
ముంబై: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలో 10 రోజుల పాటు ఘనంగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇక్కడి లాల్‌బాగ్చా రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. లాల్‌బాగ్‌లో పూజలు అందుకునే వినాయకుణ్ణి చూసేందుకు మనదేశం నుంచే కాదు ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.
సెంట్రల్ ముంబైలోని లాల్‌బాగ్ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన గణేశుడిని లాల్‌బాగ్చా రాజా అని పిలుస్తుంటారు. ఉత్సవాల సమయంలో లాల్ బాగ్ ప్రాంతమంతా భక్తులతో కళకళలాడుతుంటుంది. గణేశుని దర్శనం కోసం భక్తులు క్యూ కడుతుంటారు. ఇక్కడి వేదికపై ప్రతిష్ఠించిన విఘ్నహర్త గణేశుడి విగ్రహాన్ని నవశాచ గణపతి అంటారు. ఈ రూపం భక్తుల సమస్త కోరికలను తీరుస్తుందని చెబుతుంటారు.
లాల్‌బాగ్‌లో నిర్వహించే 10 రోజుల గణేశ ఉత్సవంలో ప్రతిరోజూ లక్షల మంది భక్తులు స్వామివారిని చూసేందుకు తరలి వస్తుంటారు. ఈ 20 అడుగుల ఎత్తయిన విఘ్నహర్త విగ్రహాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. 89 ఏళ్లుగా ఈ అందమైన బప్పా విగ్రహాన్ని రూపొందించే బాధ్యతను కాంబ్లీ కుటుంబం పర్యవేక్షిస్తోంది.
కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు ఇక్కడి గణపతి బప్పాను దర్శించుకుని, ఆశీస్సులు పొందుతారు. బాలీవుడ్ ప్రముఖులతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు కూడా లాల్‌బాగ్చా రాజా ఆశీర్వాదం కోసం ఇక్కడికి వస్తారు.
Comments
Please login to add a commentAdd a comment