సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో అవి కలరా తీవ్రంగా విజృంభిస్తున్న రోజులు. 33 ఏళ్ల వాల్డీమర్ హాఫ్‌కిన్ 1893లో కలరా వ్యాక్సిన్‌తో భారత్‌లో అడుగుపెట్టారు. ఆయన బ్రిటిష్ ఆధ్వర్యంలో నడుస్తున్న వైద్య కేంద్రానికి వెళ్లారు. ఆయన తయారు చేసిన వ్యాక్సిన్‌ను గుర్తించేందుకు అక్కడి వైద్యాధికారులు నిరాకరించారు. అందుకు కారణం ఆయన వైద్యుడు కాకపోవడమే. ఆయన వ్యాక్సిన్‌ను భారతీయులు కూడా నమ్మలేదు. వాల్డీమర్ జువాలోజిస్ట్. రష్యా యూదుల జాతికి చెందిన వారవడంతో రాజకీయంగా కూడా భారతీయుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఆయన కనుగొన్న కలరా వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ ద్వారా వారం రోజుల వ్యవధిలో రెండు డోస్‌లు ఇవ్వాల్సి ఉంది. వాటిని తీసుకునేందుకు కొన్ని నెలల వరకు ఆయనకు వాలంటీర్లు దొరకలేదు. ఆ తర్వాత ఆయన ఉత్తర భారత దేశమంతా తిరిగి 23 వేల మంది వాలంటీర్లను ఎంపిక చేసుకొని వారికి కలరా వ్యాక్సిన్లు ఇచ్చారట. వారిలో ఎవ్వరికి కలరా సోకలేదు. వారికి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వారు కలరాను సమర్థంగా ఎదుర్కొన్నారా లేదా వారికి నిజంగానే కలరా సోకలేదా? అన్న విషయం తేలక పోవడంతో ప్రజలు ఆయన వ్యాక్సిన్‌ను అంతగా నమ్మలేదు. (వ్యాక్సిన్ వద్దా.. లాక్‌డౌనే ముద్దా?)
1984, మార్చి నెలలో కోల్‌కతాకు చెందిన ఓ వైద్యాధికారి నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ఆ వైద్యాధికారి సూచనల మేరకు వాల్డీమర్ నగరంలోని మురికి వాడల్లోని మంచినీళ్ల ట్యాంకుల్లో, నగరం పొలిమేరకు సమీపంలో ఉన్న చిన్న చిన్న పేద గ్రామాలకు వెశ్లి వారి మంచీటి కుంటల్లో, చెరువుల్లో కలరా వ్యాక్సిన్ ఉండలను కలిపారు. ఆయా గ్రామాల్లోని గుడిశె వాసులను కలుసుకొని వారికి వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు. ఒకే చోట నివసించే గుడిశె వాసులు వ్యాక్సిన్లు తీసుకోగా, కొందరు తీసుకోలేదు. తీసుకోని వారిలో కలరా పెరగడంతో వాల్డీమర్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. దీంతో ఆయన తన సహాయక బృందాన్ని కూడా పెంచుకున్నారు. బెంగాల్‌లోని కట్టాల్ బేగన్ బస్తీలో ఓ ఇద్దరు కలరా సోకి మరణించారనే వార్త తెల్సి వాల్డీమర్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. అక్కడ 200 మందిని పరీక్షించగా, వారిలో 116 మందికి కలరా సోకింది. వారందరికి కలరా డోస్‌లు ఇవ్వగానే వారిలో ఎక్కువ మంది కోలుకున్నారు. అప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిలో కొందరు మృత్యువాత పడ్డారు. వాల్డీమర్ వ్యాక్సిన్ పనిచేస్తున విషయాన్ని కోల్‌కతా జిల్లా వైద్యాధికారి గుర్తించారు. దాంతో వాల్డీమర్, భారతీయ వైద్యులైన చౌదరి, ఘోస్, ఛటర్జీ, దత్‌ల సహకారంతో దేశమంతా తిరుగుతూ కలరా డోస్‌లను ఇస్తూ కలరా మహమ్మారి నుంచి కొన్ని లక్షల భారతీయుల ప్రాణాలను రక్షించారు.
వైద్యుడు కాదని వ్యాక్సిన్‌ను నమ్మలేదు.. కానీ
Published Mon, Dec 14 2020 2:40 PM | Last Updated on Mon, Dec 14 2020 7:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment