అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా? | Indians Expenditure For Education In America Near 7 Billion Dollars | Sakshi
Sakshi News home page

అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?

Published Fri, Nov 20 2020 8:30 PM | Last Updated on Fri, Nov 20 2020 9:04 PM

Indians Expenditure For Education In America Near 7 Billion Dollars - Sakshi

సాక్షి, అమరావతి: అమెరికాలో ఉన్నత విద్య అంటే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో క్రేజ్‌. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా మనవాళ్లు వెనుకాడటం లేదు. 2019-20లో అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏకంగా 7.60 బిలియన్‌ డాలర్లు వెచ్చించడం విశేషం. ఆ దేశంలో అత్యధికంగా చదువుతున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో గత ఐదేళ్లతో పోలిస్తే 2019-20లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు 4.40 శాతం తగ్గారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావంతో 2020-21కి ముందస్తు దరఖాస్తులు దాదాపు 40 శాతం తగ్గిపోయాయి. ఈ మేరకు అమెరికా స్టేట్‌ బ్యూరో ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

27 టాప్‌ యూనివర్సిటీల వైపే భారతీయుల మొగ్గు 
► అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో 1,93,124 మంది భారతీయ విద్యార్థులే. సంఖ్యాపరంగా విదేశీ విద్యార్థుల్లో చైనీయులు మొదటి స్థానం (3.72 లక్షల మంది)లో ఉన్నారు.
► భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెడిసిన్‌, మ్యాథ్స్‌ కోర్సుల్లో ఎంఎస్‌, పీహెచ్‌డీ చేస్తున్నారు. 
► అమెరికాలో మొత్తం 74 యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది 27 టాప్‌ యూనివర్సిటీల్లోనే చేరారు.  
► కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, మసాచుసెట్స్‌, ఇల్లినాయిస్‌, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఓహియో, మిచిగాన్‌, ఇండియానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. 
► మన దేశీయులు అత్యధికంగా చేరుతున్నవాటిలో న్యూయార్క్‌ యూనివర్సిటీ, నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ (బోస్టన్‌), యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ► ఇల్లినాయిస్‌, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (లాస్‌ఏంజెల్స్‌), యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (శాండియాగో), పర్డు‍్య యూనివర్సిటీ, బోస్టన్‌ యూనివర్సిటీలు ఉన్నాయి.
► 2019-20లో అమెరికాలో మొత్తం 10.75 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యాభాస్యం చేశారు. ఆ దేశంలో మొత్తం విద్యార్థుల్లో విదేశీ విద్యార్థుల వాటా 5.50 శాతం. వీరు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 44 బిలియన్‌ డాలర్లు సమకూర్చారు. 

గత నాలుగేళ్లలో యూఎస్‌లో భారతీయ విద్యార్థులు ఇలా..
 

విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య
 2018-19 1,96,271
2017-18 1,86,924
2016-17  1,86,000
 2015-16 1,65,918

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement