టీమ్స్‌తో కాకుండా.. ఒంటరిగా పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువ అసంతృప్తితో ఉంటున్నారట. ‘అన్హ్యాపీయ్యెస్ట్ జాబ్స్’పై హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. విధి నిర్వహ ణలో సంతృప్తి పొందే విషయంలో మంచి జీతం, గౌరవం, విశ్వాసం, భద్రత, మంచి కెరీర్, ఇతర ప్రయోజ నాలు వంటివి కీలకపాత్ర పోషిస్తున్నట్టు గతంలోనే పలు అధ్యయనాలు స్పష్టంచేశాయి.
అయితే దీనికి భిన్నంగా వివిధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో అసంతృప్తి కలిగించే అంశా లేంటి, వాటికి కారణాలేంటి అనే దానిపై హార్వర్డ్ వర్సిటీ అధ్యయనం నిర్వహించింది. ఇందుకోసం ఐదేళ్లు, పదేళ్లు కాకుండా ఏకంగా 1938 నుంచి జరిగిన అధ్యయనాలను ఆధార ంగా తీసుకుంది. దాదాపు 85 ఏళ్ల కాలవ్యవధి లో ఆయా దశల్లో ఉద్యోగుల మానసిక స్థితి, జీవి తం వంటి వాటిపై పరిశీలన జరిపింది.
ముఖ్యంగా ఓవర్‌నైట్ షిఫ్ట్‌లు, ట్రక్ డ్రైవింగ్, నైట్ సెక్యూ రిటీతోపాటు టెక్ ఆధారిత పరిశ్రమలు, ప్యాకే జీ, ఫుడ్ డెలివరీ సర్వీసెస్, ఆన్‌లైన్ రిటైల్ జాబ్స్ వంటి విధుల నిర్వహణలో ఉద్యోగులు ఒంటరి తనం ఫీలై అసంతృప్తికి గురవుతున్నట్టు తేలింది. మనుషులతో కానీ, చేస్తున్న పనులతోనూ అంతగా మమేకం కాకపోతే చేస్తున్న పనిలో, ఉద్యో గంలో సంతృప్తి ఉండదని ఉద్యోగులు చెప్పారు. – సాక్షి, హైదరాబాద్
ఏం చేయాలి?
♦ మిత్రులు, సహోద్యోగులతో తమకున్న ఆసక్తులు, అభిరుచులు పంచుకోవాలి.
♦ తోటి ఉద్యోగులు, టీం సభ్యులతో స్నేహసంబంధాలు పెంచుకుంటే అది ఉద్యోగుల్లో మనో బలం పెరిగేందుకు దోహదపడుతుంది. ఫలి తంగా మరింత చురుగ్గా పనిచేసే అవకాశం ఉంటుంది.
♦ ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవడం లేదా క్లబ్‌గా ఏర్పడటం, పుస్తకాలు చదవడం, గేమింగ్ కమ్యూ నిటీగా ఏర్పడటం వంటివి చేయాలి. ఇతరుల సహాయం కోరడంతోపాటు, వారికి సహాయపడేందుకూ సిద్ధంగా ఉండాలి.
♦ టీం సభ్యులతో పనికి సంబంధించిన అంశాలతోపాటు ఇతరత్రా అంశాలపైనా చర్చించాలి.
♦ పనిప్రదేశాల్లో సహోద్యోగులతో సానుకూల సంబంధాల వల్ల పని ఒత్తిడితో పాటు ఆందోళన, అయోమయం వంటివీ తగ్గుతాయి.
ఇంకా ఈ నివేదికలో ఏముందంటే..
♦ బిజీ జాబ్స్ చేస్తున్నా ఇతరులు, సాటి ఉద్యోగులతో సానుకూల ఇంటరాక్షన్లు లేకపోతే ఉద్యోగులు ఒంటరిగా ఉన్నామన్న భావనలో ఉంటున్నారు.
♦ సహోద్యోగులు, మనుషులను కలుసుకునే అవకాశం లేకపోతే అదొక పెద్ద వెలితిగా ఉంటుంది. వారితో కొంత సమయం గడిపితే పనిపట్ల సంతృప్తితోపాటు మెరుగ్గా విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది.
♦ కోవిడ్ కారణంగా ‘రిమోట్‌వర్క్’విధానంతో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి
♦ ముఖ్యంగా టెక్, ఫుడ్ డెలివరీ, ఆన్‌లైన్ రిటైల్ సర్విసెస్ తదితర రంగాల్లోని ఉద్యోగులు ఒంటరితనాన్ని అధికంగా ఫీల్ అవుతున్నారు.
టీమ్ వర్క్ ముఖ్యం
రోజువారీ పనులు, ఉద్యోగంలో సమతూకం సాధించడం వంటి వాటిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇదొకటి. ఉద్యోగం–జీవితంలో సంతృప్తి తదితరాలకు సంబంధించిన ఒక పాత రహస్యాన్ని కనుగొనేందుకు ఇది దోహదపడింది. ఉత్పాదకత కోసమే కాకుండా ఉద్యోగుల్లో మనోబలం పెంచేందుకు టీమ్ వర్క్ ముఖ్యమనే విషయం మరోసారి స్పష్టమైంది. –ప్రొ.రాబర్ట్ వాల్డింగర్, హార్వర్డ్ స్టడీ ఆఫ్ ఆడిట్ డెవలప్‌మెంట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment