న్యూఢిల్లీ: మన దేశంలో ఓటర్ల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. 1951 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఓటర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి మన దేశంలో రిజిస్టర్ ఓటర్లు 94.50 కోట్లు అని కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడింది. అయితే ఈ ఓటర్లలో దాదాపుగా మూడో వంతు మంది ఓటుకి దూరంగా ఉండడం ప్రజాస్వామ్యంలోనే విషాదకరం.
ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పట్నుంచే కేంద్ర ఎన్నికల సంఘం వ్యూహాలు పన్నుతోంది. మొట్టమొదటిసారి 1951లో ఓటర్ల జాబితాను రూపొందించినప్పుడు 17.32 కోట్ల మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 45.67% ఓటింగ్ నమోదైంది. 1957 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 19.37 కోట్లు ఉంటే 47.44% మంది ఓటు వేశారు. 2009 నాటికి ఓటర్ల సంఖ్య భారీగా 71.7 కోట్లకు పెరిగినప్పటికీ ఓటింగ్ శాతం 58.21 మాత్రమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 91.20 రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటే 67.40శాతం మంది తమ ఓటు హక్కు
Comments
Please login to add a commentAdd a comment