ అయ్యాయి. అంతేగాదు, తన పని నెరవేర్చుకునే సందర్భంలో బొల్సొ నారో రామాయణ కావ్యంలో రాముడి సోదరుడు లక్ష్మణుని రక్షిం చడం కోసం రాముని బంటు హనుమాన్ హిమాలయాల నుంచి తెచ్చిన ‘‘సంజీవని’’ ప్రయోగం ఎలా పని చేసిందో కూడా ఉదాహరిం చడం విశేషం! బహుశా ఇందుకేనేమో... కొంటె అమెరికన్ రాజకీయ వేత్తలు కొందరు ఇటీవల పతనమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ ప్రెసిడెంట్ బొల్సొనారోను, భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిపి ‘‘ ప్రజాస్వామ్య వ్యతిరేక పక్షం’’ గా ఒకేగాటన కట్టడా నికి సాహసించారు!
మరో విశేషమేమంటే, ఇండియాతో సంబంధం ఉన్న రెండు బ్రెజిలియన్ ప్రయివేట్ ఫార్మా కంపెనీలలో ఒకటైన ఇ.ఎమ్. ఎస్’’ బ్రెజిల్‌లో జెనరిక్ మెడిసిన్స్ ఉత్పత్తి చేసే బడా కంపెనీ కాగా, ‘‘ఆప్సెన్’’ బ్రెజిల్‌లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్.సి.క్యు) ఔషధాన్ని భారీగా ఉత్పత్తి చేసే కంపెనీ. కానీ ఈ రెండు బడా ప్రయివేటు ఫార్మా కంపెనీల యజమానులు బొల్సొనారోకు బడా బడా తబలిస్టులని బెల్జియన్ పత్రికల భావన! బొల్సొనారో– మోదీల మధ్య సాగిన సంభాషణ పూర్తి పాఠాన్ని ఒకవైపు సెనెటర్స్ కమిషన్ పరిశీలిస్తుండ గానే ఇండియా నుంచి బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యే హెచ్.సి.క్యు ఔషధం లోతుపాతులపై బ్రెజిల్ సెనెట్ కమిషన్ కేంద్రీకరించింది. పైగా సెనెట్ విచారణ సంఘం ఉపాధ్యక్షుడైన సెనెటర్ రాండోల్ఫి రోడ్రిగస్ ఈలోగా రెండు బడా బ్రెజిల్ ఫార్మా కంపెనీల ఉన్నతాధి కారులను వారి బ్యాంకు, టెలిఫోన్ రికార్డులు అన్నింటినీ విచారణా సంఘానికి తక్షణం దఖలుపర్చాలని ఆదేశించడం కొసమెరుపు అని బ్రెజిల్ పత్రికలు పేర్కొన్నాయని కూడా ’వైర్’ సమాచారం.
కాగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ దిగుమతుల కుంభకోణంలో బెల్జియన్ పాలకవర్గంలో లేదా దాని వందిమాగధుల్లో ఎవరెవరికి ఎంతెంత మొత్తం ముట్టి ఉంది అనే అంశంపై బ్రెజిల్ పార్లమెంటరీ కమిషన్ అధ్యక్షుడు ఒమర్ అజీజ్ తాజాగా విచారణ జరుపుతున్నారు. పైగా ప్రయివేట్ కంపెనీల వ్యాపారానికి ప్రజాధనాన్ని (ప్రభుత్వ నిధుల్ని) వినియోగించి ఐవర్ మెక్టిన్, తదితర మందుల్ని సరఫరా చేయడానికి వినియోగించడాన్ని సెనేటర్ అజీజ్ తీవ్రంగా దుయ్యబట్టారు. పైగా బొల్సొనారో చైనాను రెచ్చగొడుతూ యూరప్ దేశాధిపతులతో చేతులు కలపడాన్ని కూడా అజీజ్ విమర్శించారు.
ఇంతకూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమోట్ చేయగా బొల్సొనారో కళ్లకద్దుకున్న భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు ప్రశంస నీయమైన ఉత్పత్తి నాణ్యతా ప్రమాణాలు గల టీకా అన్న సర్టిఫికెట్ ఇవ్వడానికి బ్రెజిల్ సాధికార ఆరోగ్య సంస్థ నిరాకరించడం పెద్ద కొసమెరుపు. కోవాగ్జిన్ మూడవ దశ నాణ్యతా పరీక్షలు నిర్ధారణ అయ్యేదాకా ఆ సంస్థ తయారు చేసిన టీకాను బ్రెజిల్‌కి దిగుమతి చేయరాదని దాని ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఆది నుంచీ ప్రముఖంగా పేర్కొంటూ వస్తున్న భారత సుప్రసిద్ధ వైరాలజిస్టు గంగదీప్ కౌర్ ఇప్పటికీ పదే పదే దీనిపై విమర్శిస్తూ ఉండటం ఈ సందర్భంలో గమనార్హం. కానీ ఈ లోపుగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు బ్రెజిల్ పార్లమెంటరీ కమిషన్ విచారణలో ప్రస్తావనకు రావడం మనకు బాధాకరమే. అందుకే ’ప్రజలముందు నిజం దాచొద్దు’ అని చెప్పడం. అందుకే ఎప్పుడూ ప్రజల మాటే పాలకుల కోటగా వర్ధిల్లాలి. లేకపోతే బుచ్చయ్య అనే భూతానికి రామయ్య అనే రక్ష రేక అవసరం కల్గుతుందన్న సామెతలో ఎంత నిజముందో!
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment